Director Puri Jagannadh's Powerful Note About RGV From 'నా ఇష్టం' Book

Updated on
Director Puri Jagannadh's Powerful Note About RGV From 'నా ఇష్టం' Book

Ram Gopal Varma Aka RGV... introductions, special elevations ivvakkarledhu ee jeevi ki... yendhukante ithane oka sensation, life celebration. So no introduction. Ithani gurinchi okokkaru okokkala chebuthuntaru.. konthamandhi manodni 'Mentalodu' ani antaru.. marikontha mandhi 'Devudu' ani antaru... ika mana Dashing Director Saab Puri gaaru yemantaru ante...

(RGV " నా ఇష్టం " నుంచి)

Socrates, Plato... నేను పుట్టకముందే పోయారు. Nietzsche, Ayan rand ల పుస్తకాలు తప్ప మనుషులు దొరకలేదు. పక్కనే Pune లో ఉన్న Osho Rajneesh ని చూడలేక పోయాను. కానీ.... ఈ రామ్ గోపాల్ వర్మ తో మాట్లాడుతున్నాను, తిరుగుతున్నాను, కలిసి తాగుతున్నాను... ఇంత కంటె ఏం కావాలి నాకు?

ఆయన్ని చూస్తుంటే ఇన్ని తెలివితేటలు ఈ జన్మలోనే వచ్చాయా ఈయనకీ అనిపిస్తుంది. ప్రపంచంలో Rebels ని వేళ్ల మీద లెక్కపెట్టొచు. అందులో ఒకడు మన మధ్య ఉన్నాడు... REBEL GOPAL VARMA

రాము అంటే నాకు పిచ్చి... అదో రకమైన మోజు... ఎంత ఇష్టం అంటే ఆయన నుంచి ఫోన్ వస్తే ఏం చేస్తున్నా మధ్యలో ఆపేసి ఎన్నోసార్లు లేచి వెళ్ళిపోయాను ఆయన్ని కలవటానికి... ఆయనంటే అంత ఇష్టం. నా Life లో హీరో RAMGOPAL VARMA హీరో అని ఎందుకు అన్నానంటే... Note: ఈ దిగువన ఉదహరింపబడిన అతని యొక్క లక్షణములను పరికించి చూడండి...

తను ఏం అనుకుంటే అది చేస్తాడు... ప్రపంచం బద్దలైనా పట్టించుకోడు... అందరితో చక్కగా నిర్మొహమాటంగా మాట్లాడేయ్యగలడు... సినిమా తప్ప మరో గొడవ లేదు... ఎవరిమీదైన సినిమా తియ్యగలడు... వాళ్లతో యుద్దం కుడా చెయ్యగలడు... ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు... Mood వచ్చినప్పుడు లేస్తాడు... ఆకలెస్తే తింటాడు... లేదా తినడు... ఏంటీ అని అడిగేవాడే లేడు... తను కలవాలి అని అనుకుంటే ప్రపంచంలో ఎవరినైనా కలవగలడు... తిక్కలేస్తే ఎవరినైనా సరే T.V. లోను మరియు Twitter లోను మనస్పూర్తిగా, ధైర్యంగా, ధారాళంగా తిట్టే దమున్నవాడు. ఈ మనిషికి డబ్బు ఆశ లేదు... ఆస్తులు కొనే ఆలోచన అస్సలు లేదు. మన అందరిలాగ వచ్చిన డబ్బు లెక్కపెట్టుకోడు... కరెన్సీ పట్టుకునే చాలా సంవత్సరాలయింది. కాని ఫ్లైట్లు ఎక్కుతుంటాడు, దిగుతుంటాడు, కష్టపడుతూ ఉంటాడు, సుఖపడుతూ ఉంటాడు... మహర్జాతకం... ఎందుకంటే ఆయన జాతకం ఆయనే రాసేసుకున్నాడు కాబట్టి... అతని మాటల్లో ఎంత Postiveness లేకపోతే, ఎంత Energy లేకపోతే, ఎంత Upadated Thinking కాకపోతే ఆయన చుట్టూ, ఆయన మాటలువింటూ తెల్లవార్లు కూర్చుంటా RAMU ఒక THOUGHT, ఓ ENERGY... ఆ ఎనర్జీ ఎంతోమంది జీవితాలుమార్చేసింది. ఆయన Introduce చేసిన Directors, Actors, Technicians, వందల సంఖ్యలో భారత దేశం అంతా వ్యాపించారు... రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి అదో రకమైన వైరస్... ఆయన పోయినా ఆ వైరస్ ఉండిపోతుంది క్కడ ప్రపంచంలో చాలా మంది Philosophers చాలా చెప్పారు... వాళ్లు చెప్పినది మనం విన్నది చాలు... We need a warrior like RAMU..

చివరి కోరిక: వీలైతే రాముని ఉంచుకుని నా పిల్లలతో కలిపి పెంచుకోవాలని ఉంది...