ఓ గొప్ప సైంటిస్ట్ ఒక మాట అన్నారు "ఈ భూమి మీద ఏది ఎవ్వరూ కొత్తగా సృష్టించడం లేదు, పరిశోధనల ద్వారా ఉన్న వాటిని తెలుసుకుంటున్నాం అంతే" అని. ఒక ప్రశ్న, ఒక ఆలోచన దానిని తెలుసుకోవాలనే తపన ఉంటే ఎవ్వరైనా ఏదైనా సాధించగలరు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వ్యక్తి గట్టు శ్రావణ్. శ్రావణ్ ఒక లక్ష్యం చేధించగానే, ఒక విజయం దక్కగానే ఆగిపోలేదు ఒకదాని తర్వాత మరొకటి అంటూ దాదాపు 60 ఆవిష్కరణలు చేశారు. తన దగ్గరున్న గొప్ప టాలెంట్ ను డబ్బుకోసం ఉపయోగించుకోలేదు.. శ్రావణ్ ఆవిష్కరించిన ప్రతిది కూడా రైతులకు, సమజానికి అత్యంత ఉపయోగపడేదే అలాంటి వాటిని మాత్రమే రూపొందించారు.
Organic Fertilizers: చదువుకున్నది మెకానికల్ ఇంజనీరింగ్ ఐనా కాని రైతుల కోసం రీసెర్చ్ చేసి 21 రకాల పదార్ధాలతో ఎరువును తయారుచేశారు. ఈ ఎరువు వల్ల మూడు నెలల పాటు వర్షాలు పడకపోయినా కాని మొక్కలు ఏ ఆటంకం లేకుండా ఎదుగుతాయి. ఇది కేవలం ప్రయోగం దశలో లేదు, ఈ ఎరువును చాలామంది రైతులు ఉపయోగించుకుని విజయం సాధించారు. ఇది నిజంగా అద్భుతమైన ఎరువు అని "నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్" శాస్త్రవేత్తలు అభినందించి, ఆమోదం కూడా తెలిపారు.
AC Helmet: కార్ లో జర్ని చేసేవారికి ఇబ్బంది ఉండకపోవచ్చు కాని బైక్ మీద భయంకరమైన ఎండలో జర్ని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడో పరిష్కారం ఉంటుంది, ఉపాది ఉంటుంది.. దీనిని దృష్టిలో పెట్టుకునే శ్రావణ్ ఏ.సి హెల్మెట్ తయారు చేశారు.
Tyre Inflator, Jack System: లాంగ్ జర్ని చేస్తున్నప్పుడు, దగ్గరిలో మెకానిక్ షెడ్స్ లేనప్పుడు టైర్ పంక్చర్ ఐతే మాత్రం ముఖ్యంగా పెద్దవారికి, మహిళలకు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారికోసమే హైడ్రాలిక్ సిస్టమ్ జాకీ ని శ్రావణ్ కనుగొన్నాడు. దీనిని కార్ కు బిగించి మన మొబైల్ యాప్ లో ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేస్తే చాలు పంక్చర్ ఐనప్పుడు టైర్ మార్చుకునేందుకు వీలుగా కారు పైకి లేస్తుంది. అలాగే కార్ టైర్ పంక్చర్ ఐనా గాని గాలి తీసుకుని మళ్ళి యదావిధిగా కొంత దూరం ప్రయాణించేలా Tyre Inflator System కూడా రూపొందించారు.
ఇవేకాక ట్రాఫిక్ లో ఆంబులెన్స్ సిగ్నల్ దగ్గరికి రాగానే గ్రీన్ లైట్ వెలిగేలా సురక్ష పరికరం, కరెంట్ లేకున్నా మూడు గంటలు పనిచేసే కూలర్, దొంగల అలికిడిని కనిపెట్టే పరికరం, పాలిథిన్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, సీడ్ బాంబింగ్ ఇలా మొత్తం 60 రకాల ఆవిష్కరణలు ఆవిష్కరించారు. కేవలం 60 మాత్రమే ఆచరణలోకి వచ్చాయి ఇంకా 300 వరకు ఐడియాలు శ్రావణ్ దగ్గర ఉన్నాయి, వాటిని కూడా ఆవిష్కరించే ప్రయత్నంలో శ్రావణ్ ఉన్నారు.
Image Source: The New Indian Express