20 Songs Of P. Susheela Garu That'll Take You To A Different World

Updated on
20 Songs Of P. Susheela Garu That'll Take You To A Different World

'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'.... ప్రపంచంలో అరుదైన రికార్డు నెలకొల్పిన వారికి ఈ పుస్తకం లో చోటు కల్పించి గౌరవిస్తారు, కేవలం మునుపెన్నడూ జరగని, ఎవరూ చేయని రికార్డు ను సృష్టిస్తేనే ఈ "గిన్నిస్ బుక్" లో పేరు ఎక్కుతుంది..!

తెలుగు లో చాలా మందికి ఈ గౌరవం దక్కింది.. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళ గా శ్రీమతి విజయనిర్మళ గారికి, అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించినందుకు గానూ స్వర్గీయ రామానాయుడు గారికి ఇలా చాలా మంది ప్రముఖులకు ఈ "గిన్నిస్" బుక్ లో స్థానం లభించింది. ఇక చాలా ఏళ్ళ క్రితం మన సుస్వరాల బాలు ఒకే భాష లో అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా ఈ రికార్డు నెలకొల్పారు..!

మరి ఆ గానగాందర్వుడు తన మొదటి పాటను పాడింది ఎవరితోనో తెలుసా? గానకోకిల సుశీలమ్మ గారితో...! వీరిద్దరూ కలిసి జంటగా పాడినన్ని పాటలు దేశంలో మరే గాయకులూ పాడలేదు..అది కూడా ఓ అరుదైన రికార్డే. ఇక ఇటీవలే సుశీలమ్మ గారి పేరును 6 భారతీయ భాషల్లో 17695 పాటలు (రికార్డెడ్) పాడినందుకు గానూ "గిన్నిస్ బుక్" లో నమోదు చేశారు...(తెలుగు, తమిళ, హిందీ, మలయాళీ, కన్నడ, బెంగాలీ భాషల్లో). ఆమె 1960 నుంచీ పాడుతూనే ఉన్నారు.. ఇప్పటికీ ఆమె గాత్రంలో అదే మాధుర్యం..! 5 సార్లు జాతీయ అవార్డు, భారత ప్రభుత్వం నుంచీ "పద్మభూషన్" అవార్డు ను అందుకున్నారు. ప్రతీ ఏటా ఆమె పేరిట "ఉత్తమ గాయకులకు" అవార్డును ప్రదానం చేసి ప్రోత్సాహిస్తున్నారు. ఆమె పాడిన 19వేల పై చిలుకు తెలుగు పాటలలో బెస్ట్ 20 సెలక్ట్ చేయాలనుకోవడం సాహసమే.. కానీ ఇవన్నీ ఆమెకు ఎంతో పేరును, ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టిన సుశీలమ్మ పాటలు

Vastadu Naaraju

Godaari Gattundi

Mokka Jonna Thotalo

Seetaramula kalyanam

Brindavanamadi

Chandana Charchita

Karpura bommai

Vatapathra sayiki

Shiva Poojaku

Chandamama Raave

Vidhatha thalapuna

Aakulo Aakunai

Jhummandi naadham sayyandi paadam

Epattla godavari

Ghallu Ghallu

Sree Rastu Shubhamastu

Bahusha Ninu

Andam Indolam

Kalaya Nijama