వజ్రాలు ఎక్కడపడితే అక్కడ దొరకవు అవి గనుల్లో ఉంటాయి, భూగర్భం నుండి వెలికితీయాల్సి ఉంటుంది.. కడప జిల్లా దేవమాచుపల్లి అనే మారుమూల గ్రామంలో బ్రతుకుతున్న పుట్ట పెంచల్ దాస్ అనే వజ్రాన్ని వెలికితీసినందుకు దర్శకులు మెర్లపాక గాంధీ, త్రివిక్రమ్ గార్లతో పాటు "పెంచల్ దాస్ లో ఓ ప్రత్యేక ప్రతిభ గని ఉన్నదని తెలుగు సినీ ప్రముఖలకు పరిచయం చేసిన వారందరికి కృతఙ్ఞతలు చెప్పుకోవాలి".
పెంచాల్ దాస్ గారు కల్తీ పాలవ్వని మనిషి. ఆయన వ్యక్తిత్వం, మాటతీరు నడవడిక, ఎదుటివారు నొచ్చుకున్న గాని వారి ఉన్నతికై స్పందించే గుణం ఆయన జీవితంలో ఎదగడానికి గల సుగుణాలు. తనకోసం, తన చుట్టూ ఉన్నవారి కోసం ఏవో వ్యాపకాలలో ఉన్నారనుకున్నారు కాని, అవి తెలుగు సినిమా స్థాయి గలవని ఈ మధ్యనే ఆయనకు తెలిసింది. పెంచల్ దాస్ గారిలో రచయిత, గాయకుడు, రంగస్థల కళాకారుడు అనే గనులున్నాయని మనం ఇప్పటి వరకు చూశాం. ఆయనలోని "బాతిక్" అనే అపూరూప చిత్రకళా గనిని ఇప్పుడు పరిశీలిద్దాం.
బాతిక్ కళ మారుమూలది కాదు అది అంతర్జాతీయ స్థాయిది. అమెరికా, ఇంగ్లాండ్, రష్యా తదితర యూరపు దేశాలలోను ఈ కళకు ఎంతో ఆదరణ ఉంది. మనదేశంలో మాత్రం ఈ కళాకారులు చాలా తక్కువ, పదుల సంఖ్యలో కూడా ఉండరు. తెలంగాణ సిద్ధిపేటకు చెందిన యాసాల బాలయ్య గారు బాతిక్ కళలో అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నారు. బాతిక్ చిత్రకళ ప్రత్యేకమైనది. దీనిని కేవలం వస్త్రం మీద మాత్రమే వేస్తారు మరిగించిన తేనెటీగల మైనం, ప్యారాఫిన్ మైనం, వివిధ రంగుల కలయికతో శ్రమ శ్రద్ధతో వేయాల్సి ఉంటుంది. పెంచల్ దాస్ గారు ఈ కళని నేర్చుకుని నిష్ణాతులయ్యారు. అతి తక్కువ మంది బాతిక్ కళాకారులున్న మన దేశంలో ఆయన కూడా ఒకరు. ఉద్యోగంతో పాటు వివిధ చోట్ల తాను వేసిన చిత్రాలను ప్రదర్శిస్తుంటారు. రాయలసీమ బతుకు చిత్రాలను బాతిక్ ద్వారా తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి గౌరవ అవార్డులు అందుకున్నారు కూడా..
పెంచల్ దాస్ గారిలోని బాతిక్ కళాకారుడు వేసిన చిత్రాలు కొన్ని..
1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.
