అందరికి తెలిసిందే ఇప్పుడంటే Technology ని భయంకరంగా వాడేస్తున్నాం.. Music, Singing విషయానికొస్తే 5నిమిషాల పాటను కూడా ఒక్కో లైన్, ఒక్కో Word కూడా కట్ చేసుకుని పాడేస్తున్నారు ఇప్పుడున్న కొంతమంది సింగర్స్. మరి టెక్నాలజి లేని పాత రోజులు..? ఏముంది సింగిల్ టేక్ లో పాడేవారు అంతే కదా.. సింగిల్ టేక్ లో అంటే ట్యూన్ ని బట్టీపట్టి లిరిక్స్ ను చూస్తూ పాడేవారు కాని పి.బి శ్రీనివాస్ గారు మాత్రం వినడం కన్నా స్వరాలు రాసుకుని పాడేవారు. సంగీతంలో ఇదొక గొప్ప పద్దతిగా భావిస్తారు. మన తెలుగులోని మహా గాయకులు బాలమురళి కృష్ణ, ఘంటసాల, ఎస్.పి. బాలసుబ్రమణ్యం తర్వాతి స్థానంలో ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారు కూడా ముఖ్యులు..
పి.బి శ్రీనివాస్ గారిది తూర్పు గోదావరి జిల్లా కాకినాడ. 1930లో ఇదే రోజు జన్మించారు. సంస్కృతాన్ని దైవ భాష అంటారు, అంటే దేవళ్ళు సంస్కృతంలో మాట్లాడుకుంటారట ఆ సంస్కృతం నుండే దాదాపు మనదేశంలోని తెలుగు తమిళం లాంటి చాలా భాషలకు మూలం సంస్కృతమే.. అలాంటి భాషలో, సంగీతంలో శ్రీనివాస్ గారి తల్లిదండ్రలు మంచి నాలెడ్జ్ ఉండటం వల్ల చిన్నప్పటి నుండే సంగీతం మరియు వివధ భాషలలో ప్రతిభ లభించింది. ఆ కాలంలోనే డిగ్రీ వరకు చదివి తనకెంతోఇష్టమైన సంగీతం వైపు నడిచి తన జీవితాన్ని కొనసాగించారు.
మన తెలుగు నేలపై పుట్టిన శ్రీనివాస్ గారు మన తెలుగు ఇండస్ఠ్రీలో కన్నా మిగితా భాషలలో బాగా Famous అయ్యారు. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారికి తన గొంతు Perfect గా సూట్ అవ్వడంతో ఆయనకు ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీష్ ఇలా 8 భాషలలో శ్రీనివాస్ గారు అనర్గలంగా మాట్లాడగలరు. భారతదేశంలోని ప్రధాన భాషలలో 3000కు పైగా పాటలు పాడి భారతీయ సాంప్రదాయ సంగీతంలో చేసిన ఎన్నో సేవలకు గాను భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అందుకున్నారు. ఆయన అందుకున్న గౌరవాలలో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని, శ్రీ రాఘవేంద్ర మఠం వారి ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకొని ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. కంచి జగద్గురుపీఠం నుంచి శ్రీ జయేంద్రసరస్వతుల నుంచి "సంగీతరత్న", "సంగీత నాదమణి" బిరుదాలను స్వీకరించారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి సంగీత సాహిత్యాలకు అందించిన సేవలకు గాను డాక్టరేట్ గౌరవాన్ని కూడా అందుకొన్నారు
శ్రీనివాస్ గారు ఆలపించిన ఆ పాత మధురాలు..
అందాల ఓ చిలుకా..
ఎవరికి ఎవరు కాపలా..
బుజ్జి బుజ్జి పాప
నీవే నీవే నిన్నే...
అది ఒక ఇదేలే...
Hello Madam సత్యభామ..
తలచినదే జరిగినదా...
నీలి మేఘమాలలో..
ముద్దు ముద్దు నవ్వు...
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.