రాజ రవి వర్మ నిజంగా భారతదేశం గర్వించదగ్గ పేయింటర్స్ లో ఆయన ముందుంటారు. 1848లో కేరళలో జన్మించారు. మనకు ఆర్టిస్ట్ బాపు ఎలానో భారతదేశానికి రవి వర్మ అలాగా.. అతని పేయింటింగ్ లోని అమ్మాయికి ఉన్నంత సొగసు, జీవం ఇంకెవ్వరిలో కనిపించదు.. ఇప్పటికి దేశ విదేశాలలో ఆయన పేయింటింగ్స్ కు మిగితావాటి కన్నా ఆధరణ ఎక్కువే.. ఆయన వాడినంతా అందంగా పరిపూర్ణంగ రంగులను మిగితావారు వాడలేక పోవచ్చు.. ఆయన గీసిన అద్భుత కళాఖండాల ద్వారానే భారతీయ ఆధునిక కళావైభవం ప్రారంభమైంది.. ఆయనను అనుసరించి ఎంతోమంది ఏకలవ్య శిష్యులు ఉదయించినారు.. తన కుంచె నుండి జాలువారిన చిత్రాలలోని మహిళామనులు ఏ ఊహా ప్రపంచంలోనుండి తీసుకోలేదు.. తన చుట్టు ఉన్న ఆడవారే తన భార్య, తన తల్లి, తను గమనించి చూసిన వారే.. వారినే ఎప్పటికి గుర్తుండిపోయేలా హావ భావాలను ఒలికించారు తన చిత్రాలతో..
మనం ఇప్పుడు చూస్తున్న దేవతలకు ఒక రూపం అంటు చూస్తు దేవతలను అలా ఊహించుకుంటున్నా మంటే దానికి కారణం రాజ రవి వర్మ నే.. పుస్తకాలలోని వర్ణన ఆధారంగా శ్రీరాముడు సీత హనుమ శ్రీకృష్ణుడు లాంటి దేవతలందరికి ఒక రూపమిచ్చారు... సృజనాత్మకంగా ఆలోచించే వారు దేనికి భయపడరు అన్నది రవి వర్మ ను గమనిస్తే అర్ధం అవుతుంది.. ఆనాటి కాలంలో ఏ ఒక్కరు సాహసించని నగ్న చిత్రాలను గీయడం ద్వారా కొంతమంది నుండి విమర్శలు ఎదుర్కున్నా అది తన కళలో భాగమని సున్నితంగా వాటిని ఎదుర్కున్నారు.. ఆయన వేసిన ప్రతి ఒక్క పేయింటింగ్ ఒక అద్భుతమైన కళా ఖండం..
అందులో కొన్ని...