Contributed By Vijaya bhargavi
సొంతూరికి పరాయివవుతావు పరాయి చోటుకి ఏమీ కానివాడివి అవుతావు
ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి పోతున్నావు ఏది నీ గమ్యం, ఏది నీ అస్థిత్వం?
నీదన్నది కాని చోట ప్రతి పూట పోరాటమే పూట గడవడం కోసం అనునిత్యం ఆరాటమే
ప్రార్థించడానికి గుడి లేదు నీ బిడ్డలు చదవడానికి బడి లేదు ఉండడానికి నిలువ నీడ లేదు నీ గోడును వినేవారెవరు నీ బాధను తీర్చే నాథుడెవరు
ఓ వలస జీవీ.. గజిబిజి బతుకుల మానవ సమూహాల మధ్య ఏకాకిగా మిగిలావు నీ కన్నీళ్లనే కష్టంగా మర్చి శ్రమ జీవుల వెతలకు ప్రతినిధివైనావు !!