పూర్వం మన భారతదేశంలో వైద్యం ఒక Serviceలా జరిగేది. ఒక ప్రాణాన్ని బ్రతికించే గొప్ప అవకాశం లభించిందని Patientsకి వైద్యులు సేవ చేసేవారు, ఆ తర్వాత ఆ సేవ కాస్తా Business ఐపోయింది. Competition పెరిగిపోయినా కూడా Treatment ఖర్చులు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. చిన్న జ్వరానికి కూడా అనవసర Testలని చెప్పి అమాయక ప్రజల నుండి డబ్బులు దోచుకుంటున్నారు కొంతమంది డాక్టర్లు. పోని గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా అక్కడికి వెళ్దామనుకున్న గాని అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వైద్యం ఇంతలా దిగజారిపోయిన ఈ రోజుల్లో రాజమండ్రి జిల్లాకు చెందిన డాక్టర్ హరిప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు మాత్రం వైద్యాన్ని ఒక గొప్ప సేవగా భావించి కార్పోరేట్ హాస్పిటల్స్ లకు ధీటుగా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు.


డా.హరిప్రియ(MS, Ophthalmologist) గారి నాన్న గారు ఏయిమ్స్ లో కంటి వైద్య నిపుణులుగా ఎంతోమందికి చూపును అందించారు. అక్కడ రిటైర్ అయ్యాక ఖరీదైన కంటి వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలనే బలమైన సంకల్పంతో ఎన్నో ఆర్ధిక మరియు ఇతర సమస్యలను ఎదుర్కుని "పరమ హంస యోగానంద నేత్రాలయాను స్థాపించారు". ఇక్కడ కంటికి సంబంధించిన అన్నిరకాల వైద్యం, ఆపరేషన్లు పూర్తిగా ఉచితం. స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు దాదాపు 40,000 మందికి పైగా చూపును అందించారు. హైదరాబాద్ ఎల్.వి. ప్రసాద్ హాస్పిటల్ వారి నుండి సాంకేతిక సహాయం తీసుకుంటున్న ఈ హాస్పిటల్ లో ప్రతిరోజు 40కి పైగా ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి సుమారు 10కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరిలో పవిత్రమైన దేవాలయం లాంటి ఈ హాస్పిటల్ (Ph:0883 3203000) ఉన్నది.

"డబ్బు తీసుకునే ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదని మంచి హాస్పిటల్స్ ఏమున్నాయని కనుక్కొని మరి వెళ్తుంటాం మరి ఇక్కడ ఉచితంగా వైద్యం అంటున్నారు వైద్యం సరిగ్గా జరుగుతుందా..?" అని మొదట ఇక్కడికి వచ్చే Patients అపోహ పడ్డారు.. కాని డా. హరిప్రియ, డా.ప్రభాకర్ (నాన్న), ఇంద్రజిత్ (భర్త) ఈ ముగ్గురి నిస్వర్ధ సేవా, కృషి ద్వారా ఆ అపోహను చెరిపేశారు. ఇక్కడికి వచ్చిన వారందరికి సరైన ఫలితాలు లభించడంతో పేదలే కాకుండా ఎగువ మధ్య తరగతి వారు, సంపన్నులు కూడా ఇక్కడికి వస్తున్నారు.. వారు కూడా ఈ సేవకు కొంత ఆర్ధిక సహయాన్ని కూడా అందిస్తున్నారు. వీరికున్న ఆశయం ఒక్కటేనండి వీరు తపస్సులా నేర్చుకున్న వైద్యంతో సాధ్యమైనంత వరకు పేదలకు సేవచేసి వారి జీవితాలలో వెలుగులను, రంగులను అందించడమే.. ఈ సేవా ప్రయాణం నిత్యం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుందాం..


Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.