The Plight Of A Woman Who Is Always Misunderstood By The Men Around Her!

Updated on
The Plight Of A Woman Who Is Always Misunderstood By The Men Around Her!
(a story by Viswanadham Saikumar) వందన ది అద్దం లొ ప్రతిబింబం వలె ఉన్నది ఉన్నట్టు మాట్లాడే స్వభావం. ఇప్పుడున్న సమాజానికి నా ప్రవర్తనా సరిగ్గా సరిపొతుంది, నేను మాట్లాడే మాటలకు అర్ధాలు వేరు కాదంటూ," నేను అవును అంటే అవును, కాదు అంటే కాదు", అంతేగాని పాతకాలం పాటలాగ లాగ "అవునంటే కాదనిలే,కాదంటే అవుననిలే",కాదు, అర్ధమయ్యిందా..! మా నాన్న సత్యం, అమ్మ లక్ష్మి, ఇంకా నాకొక బెస్ట్ ఫ్రెండ్ రామ్. రామ్,నేను ఒకటొ తరగతి నుంచి ఇంటర్ వరకు కలసి చదుకున్నాం, కాని డిగ్రీ లో మాత్రం విడిపొయాం. నేను వేరే కాలేజ్ లొ జాయిన్ అయ్యా. అయినా మా ఇద్దరి కాలేజ్ లు దగ్గర ఉండటం వల్ల సాయంత్రం కాలెజ్ అయిపొయిన తరువాత దగ్గర్లో ఉన్న పార్క్ లొ కూర్చొని కాసెపు మాట్లడుకునేవాళ్ళం. అలా సంవత్సరం పాటు బాగనె ఉంది, తర్వాత ఎమైందొ తెలియదు గాని రామ్ ప్రవర్తనలొ మార్పు వచ్చింది. సత్యం: “వందన సాయంత్రం కాలేజ్ నుంచి తొందరగా రా సినిమా కి వెళ్దాం" సరే డాడి అంది వందన, అన్నట్టూ లక్ష్మి సాయంత్రం వెళ్దామా? అని అడిగాడు సత్యం, ఎందుకులెండి వద్దు మొహమాటంగ అంది లక్ష్మి! సర్లే వెళ్దాంలె, అయినా మీ ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే(నవ్వుతూ), సరే ఆఫీస్ కు వెళ్ళొస్తా అన్నాడు……………“సత్యం బయటకు కు వెళ్ళగానే” ఎందుకమ్మా సినిమా కి వద్దన్నావ్ అని వందన అడగ్గా, డాడి దగ్గర డబ్బులు లేవెమొనని అలా అన్నాను వందన... అదేదొ సూటిగ అడగొచ్చు కదా డబ్బులు ఉన్నాయొ లెవో అని మళ్ళీ “అడవారి మాటలకు అర్దాలే వేరులే…” అని అనిపించ్చుకొవలా అని కొపంగా అంది వందన, సర్లే నువ్వు సాయంత్రం తొందరగ రా అంది లక్ష్మి, నువ్వు మారావ్ అనుకుంటూ కాలేజ్ కి వెళుతుంది. “నిజానికి వందన చాలా ముక్కుసూటి మనిషి,స్వతంత్ర భావం కలది”. సాయంత్రం డాడి ఫొన్ చేసారు,సినిమాకి టైం అవుతుంది తొందరగ ఇంటికి రమ్మన్నారు,నాకు లేట్ అవుతుందని పార్క్ దగ్గర ఆగకుండా వెళ్ళిపొతున్నా,నేను వెళ్ళిపొటాన్ని చూసిన రామ్ పరిగెత్తుకుంటూ వందనా వందన అని పిలుస్తున్నాడు, సర్లే అని నేను ఆగి పలకరించా. అప్పుడే తన చూపులో, ప్రవర్తనలో మార్పును గమనించా…………… మనం బెస్ట్ ఫ్రెండ్స్ అవునా కాదా? ఆయసంతో అడిగాడు రామ్, అవును ఏ! అంది వందన మరి ఆగకుండా వెళ్ళిపొతున్నవేంటి? డాడి సినిమాకి వెళ్దాం అన్నారు, అందుకే వెళ్ళిపొతున్నా. అవునా, సరే(వందన కళ్ళల్లొ చూస్తూ ) నాకు