పొందూరు ఒక ఊరి పేరు మాత్రమే కాదు అది ఓ బ్రాన్డ్. తెలుగు నేలపై నుండి భారత దేశమంతటా దాని ఖ్యాతి విస్తరించింది. అలాంటి గ్రామమే నీరజ గారి స్వగ్రామం.. మిగిలిన వారు ఆటబొమ్మలతో ఆడుకుంటే నీరజ గారు మగ్గాలతో ఆడుకున్నారు. నీరజ తాత గారు మగ్గం నేసేవారు, నాన్న గారు కూడా టెక్స్ టైల్ డిజైనింగ్ చేశారు. కుటుంబ వాతావరణమంతా ఇంతలా చేనేత మగ్గాల ద్వారా బట్టలు నేస్తుండడంతో ఈ రంగం వైపు రావాలనే ఆసక్తి చిన్నతనం నుండే కలిగింది.
నీరజ గారు కూడా మహారాజా షాయాజి రావ్ యూనివర్సిటీలో టెక్స్ టైల్ సంబందించిన కోర్స్ పూర్తిచేసి తమిళనాడు, తిర్పూర్, ప్రాంతంలోని వ్యాపార సంస్థల్లో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ గా డిజైనింగ్ సజెక్ట్ లో కూడా పాఠాలు చెప్పారు. ఇలా దాదాపు 20 సంవత్సరాలు పనిచేశారు. ఈ రొటీన్ వర్క్ చేయడం కాదు కొత్తగా దుస్తుల రంగంలోనే ఏదైనా పద్దతిని సృష్టించాలని అనే ఆలోచనతో కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ ప్రయత్నంలోనే పేపర్ ఖాదీ తయారయ్యింది.
ఈ పేపర్ క్లాత్ మామూలు పత్తి నుండి వచ్చే క్లాత్ లా ఉండకపోయినా దీనికంటూ ఓ ప్రత్యేకత ఉంది. మామూలు పేపర్ ను దారంలా చేసి చారఖా సహాయంతో వడుకుతారు. ఆ తర్వాత మగ్గం మీద వేసి దాని సహాయంతో క్లాత్ ను తయారుచేస్తారు. ఫలితంగా అద్భుతం ఆవిష్కరించబడింది. ఈ పద్ధతికి ఘనత వహించిన జపాన్ టెక్నాలజీ ని జోడించారు. అలా హ్యాండ్ బ్యాగ్స్, సోఫా కవర్స్, కర్టెన్స్, కుషన్ కవర్లు మొదలైనవి తయారుచేయడం మొదలుపెట్టారు.
కొత్త రుచులు, కొత్త ప్రదేశాలు, కొత్త రకం వస్తువులు ఇలా ప్రజలు కొత్తది కోరుకుంటున్నారు. ఈ తరుణంలో యువత కూడా కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగితే ఈ తరమే మన తరం అవుతుంది.
You can checkout her work here.