Contributed By Gireesh Raman
ఓ..పనికిమాలిన తోటమాలి!
నీ సారాయి సీసా పగిలి,
తోటంతా పెంకులు, పగుళ్ళు!
నీ సారని మట్టి తాగి సారాన్ని మరిచాయ్.
కలుపులొచ్చాయ్!
ఈ నేలకి తలుపులొచ్చాయ్,
అడుగడుక్కీ తడికలొచ్చాయ్,
ఇక అలా సమస్యలొచ్చాయ్!
అలానే, ఎలానో!
ఇదంటు, అదంటు..
లేనిదంటూ లేదంటూ, అన్ని వచ్చాయి!
అన్ని వచ్చాయి.
కనీళ్ళొచ్చాయి, కష్టాల్లొచ్చాయి.
సంస్కృతులొచ్చాయి, సంస్కరణలొచ్చాయి.
ఆవిష్కరణలొచ్చాయి, బహిష్కరణలొచ్చాయి.
పంతాలొచ్చాయి, పోరాటలొచ్చాయి.
సర్కార్లోచ్చాయి, సర్కస్లోచ్చాయి.
పతాకలొచ్చాయి, పథకాలొచ్చాయి.
ఆ ప్రభుత్వ పథకాల చివర
ఉరితాడుకు వేలాడుతున్నాడే
వాడే మనిషి.
ఏమవుతుందో తెలియక
ఏం చెయ్యాలో తెలియక
తెలిసి తెలియక
అలా గుడ్డి గద్దలా విహరిస్తున్నడే
వాడే మనిషి.
రంగు రంగుల
మత్తు మతుల
కమర్షియల్ మనిషి!
ఎన్నెన్ని చేసాడో!
ఎంతెంత చేసాడో!
అది ఏల రా? ఇది ఏల రా?
అస్సలు,
నేలనేలడమేల?
పంపకాలేల? పంపులేల?
భూమాతతో భూమి ఆటలేల?
ఏల ఈ పరువు బరువు?
ఏల రా ఈ పరంపరాల తరలింపు?
నీ సత్తు వాడికెందుకురా?
వాని సత్తువు వాడికుండగా.
నీ కష్టాలు దానికెందుకురా?
దాని యుద్ధం దానికుండగా!
ఏల ఈ అరువు? ఏల ఈ కరువు?
అరవడం కరవడం కాకా ఇంకేమోచేమీ?
లేమి!
చద్ది మూట సద్ది..
కోతలు కోస్తావు,
కూతలు కూస్తావు,
గొంతులు కోస్తావు!
పెను పాణము పేను ఈరులా?
నెత్తుటి సెలయేర్లు
పత్రికల సిరా పూయువా?
సిరామిక్ సొరలురా మీరు!
ప్రాణం ఖరీదు..
గరీబుకు ఒకటా?
నవాబుకు ఒకటా?
అస్సలు,
నెత్తురదిగిన దేవత ఎవరు?
పూనకమొచ్చి ఊగిన చమట ఎవరు?
ఇట్లాంటి నీచపు కవిత రాసిందెవరు?
నీవు కాదా! మాయలోడా!
నెలవంకలు కావవి కొడవళ్లు!
సిలువలు కావవి కత్తిపీటలు!
స్వస్తిక్ కాదది నాజీ చిహ్నం!
శవాల కూరలు, శివాలయాలు, శిలాయాలు.
కార్జాలు, ఖర్జురాలు, కబ్జాలు.
ఎట్టి నాటకం! అట్టి బూటకం!
గీతలు గియ్యమందా గీత?
భరతం పట్టమందా భారతం?
అస్సలు,
గీతలు ఉన్నాయా!
గీతలు గీసావెందుకురా?
చెరిపావెందుకురా?
బలపాల బ్రతుకులను బలిపానం కోరాయ చెదల చరిత్రలు?
నువ్వు కుట్టకుంటే పుట్టేదా విభజన జండా?
నువ్వు పెట్టకుంటే ఉండేదా చాకలి బండ?
మకుటాలు కావాలి ఒకడికి,
మెతుకులు కావాలి ఒకడికి.
కుర్చీ కావాలొకడికి,
మంచం కావాలొకడికి.
క్షవరాలు కావాలి, సవరాలు కావాలి.
సావాసాలు కావాలి, సమరాలు కావాలి.
లోహాలు కావాలి, లాభాలు కావాలి.
తీరేదే లేదా నీ వాంఛల ఆకలి.
ఇక తీరాన్ని తాకదా ఆ కడలి.
స్వతంత్రం దేనికి?
స్వరంగాలు తవ్వుతక?
స్వ-అంతరంగాల స్కోభ ఛేదించుటకు కాదా!
అన్నన్ని గనులెందుకు?
అన్నన్ని గన్నులు ఎందుకు?