టైము అవుతుంది రేపు సాయంత్రం కలుద్దాం. Bye వందన, అని రామ్ గణపతి కి ఫొన్ చేస్తూ “ఎక్కడున్నవ్” అంటూ అడిగాడు “రూం” లొ ఉన్న అన్నాడు గణపతి, ఆ వస్తున్న bye,చిరాగ్గ అన్నాడు రామ్. గణపతి రూం కు వెళ్ళిన రామ్ వందన గురించి చెప్పటం మొదలుపెట్టాడు, ఇంతకీ నీ లవ్ గురించి చెప్పేవ అని అడిగాడు గణపతి, “చెప్పానంటే చెప్పు తీసుకుని కొట్టుద్దెమొనని చెప్పలేక నాలో నేను సర్దిచెప్పుకుని నీలాంటి యదవలకి నా భాద చెప్పుకుంటె ఏదైన ఐడియా ఇవ్వకుండా తీరిగ్గా చెప్పావా అని అడుగుతున్నవ్ చుడూ నిన్ను.. నిన్ను.. చెప్పుతొ కొట్టాల్రా”! అని రామ్ అంటుంటే దానికి గణపతి బాబోయ్ ఆపు నీ చెప్పులు గోల, ఒ పనిచెయ్ వందన కి చెప్పులు లేనప్పుడు “ఐ లవ్ యు” చెప్పు సరిపొద్ది అప్పుడు నిన్ను చెప్పుతో కొట్టలేదుకదా! తూ అపరా, ఎదైనా ఐడియా ఇవ్వరా అన్నాడు రామ్. గణపతి ఆలొచించి ఐడియా కి “ఫుల్ టాక్ టైం” చెయ్యి సరిపొద్ది, సరిగ్గా చెప్పరా ప్లీజ్, అంటే రేపు వందన ని కలిసే “టైం” లొ “పూర్తిగ” నీ లవ్ గురించి “మాట్లాడు” అంతే అని చెప్పాడు గణపతి. నాతో పాటు నువ్వు రా గణపతి, సరే నీకు “చార్జెర్” నేనెగ వస్తా అన్నాడు గణపతి ఇక రామ్ కి తెలియని ఆత్రుత, భయం, సంతొషం అన్ని కలిపి రాత్రి ఆలోచనల్లొ నిద్ర లేకుండ చేసేయ్. వందన కి రేపు సాయంత్రం ఎప్పుడు ఎలా ఐ లవ్ యు చెప్పాలా అని ఆత్రుత తొ, చెప్తే ఒప్పుకుంటుందా లేదా అని భయం తొ, నా లవ్ ఒప్పుకుంటుందనే సంతొషం తొ అప్పుడె తెల్లారింది. ఎప్పుడు గుడికి వెళ్ళని రామ్ ఈరొజు గుడి కి వెళ్ళాడు, సాయంత్రం ఆకాశంలొ చందమామ, పార్క్ దగ్గర వెయిట్ చేస్తున్న రామ్ మనస్సులొ చందమామ రెండూ వచ్చాయ్. హాయ్ వందన అని బాగ టెన్షన్ తొ చెప్పాడు రామ్, హాయ్ రామ్ అంది వందన. సినిమా బాగుందా? అ..బాగుంది, ఏంటి కంగారుపడుతున్నవ్! నీకో విషయం చెప్పాలి? “చెప్పు” అంది వందన అదీ మన ఫ్రెండ్షిప్ ని నెక్ష్ట్ లెవల్ కి తిసుకువెళ్దామని, అర్దంకాలేదు! అంది వందన అంటే మనం “ఫ్రెండ్ అనే షిప్” లొంచి “లవ్ అనే షిప్” లోకి ఎందుకు వెళ్ళకూడదా అని అడిగాడు రామ్, వెళ్ళకూడదు అంతే నీకు “లవ్ అనే టికెట్” ఉందేమె కాని నా దగ్గర లేదు స్ట్రయిట్ గ చెప్పాలంటే నాకు ఇష్టం లేదు. ఐ లవ్ యు వందన, నాకో చిన్న డౌట్ నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ వి, మరి నేను నీకు ఫ్రెండ్ గాన లేక లవర్ గానా? అదీ ఫ్రెండ్ గానే, నువ్వు ఒప్పుకుంటే లవర్ గా ఫీల్ అవుతా, అని ధైర్యంగ అన్నాడు రామ్, ఆల్ రెడి లవ్ చేస్తున్నవుగా, ఫ్రెండ్ గా ఎలా ఫీల్ అవుతావ్? అంటే…….. అని రామ్ సాగదీస్తుంటె! so...good bye, అని