Revisiting One Of The Favorite Childhood Serials “Pinni” Title Song's Lyrics

Updated on
Revisiting One Of The Favorite Childhood Serials “Pinni” Title Song's Lyrics

కొన్ని తెలుగు సీరియల్ పాటలకి ఎలాంటి fanbase ఉంటుందంటే, వాటిని కొంతమంది record చేసుకొని మరి loop లో వింటారు. అలాంటి సీరియల్ పాటల్లో "పిన్ని" సీరియల్ టైటిల్ సాంగ్ ఒకటి.

2001 కాలం లో 7:30 ప్రాంతం లో "పిన్ని" అని ఒక చిన్న పిల్ల పిలుపు, ఆ తరువాత వచ్చే ఈ పాట, ఎంత వద్దనుకున్న మరచిపోలేము. పిన్ని 2 అని ఈ మధ్య ఆ సీరియల్ కి సీక్వెల్ వచ్చిందంటే అర్థం చేస్కోండి. ఈ సీరియల్ ఎంత craze ఉందో?

సీరియల్ గురించి పక్కన పెడితే, ఈ పాట చాలా బాగుంటుంది.చాలా మంది favorite కూడా. తమిళ్ పాటని "వైరముత్తు" గారు రాస్తే, ఆ పాట సాహిత్యం లో ఆత్మ "ఓంకార్ పరిటాల" చక్కగా అనువదించి రాశారు. అప్పట్లో చాలా సీరియల్ లో కనిపించేవారు "ఓంకార్ పరిటాల" గారు.తమిళ్ లో one of the most famous director దిన ఈ పాట కి మ్యూజిక్ compose చేశారు.

సాహిత్యం: కృష్ణమ్మ కు గోదారికి తోడెవరమ్మా... మమతల మందాకిని మగువేనమ్మా. ఆ నదులన్నీ కొండా కోనలులు దాటాలి.. ఆడది కూడా కన్నీలెన్నో దాచాలి. కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో నదులకు నడకలు సాగాలి... తనువును మనసును త్యాగం చేస్తూ, పడతులు పయనం చేయాలి. (కృష్ణమ్మ కు) కడలిని చేరిన నదికి విశ్రాంతి. తరుణికి మాత్రం తీరని భ్రాంతి. పచ్చని పైరుకు నది ఆధారం.బ్రతుకున వెలుగుకు ఆడది మూలం. గంగ పొంగి పొరలిందా...ప్రళయ తాండవం కాదా... సీత గీత దాటిందా..యుద్ధకాండ మొదలేగా... ఆ నది ఆడది శక్తి స్వరూపాలే...

భావం: నదితో, స్త్రీ ని చాలా చక్క అన్వయిస్తూ రాసారు ఈ పాటని. కృష్ణ నదైన, గోదావరైనా తమ నీటిని ఎలా పంచుకుంటూ వెళ్తుందో, ప్రతి స్త్రీ కూడా ప్రేమని పంచుకుంటూ వెళ్తుంది.. ఆ నది ఎలా అయితే కొండలు, వాగులు దాటుతుందో, స్త్రీ కూడా ఎన్నో బాధలని, ఛీత్కారాలని, దాటుకుంటూ వెళ్ళాలి. ఒక ఒడ్డుకి చేరిన నదిలా తనలోని ఒక పాయని ఎలా అయితే విడుస్తుందో, స్త్రీ కూడా ఎన్నో త్యాగాలు చేస్తూ పయనాన్ని సాగిస్తుంది. నది కి సముద్రాన్ని చేరాక విశ్రాంతి లభిస్తోంది. అలా స్త్రీ కి విశ్రాంతి ఉందా అంటే లేదనే సమాధానమే ఎక్కువ వినిపిస్తుంది. పంట పచ్చగా రావాలంటే, నీరు ఎంత ముఖ్యమో, ప్రతి మగాడి జీవితం పచ్చగా ఉండాలంటే ఒక స్త్రీ ప్రేమ, స్త్రీ తో గౌరవంగా ఉండటం అంతే ముఖ్యం. నది ప్రశాంతంగా పారెవరకే అంత బాగుంటుంది. పొంగి పొర్లిందంటే ప్రళయం ముంచుకొచ్చేసినట్టే, సీత ని చెరపట్టాలని చూసాడు కాబట్టే యుద్దకాండం మొదలయ్యి, రావణ సంహారం జరిగింది. ఆ నది, ఆడది రెండు శక్తి స్వరూపాలే, వాటిని జాగ్రత్త కాపాడుకోవడం మన కనీస కర్తవ్యం.