సాధనమున పనులు సమకూరు ధరలోన..." అవును, నిరంతరరం పట్టుదలతో సాధన చేస్తూ ఉంటే ఎలాంటి, ఎంతటి పనినైనా సాధించవచ్చు. నాకు రాదు, లేకపోతేనా! అంటూ.. అనుకుంటూ... సాకులు చెబుతూ ఉంటే ఏది నేర్చుకోలేము, ఏమి చెయ్యలేము... నెల్లూరు కి చెందిన కందుకూరు జగన్ చిన్నతనంలో చదువులో కొంచెం వెనకబడి ఉండేవాడు, అయినప్పటికీ కష్టపడి చదువుతూ... అలాగే స్వర్ణకారుడైన తన తండ్రి గారికి చేదోడు, వాదోడుగా ఉండేవాడు. అలా రోజూ తండ్రిని చూస్తూ, తాను కూడా ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలి అని అనుకుంటూ, ప్రతిరోజూ రాత్రి ఇంటికి వచ్చిన వెంటనే పెన్సిల్ తో చిత్రాలు వెయ్యటాన్ని సాధన చేసేవాడు. అలా నిరంతర సాధన చేస్తూ... ఒక గొప్ప చిత్రకారుడిగా మారారు. ఆయన వేసిన బొమ్మలను చూస్తే, అసలు ఇవి పెన్సిల్ తో గీసినవేన...? అని అనిపించకమానదు. అచ్చంగా, అచ్చు గిద్దినట్టుగా చిత్రాలు రూపొందించటం మన జగన్ ప్రత్యేకత, ఆ ప్రత్యేకతే తన కి దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చేలా చేసింది. ఆయన ప్రతిభ గురించి ఒక ఉదాహరణ చెప్పాలంటే... మనోడు గీసిన బాహుబలి స్కెచ్ ని చూసి, దర్శకులు రాజమౌళి గారు బాహుబలి చిత్రానికి పనిచెయ్యమని అడిగారు. అయితే కొన్ని కారణాల వలన ఆయన అభ్యర్ధనను సున్నితంగా తిరస్కరించారు జగన్. ఇక అతని లక్ష్యం ఏంటని అడిగితే, ఒక ఇనిస్టిట్యూట్ ని నెలకొల్పి, మన దేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందని ఈ పెన్సిల్ ఆర్ట్ కి గుర్తింపు తేవడమే అని అంటారు జగన్. ఇక అతను రూపొందించిన ఆర్ట్స్ లో కొన్ని చూసినట్లయితే...
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.