Contributed by Saikumar Devendla
◆ అమ్మ కురాగాయలకి ధైర్యం గా వెళుతోంది, నాన్న తోడు లేకపోయినా కారణం【పోలీస్】 ◆ బ్యాంక్ నుండి డబ్బులు పోకుండా తీసుకెళ్తున్నాం అంటే 【పోలీస్】 ◆ ఇంట్లో ఆడుకుంటున్న బాబు కనిపించకపోతే 【పోలీస్】 ◆ స్కూల్ బస్ ఇళ్ళకి టైంకి రాకపోతే【పోలీస్】 ◆ రోడ్లు మీద ప్రమాదం జరుగితే【పోలీస్】 ◆ మన అక్కో లేదా చెల్లో పది నిమిషాలు ట్రాఫిక్ జాంలో ఇరుక్కపోతే【పోలీస్】 ◆ లాటరీ టికెట్ అని మనం మోసంపోతే【పోలీస్】 ◆ ఇంట్లో నగలు పోతే 【పోలీస్】 ◆ మనకి కన్నీరు వచ్చినా 【పోలీస్】 ◆ మనకి కష్టం వచ్చినా 【పోలీస్】 ◆ మనకి నష్టం జరిగినా【పోలీస్】
ఇలా ప్రతి దానికీ పోలీస్ నే. పోలీస్ లేకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నాకు తెలిసి ఏ తల్లి కూడా తన కూతురిని బయటికి పంపించడానికి ఇష్టపడరు. బయటనుండి మన కుటుంబసభ్యులు జాగ్రత్తగా వస్తున్నారు అంటే కారణం-పోలీస్. కొడుకు ఇంకా ఇంటికి రాలేదు అని అమ్మ నాన్నతో అంటే వస్తాడులేవే అని గుండెలపైన చెయ్యి వేసుకొని చెప్తారు నాన్న ఆ ధైర్యం-పోలీస్.
కానీ కొందరికి పోలీస్ అంటే చాలా చులకన ఎంతంటే పోలీస్ రా మెల్లగా పోనివ్వు అంటే "ఏం పర్లేదు బాబాయ్ 500 ఇస్తే సెట్ అవుతాడు" అంటారు. 500 కోసం ఆలోచిస్తే ఇవాల కొన్ని కొన్ని వందల ప్రాణాలు పోయి ఉండేవి. పైసలు కోసం చూసేవాడు కాదు సార్, ప్రాణాల కోసం చూసేవాడు పోలీస్ అంటే... మీ 500తో ఏం వస్తుంది నా బొంగు... హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం ఏం ఉంది...ఆయన ప్రాణాలు ఏమైనా పోతాయా. కుటుంబసభ్యులకి చెప్పినట్లు చెప్తాడు హెల్మెట్ హెల్మెట్ అని...
గవర్నమెంట్ టీచర్లకి, ఆఫీసర్లకి, రాజకీయనాయకులకి, పండగ వస్తే సెలవు, వర్షం వస్తే సెలవు, ఊర్లో జాతర అయినా సెలవు, బంధువుల పెళ్లి అయిన సెలవు, ఇంట్లో వాళ్ళ పెళ్లి అయిన సెలవు, ఇంట్లో చిన్న ఫంక్షన్ అయిన సెలవు.
కానీ పోలీస్ అలా కాదు పండగైన, జాతరైన, వర్షమైన, పగలైన, ఎర్రటి ఎండైన, రాత్రి అయినా, అర్ధరాత్రి అయినా, వాళ్ళు ప్రజలకోసం వేటిని లెక్కచేయరు, జ్వరం వస్తే బిళ్లలు వేసుకుని స్టేషన్ కి బయలుదేరుతారు. వాళ్ళ కుటుంబసభ్యులతో కూడా ఎక్కువగా గడపరు. బయట ఎవరైనా ప్రాణాపాయస్థితిలో ఉంటే రక్షించడానికి ముందు వరసలో పోలీస్ ఉంటాడు.. నేను ఉన్నా అని... మన సొంత అన్న కాదు, మన బంధువులు కాదు, మన మిత్రుడు కాదు, అయిన గాని మనకోసం వాళ్ళ ప్రాణాలు అడ్డు పెట్టి మరి రక్షిస్తారు. పొలం లో కంచె పాత్ర ఎలానో సమాజంలో పోలీస్ పాత్ర కూడా అంతే..!