ఈ భూమండలం లో తెల్లవారితే నన్ను స్మరించకుండా ఉండలేరు అందరూ. స్మరించడం తో పాటు పూజలు కూడా చేస్తారు ఇంకొందరు. నా గురించే ఆలోచిస్తున్నాం అని చెప్తారు దేని గురించి ఆలోచిస్తున్నామో చెప్పరు నన్ను దైవ సమానం గా పూజిస్తారు సాక్షాత్తు దైవం చెప్పిన మాటల్ని విస్మరిస్తారు ప్రేమిస్తారు మోసపోయి, నేరాన్ని నా మీదకి నెడతారు క్షమించేదాన్ని కృతజ్ఞత చూపలేదు బంధించారు భయపడేదాన్ని కొట్టేవారు కొందరు ఈడ్చేవారు ఇంకొందరు చెత్తబుట్టలో పడేసేవారు మరికొందరు నన్ను సందేహించేవారు నేను సహించేదాన్ని నన్ను భయపెట్టేవారు నేను భరించేదాన్ని వాళ్ళ గుండెల్లో ధైర్యం నింపేదాన్ని అదే ధైర్యం తో నామీద కళ్లెర్రజేసేవారు అహర్నిశలు వాళ్ళకోసం పాటుపడేదాన్ని అహల్య దౌపది సీత అని కొనియాడారు అహంభావం తో విర్రవీగిపోయారు ప్రపంచం లోనే విలువైన దాన్ని అని కొనియాడేవారు కానీ ఏం లాభం, అమ్ముడిపోయాను నేను వాళ్ళకి చీకటి లో వెలుగునై నిలబడ్డాను ఫలితం ... నన్ను చీకట్లోకి తోసివేసారు అమ్మనై లాలించేదాన్ని ఛీ కొట్టి తరిమేశారు మంచిమాటలు నేర్పించాను వాళ్ళకి నానా మాటలు అన్నారు నన్ను దగ్గరకి వచ్చే వారిలో పెద్దవాళ్ళు కొందరు అందులో ఘనులే మొత్తమందరూ నవరాత్రులు ఉపవాసం ఉంటామన్నారు కానీ రాత్రుళ్ళు నరకం చూపించారు వీళ్ళకోసం పొట్ట మాడబెట్టుకున్నాను నన్ను వాళ్ళ పొట్టకూటికి వాడుకున్నారు వట్టి చాకిరీ చేయించారు వర్షం వచ్చినప్పుడు ఏడ్చేదాన్ని వాళ్ళ సుఖం నాకు భోజనం పెట్టేదేమో కానీ నా భోజనం వాళ్ళకి సుఖాన్ని ఇవ్వలేదు అందులో నరులున్నారు , కవులున్నారు , ఘనులున్నారు ఎంతమంది అని చెప్పను ? "అసలు ఎవరు నీవు ? అమ్మవా ? భూమివా ? లేదా అక్షరానివా ? " "ఉహూ" అన్నీ నేనే, ఒక ఆడదాన్ని, ఒక స్త్రీలింగాన్ని "మరి అలంటి మనుషులని నీకేం చెయ్యాలని ఉంది?" "ఇలా ఎంతమందిని చూడలేదు నేను కారే రాజులు రాజ్యముల్ గెలుగరే గర్వోన్నతింబొందరే .... వారేరీ ???"