రఘురామ్ ఒక గవర్నమెంట్ ఉద్యోగి జీతం నెలకు 20,000. కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాడు వారి ప్రేమకు ప్రతి రూపంగా పాప, బాబు కవలలు కలిగారు ప్రపంచంలో వారికున్నంత సంతోషం ఎవ్వరికుండదేమే అన్నంతలా జీవితం గడుపుతున్నారు ఇద్దరికి మంచి విద్యనందించాలని ఒక ప్రైవేట్ స్కూల్ లో జాయిన్ చేశారు నర్సరీకే ఒక్కొక్కరికి రూ.50,000 వసూలు చేశారు ప్రతి ఎడాది ఫీజు రెండింతలు పెంచూతు, ప్రతి నెల ఆ ఫీజు ఈ ఫీజు అంటూ ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. ఐదో తరగతి చదువుతున్న వారి ఫీజు సంవత్సరానికి ఒక్కొక్కరికి మూడు లక్షలు! ప్రతి సంవత్సరం అప్పు చేస్తు వచ్చాడు తన వల్ల కాలేదు కేవలం 5వ తరగతికే గవర్నమెంట్ ఉద్యోగి అయిన రఘు తన ఇల్లును అమ్మేసి తన ఇంట్లో నే రెంటుకు ఉండాల్సిన దుస్థికి వచ్చి ఆర్ధికంగా చితికిపోయాడు ప్రైవేటు స్కూల్ లో ఇద్దరిని చదివించే శక్తి లేక పాపను గవర్నమెంటు బడికి పంపిస్తున్నాడు అభ్యుదయ భావాలు కలిగి స్త్రీ సమానత్వం కోసం ఎంతో ఆరటపడిన రఘు నేడు ప్రస్తుత కార్పోరేట్ స్కూల్ ఆగడాల ముందు ఓడిపోయాడు ప్రాణంలా పెంచుకున్న తన కన్న కూతురి మీద వివక్ష చూపేంతటి హృదయ విదాయకర పరిస్థితి దాపురించింది అన్నయ్య ఎందుకు బస్ లో నేను ఎందుకు నడుచుకుంటు వేరే స్కూల్స్ కు వెళ్తున్నామో ఆ చిట్టితల్లికి అర్ధం అయ్యింది. ఇలాంటి పరిస్థితి కేవలం రఘురామ్ కుటుంబానిది మాత్రమే కాదు 10లో 8 మంది ఎదుర్కుంటున్న సమస్య.
సాధారణంగా చిన్నపిల్లలు బడికి వెళ్ళడానికి మారం చేస్తు ఏడుస్తుంటారు కాని ఇప్పుడు స్కూల్ ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఇద్దరికి ఏ తేడా కనిపించడంలేదు ఇద్దరు యాజమాన్యం అంటేనే భయపడుతున్నారు! ఇలాంటి బతుకు ఎందుకు దర్జాగ ప్రభుత్వ బడికే పంపవచ్చుగా అంటే గవర్నమెంట్ స్కూల్ లో సరైన వసతులు ఉండవు టీచర్ ఎప్పుడొస్తాడో తెలియదు ఇవన్ని పక్కకి పెడెతే నేటి పోటి ప్రపంచానికి తట్టుకునేల విద్యార్ధులను ప్రభుత్వ బడులు తయారు చేయగలవా? స్కూల్ ప్రారంభమైన నెల తర్వాత పుస్తకాలు వచ్ఛే ఈ పాఠశాలలో తమ పిల్లల బంగారు భవిషత్తును ఎలా అందించగలరు? సాక్షాత్తు ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులే వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారు ఇంకా మాములు ప్రజానీకం ఎలా ధైర్యం చేయగలరు! రోజువారి కూలి పనిచేసుకునే వారు సైతం ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారు ఇది అదనుగా భావించి ఎలాగూ ప్రభుత్వ పాఠశాలలో చదివించరు అని అడ్డు అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారు వీరి నియంతృత్వ పోకడల వల్ల తల్లిదండ్రులతో పాటు పిల్లల భవిషత్తుతో కూడా ఆడుకుంటున్నారు. ఈ నెల 13 నుండి నూతన విద్యా సంవత్సరం మొదలయింది కిందటేడాది కంటే ఈ ఏడాది రెట్టింపు ఫీజు పెంచి వసూలు చేస్తున్నాయి చాలా స్కూల్స్ .. ఈరోజు ఒక ఇంజనీరింగ్ చదవడానికి అత్యుత్తమ కళాశాల సి.బి.ఐ.టి లాంటి అత్యుత్తమ కళాశాలలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు లక్ష పదివేలు కాని ఒక సాధారణ ఎల్.కే.జి సీటు కోసం లక్షరూపాయలు వసూలు చేస్తున్నాయి హైదరాబాద్ లోని కొన్ని స్కూళ్ళు.
