మనం ఒక ఊరికి వెళ్తాము, ఓ పది పదిహేను రోజులు అక్కడే గడుపుతాము. అందమైన జ్ఞాపకాలను పొగుచేసుకుంటాము.. ఇక తిరిగి మన ఊరికి తిరిగి వస్తుంటే మనసు భారంగా ఉంటుంది కదూ.. అపూర్వ గారు వెళ్లిన ప్రతి ప్రదేశాన్ని ఎంజాయ్ చేస్తారు కానీ వెళ్ళేటప్పుడు మనసు భారంగా ఉండదు మరి ముఖ్యంగా తిరిగి వచ్చేటప్పుడు మాత్రం మనల కాదండి ఎప్పుడెప్పుడు వెళదామా అన్నట్టుగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అపూర్వ గారికి హైదరాబాద్ అంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే హైదరాబాద్ లోని 12 ముఖ్య ప్రదేశాలను గీసి క్యాలెండర్ గా తీసుకువచ్చారు.

ఇంటర్మీడియట్ బైపిసి గ్రూప్ చదువుకుంటున్నప్పటి నుండి అందులోని రికార్డ్స్, డైయాగ్రామ్స్ వెయ్యడం మూలంగా తనలోని ఆర్టిస్ట్ కదిలారు. అపూర్వ గారిది హైదరాబాద్, ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంటారు. ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఇంకా మరే ఇతర సెలవు రోజులలో తనకిష్టమైన ఆర్ట్ తో సమయం గడుపుతారు. తనెక్కడా కూడా పెయింటింగ్ నేర్చుకోలేదు, అనుకున్నట్టుగా గీయాలన్న తపనతోనే తను నేర్చుకున్నారు.
ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్
1. Osmania University

2. Mozamjahi Market

3.Mecca Masjid

4. Charminar

5. Shilparamam

6. Secunderabad Clock Tower

7. Taramati Baradari

8. Chowmahalla Palace

