థియేటర్లలో మాత్రమే కాదు సోషల్ మీడియా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా "అర్జున్ రెడ్డి" సినిమా పేరు మారుమ్రోగిపోతుంది. ఈ సినిమాకు పనిచేసిన డైరెక్టర్, హీరో కు మాత్రమే కాదు ఇందులో హీరో ఫ్రెండ్ రోల్ చేసిన రాహుల్ రామకృష్ణకు కూడా భయంకరమైన పేరు వచ్చేసింది. తన గురించి ఇంకొంచం Detailed తెలుసుకుందాం.
హైదరాబాదీ: రాహుల్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. చిన్నతనం నుండి Drama, Cultural Activities అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ ఇష్టంతోనే లిరిక్స్ రాయడం, పాడడం చేసేవారు. ఎడ్యుకేషన్ మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయినా గాని సమాజం కోసం ఏదైనా చేయాలి అనే దాని మీద ఎంతో తపన ఉండేది. ఆ తర్వాత తాను కోరుకున్నాట్టే సమాజం కోసం ఓ NGO లో జాయిన్ అయ్యి ఎంతో సర్వీస్ చేశారు. NGO లో చేస్తుండగానే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో పరిచయం జరిగింది.
సైన్మా: తరుణ్ భాస్కర్ తో పరిచయంతో పాటు అప్పటికే నటనలో శిక్షణ తీసుకోవడం వల్ల సైన్మాలో లీడ్ రోల్ కోసం రాహుల్ ను తీసుకున్నారు. అంతకు ముందు తన జీవితం నార్మల్ గా సాగిపోతుంటే సైన్మా షార్ట్ ఫిల్మ్ తో ఒక మంచి గుర్తింపు మొదటిసారి ఆయన జీవితంలోకి వచ్చేసింది.
ఛాన్స్ ఎలా వచ్చింది: ఆరోజు సందీప్ రెడ్డి పుట్టినరోజు. సందీప్ రెడ్డి ఆఫీస్ పక్కనే తన ఫ్రెండ్స్ ఉండడంతో అక్కడికి రాహుల్ వచ్చాడు. రాత్రి 12గంటల వరకు అక్కడే ఉండి వెళ్ళిపోతుండగా అనుకోకుండా అక్కడే ఉన్న విజయ్, సందీప్ ను కలిశారట. మనోడి భాష, ప్రవర్తన వారికి నచ్చడంతో ఫ్రెండ్ రోల్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని ఆఫర్ ఇచ్చారట.
Professional Artist: గ్రేట్ యాక్టింగ్ గురు మధుసూదన్ గారి దగ్గర రాహుల్ ట్రైనింగ్ తీసుకున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో కూడా కొన్ని నాటకాలు ప్రదర్శించారు.
జర్నలిస్ట్: NGOలో ఎలా ఐతే సర్వీస్ చేశారో అదే ఉద్దేశంతో సమాజం మీద ప్రేమతో జర్నలిస్ట్ గా రెండు న్యూస్ పేపర్లకు కూడా పనిచేశారు.
రైటర్ గా: సెన్సేషనల్ మూవీ పెళ్ళిచూపులులో మనోడు కొన్ని పాటలు(ఈ బాబు గారికి, మెరిసే) రాశారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారి జయమ్ము నిశ్చయమ్మురా సినిమాకు కూడా కొన్ని సందర్బాలలో మాటలు రాశారు(పూర్తిగా కాదు).
చిన్న చిన్న ఉద్యోగాలు: Salary వస్తుందనంటే ఎంత చిన్న ఉద్యోగం చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు. అలా డేటా ఎంట్రీ, ఫిల్మ్ రివ్యూ లాంటి రకరకాల జాబ్స్ కూడా చేశారు ఇందులో వచ్చిన డబ్బుతో చాలా వరకు పుస్తకాలు కొనడానికే ఖర్చుపెట్టారట.
బాత్రూమ్ రైటర్: బాత్రూమ్ రైటర్ ఆ.. ఇదేంటి కొత్తగా ఉందనిపించిందా.. నేనేమి ప్రాస కోసం రాయలేదండి.. మనోడు నిజంగానే బాత్రూమ్ రైటర్. బాత్రూమ్ లోనే కూర్చుని గంటల తరబడి కథలు, పాటలు రాసుకునేవారు. తాను రాసుకున్న చాలా పుస్తకాలు ఇప్పటికి బాత్రూమ్ లోనే ఉన్నాయట.
అమ్మనే గుర్తుపట్టలేదు: అంతకు ముందు పూర్తిగా గెడ్డంతో ఉండి అర్జున్ రెడ్డి కోసం క్లీన్ గా షేవ్ చేసుకుని వస్తే అమ్మ కూడా గుర్తుపట్టకుండా "ఛీ ఎవడ్రా నువ్వు" అని అనుమానపడ్డారట.
సగం రెమ్యూనరేషన్: రైటర్, జర్నలిస్ట్, నటన ఇవ్వి మాత్రమే కాదు.. ఈటివి అభిరుచి ఛానెల్ లో కుక్ గా ఓ ప్రోగ్రామ్ కుడా చేస్తున్నారు. చూడడానికి చాలా స్లిమ్ గా ఉన్నారు కాని అర్జున్ రెడ్డి సినిమా కోసం వచ్చిన రెమ్యూనరేషన్ లో సగం ఫుడ్ కోసమే ఖర్చుపెట్టేశారట ఆ రేంజ్ భోజన ప్రియుడు అనమాట మనోడు.
ఇంత సక్సెస్: ఒక గంట సేపు సందీప్ కథ చెబుతున్నప్పుడు 'ఒకే.. సినిమా మంచి సక్సెస్ అవుతుంది' అని అనుకున్నాడట కాని ఈ రేంజ్ సక్సెస్ అవుతుంది "నా ఊహకందనంత ఎత్తుకు నేను ఎదుగుతానని అస్సలు ఊహించలేదట".