తప్పి పోయిన పిల్లాడి కోసం తల్లి పడే వేదనే. జవాబు కోసం ప్రశ్న పడే తపన ప్రశ్నకు ముగింపు జవాబు, జవాబు లేని ప్రశ్న అనాథ ప్రశ్న ఒక ఆయుధం, సమస్యతో పోరాడటానికి ఎన్నో సమస్యలు మన చుట్టూ సమాధానాలు లేకుండా అనాథలుగా మిగిలిపోతున్నాయి సమస్య పరిష్కారం కోసం ఎదురు చూపులతో కొన్ని రోజులు ఎవర్ని ప్రశ్నించాలో తెలియక సమస్యకు అలవాటు పడుతున్నాం మిగిలిన అన్ని రోజులు
ప్రశ్నిస్తే భయం, మనల్ని నమ్ముకున్న వారికి హాని చేస్తారేమో అని ప్రశ్నిస్తే భయం, మన జీవన ఆదరాన్ని లేకుండా చేస్తారేమో అని ప్రశ్నిస్తే భయం, మన ఆత్మాభిమానాన్ని డబ్బుతో కొంటారేమో అని ప్రశ్నిస్తే భయం, నలుగురిలో తల దిన్చుకునేల చేస్తారేమో అని ప్రశ్నకి భయం అనే జవాబుతో, నిజం కి సంకెళ్ళేసి అబద్దం అనే స్వేచ్చ లో బ్రతుకుతున్నాం
అన్యాయాన్ని నిగ్గదీసి ప్రశ్నించినప్పుడే సత్యం కి స్వతంత్రం వస్తుంది ప్రశ్నిద్దాం, ఈ నేల మీద బ్రతికే హక్కు అందరికి వుంది అనేలా ప్రశ్నిద్దాం, నువ్వు కూడా నాలగే మనిషి అని తెలిసేలా ప్రశ్నిద్దాం, కులం కాదు మానవత్వం గొప్పది అని చెప్పేలా ప్రశ్నిద్దాం, భావి భవిష్యత్తు తరాలు సుఖపడేలా ప్రశ్నిద్దాం, మరో ఏ ప్రశ్న అనాథ అవ్వకుండా ఉండేలా!!!!!!!!!!!!!