Contributed By Siddhartha Sai
ప్రపంచం ఒక్కసారిగా శూన్యం గా మారింది... కళ్ళు ఎంత యుద్ధం చేసాయో...కన్నీళ్లు ఆగడం లేదు!! గుండె ఆలోచనలతో ఇంకా యుద్ధం చేస్తున్నట్టు ఉంది ...బరువు గా ఉంది!! గింతులో నుండి మాట బయటకు దుకదానికి నానా యత్నాలు పడుతోంది.. చిన్నప్పటి నుండి ఎత్తుకొని పెంచిన మా అబ్బాయి కి ఎం చెప్పను.. నువ్వు ఏడిస్తే నా గుండెల్లో గుణపాలు దిగేవని ఎలా చెప్పను వాడికి ఎక్కడ దారి తప్పుతున్నాడు అని కోపం నటించిన సందర్బాల్ని ఎలా చెప్పను...
ఎలా చెప్పను వాడికి ఒక పక్కన ఎదుగుతూ ఉంటె గర్వాంగా ఇంకో పక్క దూరంగా వెళ్లిపోతుంటే బాధగా ఉంటుంది అని పెద్దవాడు అయ్యాడు ...వాడి జీవితంలోకి ఒక అమ్మాయి కూడా వచ్చింది... విదేశాలకు వెళతాం నాన్న అన్నాడు...నువ్వు అమ్మ కూడా రండి అని అన్నాడు ..ఎలా చెప్పను వాడికి...ఉన్న ఒక్కడికి ఏ లోటు రాకూడదు అని పగలు రాత్రి ఆలోచించకుండా పని చేశా...ఇప్పుడు పల్లెలో ప్రశాంతంగా నా జామా తోటలో హాయిగా ఉందామని అనుకున్నా... ఈ నెల తల్లిని వదిలి ఎలా వెళ్లగలను..ఇదంతా ఎలా చెప్పాలి..చెప్తే "dad you are crazy" అని అంటాడు ఏమో అని భయం...
మైక్ లో announcement వచ్చింది...వాడు వెళ్ళాలి..."నాన్న" అని వచ్చి కౌగలించికుటుండని అనుకున్నా ..."bye dad" అని వెళ్లిపోతున్నాడు.. అడుగులు నేర్పిన నన్ను వదిలి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళుతున్నాడు. మాటలు నేర్పిన నన్ను వదిలి వాడి భార్య తో నవ్వుతు మాట్లాడుతూ వెళ్తున్నాడు.. దారులు నేర్పిన నన్ను వదిలి దూరాలు చేరుకోవాలని వెళుతున్నాడు.
ఇప్పటికి గర్వాంగా ఉంది వాడు సాధించాలని వెళ్తున్నాడు కానీ సాధించిన తర్వాత "నాన్న నేను ఈ కప్ గెలిచాను" అని చిన్నప్పుడు చెప్పినట్టు "నాన్నా నేను సాధించాను" అని చెప్తాడో చెప్పడో అని భయం గా ఉంది కాదు భాధ గా ఉంది...
అందరూ ఏంటి ఇది చిన్నపిల్లాడిలా అని అంటున్నారు నేను ఏడుస్తుంటే...వాళ్ళకి ఎం తెల్సు.. ఒక స్నేహితుడు దూరం అయితే ఎలా ఉంటుందో వాళ్ళకి ఎం తెల్సు ఒక శిష్యుడు దూరం అయితే ఎలా ఉంటుందో వాళ్ళకి ఎం తెల్సు ఒక ప్రియుడు దూరం అయితే ఎలా ఉంటుందో వాళ్ళకి ఎం తెల్సు ఇవ్వన్నీ వాడిలో చూసుకున్న వాడు దూరం అయితే!!
ప్రపంచం తల్లకిందులైపోతోందీ.. అడుగులు పడటం లేదు...
ఒక్కసారి వచ్చి "నాన్న నాకు వెళ్లాలని లేదు " అని అంటాడు అని కానీ జరగదే..
ఇంతలో వెనక నుండి ఒక చెయ్యి నా భుజం పైన పడింది...
"నాన్న"అని కాన్నిళ్లతో కౌగలించుకున్నాడు ... ఒక్కస్సరికి వాడు మళ్ళి చిన్నప్పటి "నా" కొడుకు అయ్యాడు...
నా శూన్యం లో ఒక పూల మొక్క మొలచిన్నటు అనిపించింది.. కళ్ళు ఇంకా యుద్ధం చేస్తున్నాయి...ఆనదభాష్పాల కోసం
ఈ ఆనందాన్ని నా గుండె తట్టుకుంటుందా అన్న ఆలోచనతో యుధం చేస్తున్నా
గోతులోనుండి మాట బయటకి రావడం లేదు ఆనందం తో..
వాడు ఎంత ఎదిగిన ..నా కొడుకే..నా కోసం వాడు వాడి కోసం నేను ఎప్పటికి ఉంటాం.. ఒక స్నేహితుడు లా ఒక గురు శిష్యుళ్ల లా ఒక అన్న తమ్ముళ్ల లా ఇప్పటికి ఎప్పటికి..!!
గుండె నిండా ప్రేమ తో మా "నాన్న"కు అంకితం