సరిగ్గా 19 సంవత్సరాల క్రితం.. జెస్సి గారు గర్భవతి అయ్యారు. తనకు ఇంకా భర్త ఆనందాలకు అవధులు లేవు.. అమ్మ నాన్నలు లేకపోవడం వల్ల జెస్సి గారి భర్త అన్ని రకాలుగా అండగా ఉన్నారు. "నేను ఒక మనిషికి జన్మ ఇవ్వబోతున్నాను.." ఇక నుండి నాది రెండు ప్రాణాలు అని ఆహార విషయంలో, డైలీ రొటీన్ విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. ఐతే బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు జెస్సి గారికి ఒక కోరిక కలిగింది తనకు పుట్టబోయే బిడ్డ ఎడమచేతి వాటం గలవాడైతే బాగుంటుంది అని.. ఇదే విషయాన్ని తన పూజ్యగురువు రుషిప్రభాకర్ జి గారిని అడిగారు.. "ప్రతి మనిషిలో ఒక మహత్తర శక్తి ఉంది జెస్సి, నువ్వు బలంగా కోరుకో నీకు నచ్చే బిడ్డ పుడతాడు" అని గురువు గారు అన్నారు. గురువు పట్ల అమితమైన భక్తి, నమ్మకం ఉండడంతో జెస్సి గారు అలాగే కోరుకున్నారు. ఫలితంగా జెస్సి గారికి ఎడమచేతి వాటం గల పండంటి బిడ్డ పుట్టాడు..
19 సంవత్సరాలు.. 10,000 మంది తల్లులు:
ఈ సంఘటన జెస్సి గారి జీవితంలో జరిగి ఇప్పటికి 19 సంవత్సరాలు అవుతుంది. తన కొడుకుకు ప్రత్యేకంగా ఏ శిక్షణ ఇవ్వలేదు సహజంగా జన్మతః ఎడమచేతి లక్షణం వచ్చేసింది. అప్పుడే గురువు గారి మాటలలోని గొప్పతనం పరిపూర్ణంగా తెలుసుకున్నారు. బిడ్డ పుట్టినప్పుడే కాదు కడుపులో పడకముందు నుండే తల్లి ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేకుండా కలుగుతారు. కానీ మన దేశంలో అనారోగ్యం వల్ల గర్భిణీలు, బిడ్డలు చనిపోతుండడం చూసి వీరికంటూ సమాజంలో ఒక పౌరురాలిగా సహాయమందించాలని జెస్సి గారు "జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ" ని 19 సంవత్సరాల క్రితం ప్రారంభించారు.
గర్భిణీ స్త్రీలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి ఇందుకోసం యోగ తప్పనిసరి. జెస్సి గారు క్రిస్టియన్ ఛారిటీ లో పెరిగారు, అక్కడ టీచర్ ట్రైనింగ్, యోగా కూడా నేర్పించారు. తన దగ్గరికి ట్రైనింగ్ లో కోసం వచ్చే తల్లులకు ఉపశమనం కలిగించడానికి యోగ, చిన్నపాటి వ్యాయామం చేయిస్తారు. వ్యాయామం(ప్రత్యేకంగా గర్భిణి స్త్రీలకు అనుగూణమైనవి) మూలంగా గర్భిణి ఎక్కువ బరువు పెరగకుండా ఉంటారు, బిడ్డ న్యూరోనల్ గ్రోత్, మెటబలిటిజం పెరగడానికి, శరీరపు నొప్పులు తగ్గడానికి, తల్లికి బిడ్డకు గర్భదశలోనే ఎమోషనల్ బాండింగ్ పెరగేలా కథలు, వాతావరణం మొదలైన అన్ని విషయాలలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే రెండు దశాబ్దాలుగా పదివేల మంది తల్లులకు అమ్మలా గైడెన్స్ ఇవ్వగలిగారు.
గర్భిణీ స్త్రీ ని దత్తత తీసుకోండి:
అటు ధనవంతులకు ఇబ్బంది లేదు, ఇటు పేదవారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఎటొచ్చి మిడిల్ క్లాస్ కుటుంబాలకే ఇబ్బందులు.. బయటకు చెప్పుకోలేరు, బాధలు దిగమింగలేరు.. జెస్సి గారి ప్రయాణంలో ఇలాంటి తల్లులను ఎందరినో కలిశారు. జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో గైడెన్స్ తీసుకున్నవారిలో ఎక్కువమంది ఇలాంటి గర్భిణీ స్త్రీలను దత్తత తీసుకునేందుకు జెస్సి గారు వారధిలా ఉంటున్నారు. ఇప్పటికి కొన్ని వేల మందికోసం ఉచితంగా వర్క్ షాప్ లు, దత్తత తీసుకునేలా చర్యలు చేసి ఎందరో కన్న తల్లుల కలలు
పండిస్తున్నారు.
For more information: http://jessymaa.com/