క్విల్లింగ్ పేపర్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్, అలౌట్ లిక్విడ్ బాటిల్.. ఇలా ఒక్కటి అని కాదు, చెత్తబుట్టలో పారివేయకుండా చూసిన ప్రతిదానితోనూ దానికి శాశ్వితంగా గౌరవప్రదమైన స్థాయిలో ఆకారాన్ని సృష్టించగలరు శారద గారు. ప్రకాశం జిల్లా పామురుకు చెందిన శారద గారు బికాం కంప్యూటర్స్ వరకు చదివారు. వివాహం అనంతరం తనకు, అలాగే పదిమందికి ఉపయోగపడేలా ఏదైనా హాబీ మొదలుపెట్టాలని అనుకున్నారు. ఆ ఆలోచనల ద్వారానే రూపుదిద్దుకున్నాయి ఇప్పుడు మీరు చూడబోయే బొమ్మలు. ఇలాంటి తరహా బొమ్మలన్ని ఎక్కువగా నార్త్ ఇండియన్స్ చేస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం ప్రసిద్ధులు శారద గారు. మిగిలినవాటితో బొమ్మలు చెయ్యడం సులభం, కానీ క్విల్లింగ్ పేపర్ తో చేయడం మాత్రం శ్రమతో కూడుకున్నది, అలాంటి బొమ్మలను వందల సంఖ్యలో అతి తక్కువ సమయంలో శారద గారు తయారుచేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించడంతో పాటుగా 'అనాథలకు, పేదవారికి, తన దగ్గరికి వచ్చే వారికి ఉచితంగా నేర్పిస్తూ ఈ అరుదైన కళను పదిమందికి పంచుతున్నారు.'
తెలుగుతనంతో పాటుగా, మన సంప్రదాయాలను అద్భుతంగా ప్రదర్శిస్తున్న శారద గారి బొమ్మలు..
1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.