వెళ్ళిపోయింది వందన . వందన వెళ్ళిపొయిన తరువాత గణపతి వచ్చి రామ్ ఎమైంది అని అడిగాడు, వందన కి నేనంటే ఇష్టం లేదంట (భాదతో), ఎందుకురా భాదపడతవ్ నికో విషయం చెప్పనా “ఆడవారి మాటలకు అర్ధాలే వేరు, వాళ్ళకి ఇష్టం లేదంటే ఉన్నట్టే రా”, నువ్వు వందన ని ఫాలో చేస్తూ ఉండూ, వెళ్దాం రా అన్నాడు గణపతి. అప్పుడూ గణపతి మాటలకు ధైర్యం తెచ్చుకుని వందన ని ఇంప్రెస్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా కొన్నాళ్ళు వెనకాలె ఫాలో చేస్తూ ఐ లవ్ యు చెప్తూ ఉంటాడు రామ్. కాని రామ్ ఎంతా విసిగించిన ఫ్రెండ్ అనే కారణంతో ఓపిక పట్టి పొరపాటున “చుద్దాం” అంటుంది వందన. “ఇది లవ్ కాదు ఎట్రాక్షన్ అని ఎలా చెప్పినా వినే పరిస్తితుల్లో లెడూ రామ్”, పిచ్చొడిలా వందన కోసం పార్క్ దగ్గరే వెయిట్ చేస్తూ వందన రాగనే “ఆగు వందన” అని గట్టిగ అరిచాడు, అక్కడ ఉన్నవాళ్ళు రామ్ ని అదోలా చుసారు. కాని ఇవేమి పట్టించుకొని రామ్ తన మనసంతా వందన పైన ఉంది. ఆగు వందన నేనూ చెప్పింది ఎమైంది? “చూద్దాం” అంటే నీ మనసులో ఎదో తెలియని “ఫీలింగ్” ఉంది వందన నీకు అర్ధం కావట్లేదు అన్నాడు రామ్ . బాబూ నీ గోల భరించలేక పొరపాటున అన్నా, అయినా “చూద్దాం” అంటే మనసులో ఎదో తెలియని “ఫీలింగ్” ఉందని నీకు ఎవరూ చెప్పారు? నా ఫ్రెండ్ గణపతి. నీకు ఈ యదవ ఐడియాలు ఇచ్చేది వాడెనా, ఓ పనిచెయ్యి వాడ్ని కూడ ఇక్కడకు రమ్మను ఇద్దరికి ఒకేసారి క్లారిటి వస్తుంది అంది వందన. రామ్ వెంటనే గణపతి కి ఫొన్ చేసి పార్క్ దగ్గరకు రమ్మని చెప్పి ఫొన్ కట్ చేస్తూ, వందన నేను నిజంగ లవ్ చేస్తున్నా ఎట్రాక్షన్ కాదు. వందన మనస్సులొ “ఎవరినన్నా లవ్ చేస్తున్న అని చెప్తె సరిపొతుంది. కాలెజ్ లొ అబ్బాయ్ అని చెప్తే మళ్ళి ఎవరా అని అడుగుతాడు, అందుకే మా బావ ఉన్నాడని చెప్తా”, “నేను మా బావ ని లవ్ చేస్తున్నా మళ్ళీ ఈ విషయాలన్ని మా బావకు తెలిస్తే problems వస్తాయ్ ప్లీజ్, నువ్వు నా ఫ్రెండ్ వి అంతే రామ్” అంది వందన. “సరే వందన నీ మీద నా లవ్ ఎట్రాక్షన్ అన్నవ్ అలాగే మీ బావ మీద నీ లవ్ కూడా ఎట్రాక్షన్ అవ్వచ్చు కదా, నువ్వు లవ్ లాగ ఫీలవుతున్నావేమొ తెలియదు కదా” అన్నాడు రామ్. అయినా నాకు ఇంకో సంవత్సరంలో పెళ్ళి చేసేస్తారు ఇక వదిలయ్ (ఇంతలో అక్కడికి వచ్చిన గణపతి మట్లాడుతూ) అంటే పెళ్ళి చెస్తారని వద్దు అంటున్నావ్ లేకపొతే రామ్ అంటే ఇష్టమేనా?” అని అడిగాడు గణపతి, “ఓహొ నాకు ఈ చాయిస్ కూడా లేదు ” అన్నది వందన, సరే నీకు ఇష్టం లేనప్పుడు రామ్ టార్చర్ చేస్తున్నాడని మీ ఇంట్లో చెప్పొచ్చుగా(రామ్ కి కన్నుకొడుతూ) అన్నాడు గణపతి, “రెయ్ మట్టిబుర్ర