It Is Important To Practice Yoga Although There Is No Health Issues. Here's Why!

Updated on
It Is Important To Practice Yoga Although There Is No Health Issues. Here's Why!

ఈ ఆర్టికల్ సాధారణమైనది.. పడిపోయి, లేచి తర్వాత పోరాడి గెలవడం లాంటి మీరు రెగ్యులర్ గా చదివే సంఘనలు ఇందులో ఉండకపోవచ్చు.

ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చాక యోగ మొదలుపెట్టాలని అనుకుంటే కనుక, మీరు ఆ ప్రాబ్లమ్ కోసం ఎదురుచూడడమే అవుతుంది.

రమ్య గారి జీవితంలో ఎలాంటి విషాదకరమైన, హృదయవిధారకమైన సంఘటనలు ఏమీ లేవు. మంచి తెలివితేటలు, అమ్మ నాన్నలు, భర్త, అత్త మామలు తనను అద్భుతంగా చూసుకుంటారు. ఐతే ఎప్పుడైతే యోగ మీద అభిరుచి కలిగి, సాధన చేయడం మొదలుపెట్టారో అప్పుడే తను ఊహించినదాని కన్నా జీవితం మరో మెట్టుకు ఎదిగింది.

మన పళ్ళు పాడయ్యాకనా మనం బ్రషింగ్ చెయ్యడం మొదలుపెట్టేది.? యోగ కూడా ముందుగానే మొదలుపెట్టాలి. రమ్య గారు హైదరాబాద్ లో పుట్టి పెరిగారు. కొంతకాలం పాటు జాబ్ చేసి బుద్ధి, మనసు నిర్ధేశించిన దాని ప్రకారం ప్రస్తుతం యోగ టీచర్ గా పనిచేస్తున్నారు. రమ్య గారి దృష్టిలో.. మాములుగా ఐతే శారీరక, మానసిక ఇబ్బందులు ఉంటే ముందుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి అప్పటికి ఉపశమనం లభించకుంటే కనుక ఆ తర్వాత యోగ, మెడిటేషన్ చెయ్యడం మొదలుపెడతారు, ఇదొక పెద్ద ప్రాసెస్. యోగ, ధ్యానం అంటే శారీరక మానసిక సమస్యల కోసమే అని అనుకుంటారు కానీ అవి అంతకు మించిన ఫలాలను అందిస్తాయి. ఫలానా ఇబ్బందుల కోసం మొదలుపెడితే వారికి ఉపశమనం లభించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అదే ఏ విధమైన ఆరోగ్య సమస్యలేనప్పటి నుండే మొదలుపెడితే కనుక వీటన్నింటి కన్నా అత్యున్నతస్థాయిని చేరుకోగలరు. ఇది ఎవరికి వారు అనుభూతి చెందడమే..

18 ఏళ్లకే యోగ మొదలుపెడుతున్నవారు ఉన్నారు.. రమ్య గారికి కేవలం యోగానీ అనుభూతి చెందాలని మొదట జాయిన్ అయ్యారు. ఆ తర్వాత నెమ్మదిగా తనలోని కొద్దిపాటి ఆందోళనలు, నిద్రలేమితనం, చిన్న విషయాలకు కూడా ఒక్కోసారి ఎక్కువ ఆలోచించడం, ఇబ్బందికరమైన విషయాల నుండి త్వరగా బయటపడలేని వాటి నుండి పూర్తిగా కోలుకుని అసలైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. రమ్య గారు మొదట ఇషా ఫౌండేషన్ లో జాయిన్ అయినప్పుడు అక్కడ 18 సంవత్సరాల యువత రావడం చూసి "అరే, నేను కూడా త్వరగా నేర్చుకునేదుంటే కనుక, త్వరగా మరిపోయేదాన్ని కదా అని అనుకున్నారట". ఆ తర్వాత 60, 70 సంవత్సరాల పెద్దవారు కొందరు తనదగ్గరికి వచ్చి "చాలా సంతోషంగా ఉందమ్మ నిన్ను చూస్తుంటే, మేము కూడా మీ వయసులోనే యోగ నేర్చుకునేదుంటే మా జీవితం వేరేలా ఉండేదని" చెప్పేసరికి యోగ మన అనుమానాలను కూడా వెంట వెంటనే నివృత్తి చెయ్యగలదని తెలుసుకున్నారు.

టెక్నాలజీ మూలంగా యోగ అందరికి దగ్గరయ్యింది: ఒకప్పుడు ధ్యానం, యోగ చెయ్యాలంటే అన్ని వదులుకుని ఆశ్రమంలో గడపాల్సిన పరిస్థితులుండేవి, ఇప్పుడు అలాంటివేమి లేదు, మన ఉద్యోగం మనం చూసుకుంటు ఇంట్లోనూ టెక్నాలజీ ద్వారా సాధన చేసుకోవచ్చు. ప్రస్తుతం రమ్య గారు హత్ యోగా శిక్షణ ఇస్తున్నారు. ఇందులోనే సూర్యక్రియ, మంత్రం యోగ, అంగమర్ధన, బంధాస్, యోగాసనాలు, నాద యోగ, ప్రాణాయామం, నాడీ శుద్ధి మొదలైన శిక్షణ తరగతులను కేవలం ఏడు సంవత్సరాల పిల్లల దగ్గరి నుండి మొదలుపెడుతున్నారు.

యోగ నా.? నాకేం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవే!! నేనేమైన పని పాట లేని ముసలోడినా ఏంటి.? లాంటి ఆలోచనలు పెట్టుకోకుండా త్వరగా మేల్కొవడం గొప్ప ఫలాలను ఇస్తుంది. మన దేశ యువతలో ఉన్న అత్యున్నత శక్తిని మందు, సిగరెట్ లాంటివి ఎదుర్కోవడానికి ఉపయోగించి పాడుచేసుకోవడం కన్నా మన శక్తిని మరో వెయ్యి రేట్లు పెంచుకునే వాటిపై దృష్టి సారిస్తే మీరు ఈ ప్రపంచంలో ఉన్న మరో అద్భుతం అవుతారు.