Every Music Lover Must Watch These Concerts & Interviews Of P.Susheela Garu

Updated on
Every Music Lover Must Watch These Concerts & Interviews Of P.Susheela Garu

12వేలకు పైగా తెలుగు పాటలు. 6వేలకు పైగా తమిళ పాటలు, 1200 పైగా కన్నడ, మలయాళ పాటలు. ఒక్క గాయనీమణి పి.సుశీల గారు. ఇప్పటికి ఆమె పాటలు వింటూ మైమరిచిపోతున్నామంటే ఆమె గాన మాధుర్యమెంతో వేరే చెప్పక్కర్లేదు. ఒకానొక సమయం లో గానం: ఎస్.పి బాలు, పి. సుశీల అనే పేరు చాలా సినిమాలలో కనిపించేవి. రీసెంట్ గా రిలీజ్ అయినా గద్దలకొండ గణేష్ సినిమా లో "ఎల్లువొచ్చి గోదారమ్మ" పాటని రీమిక్స్ చేశారు. అందులో సుశీల గారి గొంతుని అలానే ఉంచారు. సుశీల గారి గొంతులో ఉన్న మాధుర్యం వైవిధ్యం అలాంటిది.

ఆమె పాటలని casette లో, youtube లో విన్న జనరేషన్ మనం. ఆమె ఇచ్చిన కొన్ని live concerts చూసి ఆనందిద్దాం రండి.

1. జానకి గారు, సుశీల గారు కలిసి పాడుతుంటే, ఒక music lover కి అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు కదా..

2. గోదారి గట్టుంది.

3. కలయ నిజామా

4. ఆకులో ఆకునై

5.సుశీలమ్మ పాటలు చిత్ర గారి గొంతులో..

6 దశాబ్దాల అనుభవానికి రూపం సుశీల గారు. ఆమె అనుభవాలని జ్ఞాపకాలని చాలా సార్లు చాలా కార్యక్రమాలలో పంచుకున్నారు. వాటిలో కొన్ని ఇవి..

1. ఝుమ్మంది నాదం ఈ కార్యక్రమం ఒక పక్క ఆమె పాటలో పాడుతూనే, ఆ పాట వెనుక జరిగిన కథను చెప్తారు. వాటిలో ఎన్నో మనకు తెలియని విషయాలు, అప్పటి కళాకారులకి సినిమా మీదున్న ఇష్టాన్ని, ప్రేమని, గౌరవాన్ని చెప్పకనే చెప్తాయి. జనని శివ కామిని పాట ని రాయటానికి, compose చేయడానికి ఎంతో భక్తిగా నిష్టగా ఉండేవాళ్లంట.

2. సింగర్ అవ్వడం ఒక్క సారి గా జరిగే పని కాదు. ఎన్నో రోజులు సాధన చేయాలి ఎంతో శిక్షణ తీసుకోవాలి. సుశీలమ్మ గారి లాంటి ఒక legendary సింగర్ దగ్గర్నుండి future singers కి ఉపయోగ పడే interview ఇది. ఒక సింగర్ కి క్లాసికల్ backdrop ఉండటం ఎంత అవసరం. మాములుగా పాడే పాటలకి, mic లో పాడే పాటలకి పాడాల్సిన విధానాన్ని వివరించారు.

సుశీల గారి కోడలు, సంధ్య జయకృష్ణ గారు కూడా సింగర్. సుశీల గారి మనవరాలు శుభశ్రీ, రాములో రాముల పాటకి guitarist గా చేశారు.

3 తరాలు గా సినిమాకి, సంగీతానికి ఆమె చేస్తున్న సేవ అనిర్వచనీయం. ప్రతి రోజు ఆమె పాటని, ఆమె గొంతుని ఎక్కడ ఒక చోట వింటూ మైమరిచే ఎన్నో వేల మందిలో ఒకరి గా ఆమెకు ఇవే మా వందనాలు.

ఆమె పాటలు వింటూ ఆ పాత మధురాలని ఆస్వాదిద్దాం అనుకునే వారికోసం. Here are some playlists

బాలు గారు, సుశీల గారు కలిసి చాలా మంచి పాటలు పాడారు. అందులో melodies ఉన్నాయి, mass songs ఉన్నాయి.

ఘంటశాల, పి. సుశీల గారు కలిసి పాడిన పాటలని ఒక రాత్రి వేళ speaker పెట్టి వినండి.. you will thank me later.