తెలుగు సినిమాలో బామ్మా పాత్ర అంటే, నిర్మలమ్మ గారే కళ్ళ ముందు కనిపిస్తారు. ఎన్నో సినిమాలలో మన నానమ్మ ని తలపించేలా కనిపించారు మనల్ని నవ్వించారు కొన్నిసార్లు ఏడిపించారు కూడా. ముఖ్యంగా చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారితో ఆమె టైమింగ్ ఒక రేంజ్ లో ఉంటాయి. 1956 నుండి 2002 వరకు ఎన్నో పాత్రల లో కనిపించి, మెప్పించారు. ముఖ్యంగా "దొంగ సచ్చినోడా" అని హీరో ని తిడుతుంటే, మనల్ని మన బామ్మా అమ్మమ్మలు తిట్టే తిట్లు గుర్తొచ్చేవి. నిర్మలమ్మ గారి చిన్నప్పటి ఫోటోలలో కొన్ని ఇవి.





అలాగే, మన బామ్మా ని అమ్మమ్మ ని గుర్తుచేసిన నిర్మలమ్మ గారి కొన్ని పాత్రలని ఒక సారి చూసొద్దాం రండి.
1. అలీబాబా అరడజను దొంగలు మన లో చాలా మందికి నిర్మలమ్మ గారెంటే మొదట గుర్తొచ్చే సినిమా ఇది. లంగా వోణి వేస్కుని, తన భర్త కోసం ఎదురు చూసే హీరో మేనత్త లాగ రాజేంద్ర ప్రసాద్ గారిని ఏడిపిస్తుంటే, మనకు మాత్రం నవ్వొస్తుంది. సినిమా చివర్లో "కర్తవ్యం విజయశాంతి" getup వేరే level.
2. స్వాతిముత్యం ఈ సీన్ మొత్తం నిర్మలమ్మ గారి performance చూసి చాలా emotional అయిపోతాం. One of the best scenes in her career.
3. శంకరాభరణం ఇందులో అయితే, మన ఇంట్లో ని బామ్మా అమ్మమ్మ కి exact Xerox copy లా ఉంటారు. "ఒరేయ్ కాముడు.."
4. మంత్రి గారి వియ్యంకుడు ఈ సినిమా లో ఆమె పాత్ర చాలా డైనమిక్ గా ఉంటుంది. ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది.
5. మాయలోడు ఎస్వీ.కృష్ణారెడ్డి గారు చేసిన ఎన్నో సినిమాలలో నిర్మలమ్మ గారు కనిపిస్తారు. ఆమె లో మన బామ్మా ని చూస్కునేలా చేసిన ఎన్నో పాత్రలను ఎస్వీ కృష్ణారెడ్డి గారు రాసారు.
6. ఆ ఒక్కటి అడక్కు ఈ సినిమా గురించి ఇప్పుడు నేనేమన్నా చెప్తే, "చెప్పావ్ లే రామాయణం" అని తిడతారు, కాబట్టి చూసేయండి.
7. కోదండ రాముడు ఈ పాట లో రూపాయి బిళ్ళంత బొట్టు తో నిండు నవ్వుతో ఎంత బాగుంటారో నిర్మలమ్మ గారు.
8. స్నేహం కోసం ఈ సినిమాలో నిర్మలమ్మ గారి పాత్ర వల్ల నవ్వుతాం, emotional కూడా అవుతాం. ముఖ్యంగా పెద్ద చిరంజీవి "ఆకలేస్తుంది అమ్మ" అనే సీన్.
9. గ్యాంగ్ లీడర్ చిరంజీవి ని కర్ర తో కొట్టే సీన్ ఉంటుంది... కచ్చితంగా ఈ సీన్ కి relate అవ్వకుండా ఉండలేం..
10. సీతారామరాజు పైన సినిమాలలో ఎంతో సౌమ్యంగా స్వచ్ఛమైన నిండు నవ్వుతో కనిపించే నిర్మలమ్మ గారు, ఈ సినిమా climax లో చేసే పెర్ఫార్మన్స్ change over kaa baap.
ఇన్ని పాత్రలతో ఇన్నిసార్లు నవ్వించినందుకు ఎంతో కృతజ్ఞతలు నిర్మలమ్మ గారు. ఎన్ని తరాలైన తెలుగు సినిమాలలో బామ్మా అంటే మీరే, మీరే కరెష్టు ఇంకెవ్వరి వల్ల కాదు.