రాంబాబు,వెంకటేష్,శ్రీనివాస్...etc..! ఎవరు వీల్లంతా..? వీల్లలో ఎవరో ఒకరు స్కూల్లో మనకు పాటాలు చెప్పిన మాష్టారో,మనతో కలిసి చదువుకున్న స్నేహితుడో, మనకు పాలు పోసే వాడో, కూరగాయలమ్మే వాడో అంతెందుకు మన బాబాయో, మామయ్యో ఎవరో ఒకరు అయ్యే ఉంటారు.. ఎందుకంటే ఇవి కామన్ మేన్(ఒక సగటు మనిషి) పేర్లు... అందుకే మన చుట్టూతా ఉండే వాల్లలో మీకు వీల్లు కనపడుతారు.. ఎవరూ ఏ సర్వే చేయకపోయినా 100లో కనీసం 10మంది ఇలాంటి కామన్ మేన్లే ఉంటారని బల్ల గుద్ది చెప్పొచ్చు..
ప్రస్తుతం మిగతా వారిని వదిలేసి శ్రీనివాస్ ల గురించి మాట్లాడుకుందాం...శ్రీనివాస్ అంటే ఎవరు..? కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు..ఆ తర్వాత ఆయన మీద ఉన్న భక్తితో కొన్ని వేల మందికి ఆ పేరు పెట్టబడింది తమ తమ తల్లిదండ్రుల ద్వారా..
శ్రీనివాస్ అనే పేరు వినగానే మీకు ఎవరు గుర్తొస్తారు...
లెక్కల పిచ్చోడికి శ్రీనివాస రామాజున్ గుర్తొస్తాడు..
సినిమా పిచ్చోల్లకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గుర్తొస్తాడు..
కవితా ప్రియులకు శ్రీరంగం శ్రీనివాసరావు గుర్తొస్తాడు...
ఇలా ఒక్కరా...ఇద్దరా..ఈ లిస్ట్ చూడండి.. మీకు పిచ్చెక్కుతుంది...తమ తమ రంగాలలో ఎంత మంది శ్రీనివాస్ లున్నారో...!ఆ పేరులో నిజంగానే ఏదో అన్- నౌన్ వైబ్రేషన్ దాగుంది..శ్రీనివాస్ లందరూ తప్పక గర్వించాల్సిన విషయం ఇది.. అందుకే.. ఎందరో శ్రీనివాస్ లు...అందరికి వందనములు..this Article is dedicated to All srinivas లు over...














