మనం, మన కుటుంబం నివసిస్తున్న ఈ ప్రపంచ భవిషత్తు ఎక్కడో పనిచేస్తున్న చిన్న పిల్లాడి మీద కూడా ఆధారపడి ఉంటుంది, నేటి ప్రపంచాన్ని మార్చివేసిన వ్యక్తులు అలాగే నాశనం చేస్తున్న కిరాతకులను తయారుచేసింది కూడా వారి బాల్యమే. అందుకే ఒక చిన్న పిల్లాడి బాల్యం మీదనే ప్రపంచ భవిషత్తు ఆధారపడి ఉంటుంది. ఒక ఐదు పది సంవత్సరాల క్రితం మనకళ్లముందే హోటల్స్ లో, బస్టాండ్లలో, చిన్న చిన్న షాపులలో ఎంతోమంది బాల కార్మికులు ఉండేవారు. పటిష్ట చట్టాలు, సమాజంలోని బాధ్యత గల మనుషులు, అలాగే వివిధ రకాల NGO ల సహాకారం వల్ల చాలా వరకు బాల కార్మిక వ్యవస్థ తగ్గిపోయింది. బాల కార్మిక వ్యవస్థ నిర్ములనలో కళాకారులు కూడా తమవంతు బాధ్యతలను నిర్వహించారు. అందులో ముఖ్యులు "చిత్ర" గారు, ఆయన కూడా ఒక బాల కార్మికులు అవ్వడం మూలంగా వేసిన బొమ్మలపై నిజాయితీ రంగు స్పష్టంగా కనిపిస్తుంటుంది.
చరిత్ర, గతం ఎప్పుడూ మనకు కొత్త జాగ్రత్తలను నేర్పిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు శారీరకంగా హింస పెడుతుంటే, ఇప్పుడు చదువులు ఉద్యోగాలు డబ్బు పేరుతో మానసిక హింస కు గురి చేస్తున్నారు. ఈ రెండు కోణాలలో ఈ పెయింటింగ్స్ లో మనం గమనించవచ్చు..