Contributed By Karthik Nandivelugu
మేము అనగా తొంభైలలో పుట్టిన మేము అదృష్టవంతులం టెలిఫోన్ ని చూసిన వాళ్ళం సెల్ ఫోన్ న్నీ మొదట చూసిన వాళ్ళం విండోస్ 98 లో లాగిన్ మ్యూజిక్ విన్న వాళ్ళం చిరంజీవి పాటలకు ప్రాక్టీస్ చేసిన వాళ్ళం మేం 90 ల పిల్లలం సచిన్ 143 ఇన్నింగ్స్ చూసిన వాళ్ళం ఇండియా ఓడిపోతే అన్నం తినకుండా పడుకున్నోళ్ళం చిరు బాలయ్య అంటూ కొట్టుకున్నోల్లమ్ పండగలకి అందరి ఫ్యాన్స్ కలసి పోయి తిరిగినోల్లం మేం 90 ల పిల్లలం తెలుగు లో మాట్లాడితే ఫైన్ కట్టినోళ్లం ఎంసెట్ , ఐఐటీ అంటూ సావగొట్టబడిన మొదటి తరం వాళ్ళం ఐటీ మత్తులో తేలినోల్లం కాఫీ డే లలో గడిపిన మొదటి వాళ్ళం పవర్ పఫ్ గర్ల్, డెన్నిస్, పాపాయ, భల్లు్ కార్టూన్స్ చూసినోల్లం శక్తిమాన్ అంటూ అరిచినోళ్లం మేం 90 లలో పిల్లలం తిన్న కిస్మి చాకలెట్లు, ఆసా చోకలట్లు లాటరీ టికెట్లు, అన్నయ్యలకు తెచ్చిచ్చిన చార్మినార్ సిగరెట్లు ఆడిన టివి వీడియో గేమ్ లు అన్నయ్యలు వేసిన టక్కులు, బాండ జీన్స్ లు రీల్ తో జాగ్రత్తగా తీసే కెమెరా లు అన్ని మాకే సొంతం అది మా గర్వం కాదు జీవితం ఇచ్చిన వరం ,తీపి గుర్తులు, చిన్న చిన్న ఆనందాలు అవి మా చిన్ననాటి ఆస్తులు ఏమైనా మేం 90 ల పిల్లలం కదా