Contributed By Uday Kiran Dasharadhi
మనకు కుశలం కన్నా కులం గొప్పదా? స్వేచ్ఛ కంటే స్వార్ధం ముఖ్యమా? లేదనే ఎక్కువ మంది బదులిచ్చేది.
మరెందుకు మనం ఎన్నుకున్న నాయకులు మనకంటే ఎక్కువగా మనకు అక్కర్లేని గుర్తింపు కోసం వాళ్ళ గుర్తింపు చూపించుకుంటూ, అర్ధం లేని వాదనల్లో వ్యర్ధంగా మాట్లాడే మాటలతో మన ఆశలని తప్పు పట్టిస్తున్నారు.
ఒక వేళ కులమే గొప్పదైతే, ఎవరిది వాళ్ళకే అవ్వాలి కానీ పక్కనోడికి కూడా గొప్ప అనిపించాలంటే ఎలా కుదురుతుంది? గొప్ప అనే పదం పుట్టిందే పోటీ లేదు అని చెప్పడానికి, అలాంటిది మళ్ళీ ఇంత గొప్ప అంత గొప్ప అని విడదీయడం ఏంటి. అడిగేవాడు లేకా ?
అర్ధం లేని ప్రశ్నలు, అర్ధం కాని రాజకీయాలు రెంటికి 'అవసరమే' అవకాశం.
అందుకే ఊరికే అనలేదు సిరివెన్నెల గారు..,
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం
గాలివాటు గమనానికి కాలిబాట దేనికి గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం రామబాణమార్పిందా రావణ కాష్టం కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని మారదు లోకం మారదు కాలం అని
"కొన్ని మారవు, మార్చలేం కూడా" అని ప్రతి వారు అనుకున్నని రోజులు మనమిలాగే ఉంటాం, ఉండగలం.