ఇంకెక్కువ తవ్వకు పాతాళం తగులును! ఇస్సుకెక్కువ తియ్యకు భూగోళం పగులును!
తుపాకులు కరిగించి దిమ్మె చేసి చూడు, అనంతాన్ని అంటదా!
తూటాల్లాన్ని నాటి చూడు,
అరణ్యాన్ని మించదా!
ఇంకేడయ ప్రయాగ?
ఇంకెనయ ఈడ ఇమడక!
పూలేవి?
సమాధులపైనున్నవ?
చిలుకలేవి? రామ చిలుకలేవి?
చిలుకలేవి? సీతాకోక చిలుకలేవి?
ఆ సమాధులలోనున్నవ?
వెన్నుపూస నిఠారుగుందని పొగరు!!
ఎప్పుడు ఏ బ్రిడ్జి కూలిద్దో తెలియదు!
ఎక్కడ ఏ బాంబు పేలుద్దో తెలియదు!
భరోసా లేని ఈ అహర్నిశల బానిస బ్రతుక్కి నవ్వుల కరువు, బాధల బరువు.
ఏ నాడైనా నిలకడగా నిల్చున్నావా నీవు?
ఏ నాడైనా ప్రశాంతంగా జీవించావా నువ్వు? అడుగులు-నడకలు-పరుగులు.
ఇంతేనా! అంతేనా?
సక్కగున్నది ఏదీ?
చక్కలిగింత అనుచిత అంటు అయ్యనే!
అంతూపొంతూ లేకుండా చెక్కిలి పొయనే!
సక్కగున్నది ఏదీ?
ఇదేలా నాశనం?
ఇదేలా వినాశనం?
మాది.
మది.
ఇవి రెండేరా సమస్యలు.
సమస్యల సదస్సేరా మనుష్యులు.
ఓ గజంలో గజమును పెట్టగలవా?
మనుషుల మనసులు మార్చగలమా!
ఇదేలా నాశనం?
ఇదేలా వినాశనం?
అస్సలు,
నీవే లేకుంటే..
చక్రముండునా? అక్రమముండునా?
రాపిడుండునా? రాచుకుండున?
బల్లేముండునా? బలిలుండునా?
బలులుండునా? బలహీనులుండునా? మతముండునా? మఠంముండునా?
కులాలుండునా? దళాలుండునా?
గదులుండునా? గడులుండునా?
గడులుండునా? గళ్లుండునా?
గడియలుండునా? గొడవలుండునా?
గాయముండునా? గమ్యముండునా?
విఫలముండునా? విప్లవముండునా?
తూకముండునా? తుపాకుండునా?
వ్యాపారముండునా? వ్యభిచారముండునా?
అత్యాచారముండునా? హత్యాచారముండునా?
తీవ్రవాదముండునా? ఉగ్రవాదముండునా?
మితివాదముండునా? అతివాదముండునా?
సిద్ధాంతముండునా? వేదాంతముండునా?
మెట్టెలుండునా? మత్తుండునా?
బన్నులుండునా? పన్నులుండునా?
పాలకులుండునా? పీడితులుండునా?
పౌరులుండునా? పాలేరులుండునా?
కాలుష్యముండునా? కల్మషముండునా?
కాలువలుండునా? కవులుండునా?
కవులుండునా? కావులుండునా?
కొలతుండునా? కలతుండునా?
కంచుండునా? కంచె ఉండునా?
లంచముండునా? లాంచనాలుండునా?
కష్టాల్, నష్టాల్,
కోపాల్, తాపాల్, శాపాల్ ఉండునా?
ఉద్యోగాల్, సద్యోగాల్ ఉండునా?
మోహాల్, అహాల్ ఉండునా?
కక్షల్, శిక్షల్ ఉండునా?
న్యాయల్, అన్యాయాల్ ఉండునా?
అవినీతుల్, హితుల్, హతుల్ ఉండునా?
రోగాల్, రాగభోగాల్ ఉండునా?
లెక్కలేనన్ని పాపల్ ఉండునా?
అంత చేసావు. అంతం చేసావు!
అన్నాన్ని చేసిన నిన్ను మళ్ళీ అడుగుతున్నా -
ఏ నాడైనా నిలకడగా నిల్చున్నావా?
ఏ నాడైనా ప్రశాంతంగా జీవించావా? అడుగులు-నడకలు-పరుగులు.
ఇంతేనా! అంతేనా?
ఓ..పనికిమాలిన తోటమాలి!
నీ సారాయి సీసా పగిలి,
తోటంతా పెంకులు, పగుళ్ళు!
నీ సారని ఈ మట్టి తాగి సారాన్ని మరిచాయ్.
కలుపులొచ్చాయ్!
ఇక నువ్వు రాజీనామా చెయ్యి.