చెప్పాలా వద్దా అనే ఫీలింగ్ చెప్పేదాం అనే దైర్యం చేసి ఇక్కడికి వచ్చాను. 15 ఏళ్ళు గా నాలోనే దాచుకున్న ప్రేమను తనకు చెపుదాం అని బయలుదేరాను. ప్రేమ పుట్టాలి అంటే క్షణాలు చాలు కానీ ఆ ప్రేమను ప్రేమించేవాళ్ళకి చెప్పాలంటే కొన్ని యుగాలు కావాలి. చెప్పలేనంత దైర్యం కావాలి. పక్కనే ఉన్న పదేళ్ల పాటు తనపై ఉన్న ప్రేమను చెప్పలేకపోయాను. తాను దూరం అయినా తర్వాత కానీ నాకు తెలియలేదు, ఆ పదేళ్లు నేను వృధా చేసిన ఆ సమయం గురించి. ఇంతలా నన్ను పిచోడ్ని చేసిన ఆ ప్రేమ పేరు "స్పందన". 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తనని కలుస్తున్నాను. ఇక నా ప్రేమ ను తనకు చెప్పే క్షణం దగ్గరవుతున్న కొద్దీ నాలోని భయం పెరుగుతుంది. నిమిషం యుగం లా అనిపిస్తుంది. ఎన్నో ఆలోచనలు నా మైండ్ లో తిరుగుతున్నాయి. పదేళ్ల ప్రేమ, ఐదేళ్ల నిరీక్షణ, నాలుగు వందల మీటర్ల దూరం, మూడు పదాలు, ఇద్దరు మనుషులు, "ఒక్క నిమిషం"
ఒక నిమిషం తనపై ప్రేమను చెప్పటానికి ఒక నిమిషం తన సమాధానం నాకు చెప్పటానికి ఒక నిమిషం ఆ సమాధానంలో ఆనందం వెతుక్కోవటానికి ఒక నిమిషం ఆ సమాధానంలో బాధను భరించటానికి ఒక నిమిషం తన కౌగిలి లో చేరిపోవటానికి ఒక నిమిషం తన దరి నుండి దూరం కావటానికి ఒక నిమిషం ఆ క్షణానికి దగ్గరవ్వటానికి ఒక నిమిషం మరో యుగానికి తెర లేపటానికి ఒక నిమిషం తనతో గడిపిన మధుర క్షణాలను మరచిపోవటానికి
ఒక నిమిషం ఆ క్షణానికి కి దగ్గరయ్యే ఈ నిమిషం గడవడానికి ఒక నిమిషం స్నేహం అనే ఈ బంధం ప్రేమగా మారటానికి ఒక నిమిషం తనకు దూరం అవుతానన్న నా భయానికి దగ్గరవ్వటానికి ఒక నిమిషం నా ప్రేమను నాలోనే దాచుకోటానికి ఒక నిమిషం నా ప్రేమను నీతో పంచుకోటానికి ఒక నిమిషం భయం తో ఆగాలా బలితెగించి బరిలోకి దిగాలా అని ఆలోచించటానికి ఒక నిమిషం ఆ నిర్ణయాన్ని మార్చుకోటానికి
"ఆదర్ష్ stay with me.. Someone please help.... Ambulance!!!!!!!"
"ఆదర్ష్ నీకు ఏమి కాదు.. I am there."
పిలవని బంధువు ఒకరు నా లైఫ్ లో కి వచ్చారు. మనసు లో మాట ప్రేమించిన అమ్మాయికి చెపుదాం అనే నిమిషం లో నన్ను తన నుంచి దూరం చేసారు. ఈ సారి శాశ్వతంగా.
"మనసుపడిన నిమిషమే నీకు చెపుదాం అనుకున్న స్పందన, కానీ మృత్యువు ఒడిలో ఉన్నపుడు చెప్పాల్సి వస్తుంది. I Love you Spandana and I mean it.. "
తనను చూసిన మొదటి నిమిషం నా శ్వాస ఆగే చివరి నిమిషం నా కలం నుండి వచ్చే ప్రతి అక్షరం తన పై ఉన్న ప్రేమకు నిదర్శనం