అలా చెప్తే నా మీద ఎదో ఒక ఆలొచన వచ్చి డిగ్రీ అవ్వగానే నాకు పెళ్ళి చెయ్యాలని ఆలొచన వస్తే నా చదువు ఆగిపొతుంది. ఇలాంటి ప్రేమల వల్లే కదా చాలమంది ఆడవాళ్ళ చదువులు మధ్యలొనే ఆగిపొతున్నయ్.” “అయినా ఏంటీ మీ అబ్బాయిల problem, “ “నాకు ఇష్టం లేదు అంటే -------> ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అంటారు, చూద్దాంలే అంటే ---------> ఎక్కడో ఎదో ఫీలింగ్ ఉందంటారు, నేను లవ్ లో ఉన్నానంటే ----> నా లవ్ ఎట్రాక్షన్ అని అన్నవ్ మరి నీ లవ్ ఎట్రాక్షన్ అవ్వొచ్చుకదా అని అడుగుతారు, ఇంట్లో పెళ్ళి చేస్తారు, బావ ఉన్నాడు అంటే ----------> నేనంటే ఇష్టమే కదా అని అడుగుతారు.” “నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పడానికి ఒక్క “పదం” నువ్వే చెప్పు ఆ “పదం” నేను చెబితే నువ్వంటే ఇష్టం లేదు అని నీకు అర్దమవ్వాలి.” “అందుకే ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనుకొని మీ అబ్బాయ్ లంతా పిచ్చొళ్ళు అవుతుంటారు. అయినా ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అని ఎవరు అన్నారో కాని నా మాటలకు మాత్రం అర్ధాలు వేరు కాదు.” “అంటే నువ్వు ఆడదానివి కాదా?”అని అన్నాడు గణపతి, “నా విషయం లో మాత్రం కాదు (గణపతి చెంప మీద కొడుతూ కోపంగా) అర్ధమయ్యిందా ” అంది వందన. “అర్ధమయ్యింది ఆ “పదం” ఎంటో తెలుసుకొవాలి అంతే కదా, రామ్ నేను హిమాలయాలకు వెళ్ళైన సరే తెలుసుకుంటాను అని వెళూతూ “అన్నాడు గణపతి. “అర్ధం చెసుకో రామ్, గుడ్ బాయ్” కోపంగ వెళ్ళిపోతూ అంది వందన. భాదతో రామ్ కి ఏం మట్లాడాలో అర్ధంకాక అలా చూస్తువుండిపొయాడు. 6 నెలలు తరువాత వందన కి సడెన్ గ రామ్ ఫొన్ కాల్, “వందన నితో మాట్లడాలి ఒక్కసారి పార్క్ దగ్గరకి రా ప్లీజ్” , వందని కి ఏం చెప్పాలొ అర్ధం కాలేదు, ఒక పక్కా రామ్ హలొ హలొ అంటున్నాడు. ఇన్నాళ్ళు కనిపించలేదు, కనీసం ఫొన్ కుడా చెయ్యలేదు, ఇప్పుడు చేశాడంటే ఎదో విషయం ఉండె ఉంటుంది ఎందుకైన మంచిది వెళ్ళటం బెటెర్(మనస్సులొ అనుకుంటూ) సరే వస్తున్నా రామ్ bye. వందన పార్క్ దగ్గర కి రాగానే, ఆలోచించా వందన నువ్వు అడిగిన “పదం” దొరకట్లేదు, గణపతి కుడా “పదం” కోసం ఇంకా అందరిని అడుగుతూనే ఉన్నాడు, దాదపుగ పిచ్చొడు అయిపొయాడు. అమ్మయిలకి ప్రేమలో స్వేచ్చ నివ్వాలి వాళ్ళ మనసుని బలవంతంగా కాకుండ ప్రేమతో గెలుచుకొవాలి, బాగ ఆలొచించా నీ మాటలకు, ఫీలింగ్స్ కి స్వేచ్చ నిచ్చే ఓ ఫ్రెండ్ గా అలాగే నీ ప్రేమ కొసం ఎదురుచూసే ఓ ప్రేమికుడిగా ఉంటా. థాంక్యు రామ్ (నవ్వుతూ) అంది వందన, రామ్ కుడా నవ్వుతూ (అలాగె వెనక్కి తిరిగి కొపంగా).