Contributed By Vasudeva Sri Vamsi
* ఎటు పయనం.. ఎటు పయనం.. అంతుచిక్కని నీ గమ్యం... * కోతియుగం , రాతియుగం.. మారిన మన నవోదయం... * ఏమిలాభమేమిసుఖం.. ఎక్కడ సంపూర్ణత్వం.. * "హమ్మయ్య పురోగమనం " అనులోపే తిరోగమనం... * పెరుగుతున్న విజ్ఞానం .. తరుగుతున్న స్వజ్ఞానం... * ఎటు పయనం.. ఎటు పయనం.. అంతుచిక్కని నీ గమ్యం... * అబలకి రక్షణ కొరత .. చదువుకు జ్ఞానం కొరత... * మంచి ఉన్నది 4 శాతం .. చెడు ఉన్నది 5 శాతం.. మిగిలిన 90 శాతం గోడమీద పిల్లి వాటం... * ఎటు పయనం.. ఎటు పయనం... అంతుచిక్కని నీ గమ్యం... * పోతున్నాం పోతున్నాం అజ్ఞానపు చరలలోకి.. పోతున్నాం పోతున్నాం మూర్ఖత్వపు గనులలోకి. పోతున్నాం పోతున్నాం దిక్కెరగని బావి లోకి . పోతున్నాం ఎక్కడికో స్వార్ధం అనే పథం లోకి. నాశనమై పోతున్నాం మనకు మనం అంతుచిక్కని ఈ గమ్యం లోకి.