కేవలం చదువు కోసమే కాదు పుస్తకాలు, యూనిఫామ్, బస్ ఫీ, గేమ్స్ ఫీ, కల్చరల్ ఆక్టివిటీస్ అంటు ఇలా ప్రతి ఒక్క వాటి మీద ఊహించనంత భారాన్ని మోపి తల్లిదండ్రులను చీల్చి చెండాడుతున్నారు. పెన్సిల్ కూడా పట్టుకోవడం కూడా రాని వయసులో ఇంజనీరింగ్ కోచింగ్, ఐఐటి కోచింగ్, మెడిసిన్ కోచింగ్ అంటు దండుకుంటున్నారు. పోని ఇన్ని లక్షలు ఖర్చుపెట్టినా సరైన సౌకర్యాలు ఉన్నాయా అంటే అవ్వేమి ఉండవు అద్దెకు తీసుకున్న అగ్గిపెట్టె లాంటి గృహాలు, ఆట స్థాలాలు ఉండవు, కనీసం పార్కింగ్ స్థలం కూడా లేని స్కూల్స్ ఎన్నో ఉన్నాయి ఇలాంటి వారు చేసేది దోపిడి కాక మరేమిటి! గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం నర్సరీ ఫీజు 15,000 మించి ఉండకూడదు, ఫీజులో 5% మాత్రమే లాభాన్ని తీసుకోవాలి, డొనేషన్స్ ఇతర ఏ ఇతర ఫీజులు వసూలు చేయరాదు, మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఫీజు పెంచాలి కాని లక్ష నుండి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నారు ఏడాదికి రెండింతలు ఫీజు పెంచుతున్నారు ఇదంతా అత్యధికంగా దేశం మెత్తం మీద అత్యధికంగా హైదరాబాద్ లోనే వసూలుచేస్తున్నారు.
ప్రభుత్వంలో చిన్న లోపం జరిగితేనే ప్రతిపక్షాలు ఇతర నాయకులు గగ్గోలు పెడుతుంటారు కాని ఇలా ఏటా కోట్లకు కోట్ల అమాయకుల నుండి దోపిడి జరుగుతుంటే ఏ ఒక్క నాయకుడు మాట్లాడరు ఏందుకంటే వారికి సంవత్సరానికి ఇంతా అని పార్టీ ఫండ్ వస్తుంది కదా ! వారి పార్టీ నాయకులవే కదా ఆ స్కూల్స్ ఇంకెందుకు వారిపై పొరాడతారు! ఏది ఏమైనా ఈ దందాలకు అడ్డుకట్ట వేయాలి. ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలకు కు ఒక ప్రత్యేక చట్టం అమలు పరచాలి. ఒక మొక్క సరైన విధంగా నాటితేనే అది సరిగ్గా పెరుగుతుంది దాని వేర్లు, పునాధి బలంగా ఉంటుంది. భారతదేశ భవిషత్తుకు పిల్లలే సైనికులు వారిని సరిగ్గా ఎదగనిస్తేనే అది దేశ భవిషత్తుకు మంచిది.