Contributed by Kanukurthi Sai Kiran
1990 ఏప్రిల్ నా పెంకితనానికి 16 యేళ్లు అప్పట్లో నా కోసం మా విధి చివరన నలుగురు కుర్రాళ్ళు తెగ వేచి చూసేవారు నేనెప్పుడూ ఇంట్లో నుండి బయటకి వస్తానా.. ! అని నాకు అర్ధమయ్యేది కాదు వాళ్ళు ఎందుకు అలా ఉండే వారు అని కానీ ఒకరోజు అందులో ఒకతను వచ్చి నువ్వంటే నాకిష్టం I Love You.. ❤️ అని చెప్పి వెళ్ళిపోయాడు నాకు ఒక్కటే కంగారు ఏమి చేయాలో తేలిక వెంటనే వెళ్లి రాగ సుధా కి చెప్పేసాను.
అది నాకంటే తింగరదానిలా ఉంది నాకేమో అసలే భయమేస్తుంటే.. ఏమే నిజామా.. ఎలా చెప్పాడు పువ్వు ఇచ్చాడా...? ఉత్తరం ఏదైనా ఇచ్చాడా? ... అని ఓ.... ప్రశ్నలు అడుగుతుంటే ఇదిగో ఇచ్చాడు చదువుకొని చావు అని చిరాగ్గా వచ్చేశాను.. అప్పుడు అది చదవడం మొదలెట్టింది...
శిధిలమైపోయింది మన చరితము కడలి అయి పొంగింది నా కవనము సంద్రమై ప్రవహించింది నా గమనము భావమై నిలిచింది నా గానము జీవమై చేరావు చిరునవ్వువై చినుకువై కురిసావు నా మోముపై ఆశవై చిదిమావు నా మనసుపై వలపువై వాలావు నా నుదుటిపై సంకల్పమై నిలిచావు ప్రాణానివై విజయమై విహరిద్దాము ఈ జగతిపై
అని ఉత్తరాన్ని మూసేసింది సుధా ఆ తరువాత నా దగ్గరకి వచ్చి ఏమా… Speed మీద ఉన్నాడే గురుడు చాలా బాగా చెప్పాడు ఎంత ఇష్టం కాకపోతే అంతలా రాస్తాడు అదే నీ Place లో నేనుంటే నా రేపే పెళ్లి పీటలెక్కించేదాన్ని
అంత బాగుందా? ... సుధా హ... మరి నువ్వు చదవలేదా? నిజం చెప్పాలా సుధా హ ఏంటే చెప్పు నిజానికి ఆ ఉత్తరం తను రాయలేదు నేను రాసాను.... ? హ... ? ఏంటే ఈ షాక్ నువ్వా ఎవరికీ రాసావ్ ? ఎందుకు రాసావ్? అది నేను.. నేను ఎహె... నాన్చకుండా చెప్పు అది నేను రాజేష్ కోసం రాసానే OMG... ?
నిజం చెప్పాలి అంటే తను నన్ను ప్రేమించడానికి మొదలే నేను తనని ఇష్టపడ్డానే ఆ ప్రక్కనే ఉన్న వాళ్ళు తన స్నేహితులు సుబ్బు, శేఖర్, శ్రీను అతను ఉయ్యురులో ఉంటాడు డిగ్రీ Complete చేసాడు ఉద్యోగం కోసం Try చేస్తున్నాడు రాగానే నేనే వెళ్లి చెప్దాము అనుకున్నా ఇంతలో తనే చెప్పాడు.
వామ్మో ఇంత Details ఎప్పుడు తెలుసుకున్నావే..? ....ఇన్నాళ్లు నా ప్రక్కనే ఉండి ఇదంతా ఎప్పుడు..ఎలా అసలు? సర్లే అది అటుంచు మరి నీ ప్రేమ విషయం చెప్పేసావా ? లేదింకా...
కొన్నాళ్లకి అతనికి ఉద్యోగం వచ్చింది ఆ తరువాత వెళ్లి ఈ ఉత్తరాన్ని ఇచ్చి నా అంగీకారాన్ని తెలిపాను. చాలా రోజులు ప్రేమాయణం తరువాత ఇద్దరికీ పెళ్లి జరిగింది...❤️ "నీ ప్రేమకథ ఏంటమ్మా" అని నా పిల్లలడిగిన ఈ ప్రశ్నకు ఇద్దర్ని ఒకరిని ఒకరు చూసుకుంటూ అలా 30 ఏళ్ల వెనక్కి వెళ్ళొచ్చాం