ప్రతిఒక్కరూ ఒక చేగువేరా కాకపోవచ్చు కాని ప్రతిఒక్కరిలోను ఒక చేగువేరా ఉంటాడు. అవును.. అన్యాయమే స్వేచ్ఛగా న్యాయంలా విస్తరిస్తున్నప్పుడు ఆ చీడను చీల్చే ప్రతి ఒక్కడు ఓ ఉద్యమకారుడే.!!
1. ఒకడి కాలికింద బానిసగా బ్రతికే బతుకు కన్నా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ప్రాణం విడవడం మేలు.!!
2. చివరి వరకు పోరాడే దమ్ము ఉంటే ఎలాంటి పరిస్థితిలలోనైనా విజయం సాధించవచ్చు.!!
3. నేను ఏనాడు అనుకోలేదు.. ఊపిరి కూడా స్వేచ్ఛగా తీసుకోలేని నేను ఓ ఉద్యమానికి ఊపిరి పోస్తానని.!
4. ప్రతి ఒక్కడూ ఒక చేగువేరా కాలేకపోవచ్చు. కాని ప్రతి ఒక్కడిలోనూ ఓ చేగువేరా మాత్రం ఖచ్చితంగా ఉంటాడు.!!
5. మిత్రమా లే.. అన్యాయమే చట్టమైనప్పుడు దానిని ఎదురించడం నీ బాధ్యత కావాలి.!!
6. నేను ఓడిపోయాను అని అంటే ఇక నేను ఎప్పటికి గెలవలేనని కాదు!
7. ఒంటరిగా, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజల మధ్య అత్యున్నత ఐక్యమత్యతా, విశ్వాసం పెరుగుతుంది.!!
8. ఓ నిజమైన ఉద్యమకారుడు గొప్ప ప్రేమభావం ద్వారా నడిపించబడతాడు!!
9. నువ్వు నన్ను చంపడానికి వచ్చావని నాకు తెలుసు. కాల్చు పిరికివాడ, నువ్వు కేవలం ఒక్క చేగువేరాను మాత్రమే చంపగలవు!!
10. ఏ క్షణాన మరణం సంభవించినా గాని నేను ఆహ్వానం పలుకుతా, కాని ఒక్కమాట. నా యుద్ధభేరి మరో చెవికి వినిపించాలి, నా చేతిలోని ఆయుధం మరో చేతిని అందుకోవాలి!!
11. మౌనంగా ఉండడం అంటే మరో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం.
12. ప్రతిరోజు మనుషులు వారి జుట్టుని సరిచేసుకుంటారు అదే విధంగా వారి హృదయాన్ని ఎందుకు సరిచేసుకోరు.?
12. నీలో నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే మరెక్కడా కూడా దానిని పొందలేవు.
13. ఈ భూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి ఆస్తులు కన్నా లక్షల రెట్లుకు పైగా ఓ సగటు మనిషి జీవితం విలువైనది.
14. సమాజంలో జరిగే ప్రతి అన్యాయానికి కోపంతో రగిలిపోతున్నావా.? ఐతే నువ్వు నా మిత్రుడివి!!
15. నేను ప్రతిరోజూ కల కంటాను. నేను చచ్చేంత వరకు కూడా కల కంటూనే ఉంటాను.!!
16. నేనేమి చేసేవాడిని కాదు. అసలు చేసేవాడంటు ఎవ్వడు ఉండడు. ప్రజలే వారికి కావాలిసినవి చేయించుకుంటారు.
17. భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన అసలైన జీవితం మొదలవుతుంది.!!
18. అవును.. చేసే ప్రతి గొప్ప పనికీ అభిరుచి ఉండాలి. కాని ఓ ఉద్యమానికి ఇష్టం మాత్రమే సరిపోదు, చావుకు భయపడని తెగింపు కావాలి!!