Contributed by M V Ramana
అక్షరమా నన్నేలా నమ్మావు , నా అనుకున్నవాళ్ళ నిరాకరణతో కూడా నానాటికీ నన్నో నిరాయుధుణ్ణి చేస్తూ.. నువ్విచ్చిన తెగువతో ఆత్మహత్యా , బలవన్మరణాలు కూడా చేత కాదే నాకు , ఇరుగు పొరుగు సూటు పోటు మాటలు శిశిర ఋతువులా మారి నా శిరస్సు ఖండిస్తున్నా , నువ్వున్న ధైర్యంతో వసంత ఋతువుకై వేచి చూడగలను కానీ ... గెలుపోటములకు అతీతంగా ధన , మధ ప్రాముఖ్యేత ఈ జీవితపు ప్రయాణాలకు తలొగ్గి , భూ అంచులపై నుండి నిలబడి నిన్ను నా చాచిన హస్తాలతో నాతో చావుకై పిలుస్తున్నా ... వచ్చి నిన్ను నమ్ముకున్నానన్న కోరికతో దహింపబడితే మిగిలిన నా అస్థిక ఆనవాలను కౌగలించుకొని కూర్చో .., కర్పూరంలా కరిగిపోతే నా తుది శ్వాసపు చివర సెగతో నువ్వు కూడా నాతో మనుషులు లేని చోటుకి వచ్చేయ్ ..., ఇక్కడ మిగిలిన నా బూడిద కణికలతో కూడా నిన్ను నాతో సావాసం చేయనివ్వరు ఎవ్వరూ ... కానీ ఒక్క విన్నపం నాది , నిన్ను నమ్ముకున్న అర్ధాయుష్షు వాడిగా నన్నే చివరివాడిని చేయు , దయచేసి మరో కుటుంబం జోలికి పోమాకు .. - ఓ రచయత ఆక్రోశ అశ్రు నివాళి ...అక్షరానికి