This Unique Themed Coffee Shop In Hyderabad Focuses On The Philosophy Of Life & Significance Of Humanism

Updated on
This Unique Themed Coffee Shop In Hyderabad Focuses On The Philosophy Of Life & Significance Of Humanism

మీకు తెలుసా? భారతదేశంలో ఫిల్టర్ కాఫీ కప్పు కింద సాసర్ ఉండడానికి ప్రపంచం లో మిగిలిన దేశాలలో ఉండే కారణం కన్నా ఇంకో కారణం ఉందని? సంపన్నులు, అగ్రజాతులకు చెందినవారు కప్పులో తాగాలని మిగిలిన వెనుకబడిన కులాలు, పేదవారు సాసర్ లో తాగాలనే నియమం మన భారతదేశంలోనూ కొనసాగింది. అలాగే మీకు తెలుసా కాఫీ ని భారత దేశానికి స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చారు అని..?, మీకు తెలుసా స్వాతంత్ర్య ఉద్యమం లో కాఫీ ఎడిక్షన్ కారణం గా మహిళలు సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొనడం లేదని చర్చ జరిగింది అని? భారత దేశం లో కాఫీ చాలా కాలం అప్పర్ క్లాస్ కే పరిమితమైయిందని? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చర్చించడంతో పాటుగా మంచి కాఫీ తో మరియు ఒక exotic, కూల్, cozy ఆంబియన్స్ తో మన హైదరాబాద్ లో Portafilter అనే పేరుతో కాఫీ షాప్ ఏర్పాటు చెయ్యబడింది.

ఎవరు ఏర్పాటు చేశారు? జయంతి విశ్వనాథ్, కోటేశ్వరరావు ఇద్దరూ మంచి స్నేహితులు, ఒకరి ఆలోచనలు మరొకరికి దగ్గరగా ఉండడం వల్ల సంవత్సరాల తరబడి స్నేహితంగా ఉంటున్నారు. విశ్వనాధ్ జయంతి, కోటేశ్వరరావు అనే ఇద్దరు స్నేహితులు కలిసి ఏదైనా కొత్తగా చేద్దాం అని చేస్తున్న ఆలోచనలకు రూపంగా ఈ కాఫీ షాప్ నిలిచింది. ఈ ఇద్దరిలో విశ్వనాధ్ జయంతి మానవహక్కుల, మానవవాద ఉద్యమకారులు మరియు ప్రముఖ హేతువాది, మానవవాది. కోటేశ్వరరావు ఫార్మా కంపెనీలో దాదాపు పదేళ్ళ పాటు పని చేసి సొంతగా వ్యాపారం చెయ్యాలని విశ్వనాధ్ తో కలిశారు.

ఇక్కడి ప్రతి వస్తువు ఆలోచనల పుట్టుకకు కారణాలు: గడిపిన కాసేపు సమయం ఐనా కస్టమర్స్ మనసులో కొన్ని ఆలోచనలు రేకెత్తించాలని వారు సంకల్పించారు. దేశానికి కావాల్సింది హరోస్కోప్ కాదు టెలిస్కోప్ అన్న బాబుగోగినేని మాటలు స్ఫూర్తిగా ఈ కాఫీ షాప్ అంతటిని ఓ జ్ఞాన మందిరంలా నిర్మించారు. ఇక్కడ గోడలు, వస్తువులు మౌనంగా ఉండవు. మన ఉన్నతికి అవసరమయ్యే వాటిని వివరిస్తూనే ఉంటాయి. ఆదిమానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు గల ప్రయాణం, నిప్పును తయారుచేయడం తద్వారా వంట వండడం, మనం రోజూ ఇష్టంగా తాగే కాఫీ పుట్టుక ఎలా జరిగింది మొదలైన చిత్రాలన్నీ ఈ గోడలపై నిక్షిప్తమై ఉన్నాయి.. Portafilter లోకి ఎంటర్ అవుతూనే బుద్ధుని ప్రతిమ మనకి స్వాగతం పలుకుతుంది. బుద్ధుని ప్రతిమ తల వెనుక చక్రం లేకుండా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. చక్రం లేని బుద్ధుడుని దేవునిగా కాక ఒక ఫిలాసఫర్ గా, ఒక సంస్కరణ కర్త గా భావిస్తారు. కారిడార్ లో బుద్దిని ప్రతిమకు ఇరువైపులా ఉండే పచ్చటి మొక్కలు, ప్రతిమ వెనుక ఏర్పాటు చేయబడిన వాటర్ ఫౌంటెన్ లోపలికి వెళుతూనే ఒక ఆహ్లాదకరమైన ఫీల్ ని కస్టమర్ లకి అందిస్తుంది.

హ్యూమనిజమ్ థీమ్: వోల్టేర్ నుండి మొదలుకుని కోవూర్ మొదలైన వారి తాత్విక భావాల స్ఫూర్తిగా, డార్విన్, ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్ మొదలైన శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఆలోచనలను గుర్తు చేసే విధంగా ఇక్కడి గోడలు మనల్ని పలుకరిస్తాయి. కాఫీ చరిత్ర ని కూలంకషం గా వివరిస్తూ ఉన్న కొటేషన్స్ ఆకట్టుకుంటాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని, హ్యూమనిజం యొక్క ఆవశ్యకతని చాటిచెప్పే పలు కొటేషన్స్ మన మెడదులోకి చొచ్చుకుపోతాయి. 'Reason not religion' అని, 'democracy need dialogue not dogma, reson not ritual, లాంటివి కొన్ని ఉదాహరణలు. మొత్తం కాఫీ హౌస్ అంతటా ఏర్పాటు చేసిన మూవీ మైక్రో పోస్టర్స్, కాఫీ హిస్టరీ ని వివరిస్తూ గోడల పైన చేసిన విజువల్ డిటైలింగ్, మానవవిలువలను గురించి మాట్లాడే కొటేషన్స్, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచే ఆర్ట్ వర్క్ ఈ షాప్ ని మరొక స్థాయిలో నిలబెడతాయి.

రోడ్డుపక్కన చిన్ని కాఫీ షాప్ నుండి ఫైవ్ స్టార్ హోటల్ వరకు: విశ్వనాథ్, కోటేశ్వరరావు ఈ కాఫీ షాప్ మొదలుపెట్టడానికి పెద్ద రీసెర్చ్ చేశారు. ఇంటి దగ్గర్లో రోడ్డు పక్కన ఉన్న చిన్ని టీ స్టాల్ నుండి ఫైవ్ స్టార్ హోటల్ లోని కాఫీ రుచి చూశారు. వాటి ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉంది.? కష్టమర్స్ తో మాట్లాడే పద్ధతి, కాఫీలోని వెరైటీలు మొదలైన వాటి గురుంచి సంవత్సరం రీసెర్చ్ చేసి అక్కడ దొరికే వెరైటీల కన్నా బెటర్ టేస్ట్ లను అందుబాటు ధరల్లోకి తీసుకొచ్చారు. మొత్తం 75 సీటింగ్ ఉన్న ఈ portafilter కాఫీ హౌస్ లో ప్రపంచ స్థాయి కాఫీ తో పాటుగా, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, మఫిన్స్, కప్ కేక్స్, కుకీస్, శాండ్విచ్, బర్గర్స్, పాస్తా మరియు పూర్తి స్థాయి లో కాంటినెంటల్ మెనూ ని బ్రేక్ ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు సర్వ్ చేస్తున్నారు.

For More Information: https://www.facebook.com/Portafiltercoffeehouse/ Call: 9000991908