తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాత్రమే కాదు చాలామంది స్టూడెంట్స్ కూడా తమలో అంతర్గతంగ దాగి ఉన్న ప్రత్యేక ప్రతిభను గుర్తించుకోక గవర్నమెంట్ జాబ్ అంటూ వెంపర్లాడుతున్నారు. నిజానికి సంవత్సరానికి కొన్ని వందల సంఖ్యలో మాత్రమే నోటిఫికేషన్స్ పడుతున్నాయి, అది కూడా ఒక్కోసారి జరుగదు. సంవత్సరానికి ఇంజినీరింగ్, డిగ్రీ, పీ.జి చేసిన విద్యార్ధులు లక్షల సంఖ్యలో వస్తుంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని గవర్నమెంట్ ఐనా ఎంతమందికి అని ఇస్తుంది.? ప్రభుత్వం మీద ఎంతటి ఒత్తిడి పెంచినా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగం అంటే అది దాదాపు అసాధ్యమే.
ప్రభుత్వ ఉద్యోగంలోనే సెక్యూరిటి ఉంటుంది మంచి జీతం ఉంటుంది అని కంఫర్టబుల్ జోన్ కోసం చూస్తే మనలోని అద్భుతమైన ప్రతిభ నిరుపయోగమయ్యే అవకాశం ఉంటుంది. అన్నీటి కన్నా ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తు విలువైన సమయం వృధా అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. రఘనందన్ అనే ఈ యువకుడు ఇదే అంశం మీద ది గ్రేట్ ఇండియన్ ట్రెజర్ అనే బుక్ రాసి అందులోని విషయాన్ని విద్యార్ధులకు మరింత ఉపయోగంగా చెయ్యాలని భావించి విద్యార్ధులను, యువతను మోటివేట్ చేస్తున్నారు. తమలో ఉన్న ఆ ప్రత్యేకమైన టాలెంట్ ను ఎలా గుర్తించగలం.?, దానిని మరింత సానబెట్టి కెరీర్ కు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు.?, అని నేరుగా స్కూల్స్ విద్యార్ధుల దగ్గరికే వెళ్ళి మరింత స్పష్టంగ వివరిస్తున్నారు.
ట్రైనింగ్ ఎలా ఉంటుంది.? చిన్నతనం నుండే భవిషత్తు మీద ఓ నిర్ధిష్టమైన అవగాహన ఉంటే లక్ష్యం త్వరగా చేరుకోవచ్చు. ఇందుకోసం చేస్తున్న ఈ ఉద్యమంలో భాగంగా ముందు 300 బ్లైండ్ చిల్డ్రన్ ఉన్న దేవ్ నార్ స్కూల్ ను ఎంచుకున్నారు(ప్రస్తుతం మరి కొన్ని స్కూల్స్ లో ఈ ట్రైనింగ్ జరుగుతుంది). రఘునందన్ లక్ష్యం మాత్రమే కాదు అతని దారి కూడా ప్రత్యేకంగా, నలుగురికి ఉపయోగపడేలా ఉంటుంది. స్టూడెంట్స్ అందరిని ఓ క్లాస్ రూంలో కూర్చో బెట్టి క్లాస్ చెప్పడం కన్నా స్కూల్ మొత్తంలో 20మంది విద్యార్ధులను ముందుగా ఎంపిక చేస్తారు. వారికి ప్రత్యేకంగా ఏడు వారాలపాటు లీడర్ షిప్ క్వాలిటీస్, ఒక్కో వ్యక్తిలో దాగి ఉన్న ప్రతిభను ఏ విధంగా వెలికితీయాలి అనే దాని మీద ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కూడా మిగిలిన వాటిలా కాకుండా చాలా ఆహ్లాదంగా సాగుంతుంది.
మొదటిరోజే వారితో సరదాగ మాట్లాడడం దగ్గరి నుండి డాన్స్ వేయించడం చేస్తూ వారిలో ఉన్న స్టేజ్ ఫియర్ ను తొలగించి ట్రైనర్స్ తో ఓ ఫ్రెండ్ లాంటి ఆత్మీయ భావనకు తీసుకువస్తారు. ఆ తర్వాత కూడా ఇలాంటి Friendly Atmosphere లోనే ట్రైనింగ్ ఇస్తారు. స్టూడెంట్ బుక్ లో ఉన్నది చదివితే 10% నేర్చుకుంటాడు, రాస్తే 50% నేర్చుకుంటాడు కాని తాను చదివినది మరొకరికి చెబితే మాత్రం 100% నేర్చుకుంటాడు ఇలాగే ఆ 20మంది పరిపూర్ణంగా నేర్చుకోవాలని వారు మిగిలిన తమ తోటి విద్యార్ధలకు తెలియజేసేలా రఘనందన్ ఇంకా అతని టీం పనిచేస్తుంది. ఈ ట్రైనింగ్ లోనే వారితో మాట్లాడి వారి ఇష్టాలు వారిలో వారు అనుకున్నది Passion ఆ లేదంటే Attraction ఆ అని ముందుగానే పరిశీలించి అందుకు తగ్గ ప్రణాళికలు, వారి కెరీర్ ను ఎలా మలుచుకోవాలో అని శిక్షణ ఇస్తారు.
రఘనందన్ ఇంకా అతని టీం ఇదంతా కేవలం రేపటి భావితరం కోసమే చేస్తున్నారు, రఘు నాతో అంటుంటాడు "6 సంవత్సరాల పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిన రాని సంతృప్తి ఒక్క విద్యార్ధిని మార్చినా కలుగుతుంది అని". నిజమే ఇప్పుడు మనం ముందు తెలుసుకోవాల్సింది మనం ఎవరమో కాదు మనలో ఏ ప్రతిభ దాగి ఉందో అని.. ఆ ప్రతిభ తెలుసుకుంటే మనమేవరమో తెలుసుకోవడం అంత పెద్ద కష్టం కాదు..