అప్పుడే కష్టపడి 2 సంవత్సరాల యాక్టింగ్ కోర్సులో గోల్డ్ మెడల్ తీసుకున్నాడు... ఇంకేటి ఇక అవకాశాలు నన్ను వెతుక్కుంటు వస్తాయి అనుకున్నాడు కాని పరిస్థితి చూస్తే భిన్నంగ ఉంది. ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా నువ్వు అటు అందంగా లేవు ఇటు మాస్ హీరోలా Strong Mass look లేవు అంటు అందరు వెనకడుగు వేశారు.. అప్పటికి 30 రోజుల నుండి సరిగ్గా భోజనం లేదు.. ప్రతిరోజు ఒక అరటిపండు, గ్లాసు మజ్జిగే భోజనం.. ఇక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. తనకు తెలిసిన అందరిని చివరిసారిగా పలుకరించడానికి వెళ్ళాడు కాని ఆ పలుకరించడానికి వెళ్ళిన దగ్గరే అనుకోకుండా మేలుకొలుపు సినిమా ద్వారా డబ్బింగ్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది. ఇక అప్పటి నుండి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెర వెనుక మాత్రమే తన భావాలను పలికించారు.. అలా చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.. ఇందుకేనా యాక్టింగ్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకునేంత కష్టపడింది అనుకున్నారు కాని దేవుడు మన కథను అందుకు తగ్గ స్క్రీన్ ప్లే ముందే రాస్తాడు. నటుడిగా చిన్న చిన్న పాత్రలు చేస్తు హీరో గా వంశి దర్శకత్వం వహించిన "లేడిస్ టైలర్" సినిమాతో హీరోగా మొదటి విజయాన్ని అందుకున్నాడు.. ఆ సూపర్ హిట్ తో ఇప్పటికి 40 సంవత్సరాల సినిమా కెరీర్ కి ఆ సినిమా పునాదిగా మారింది. అప్పటి వరకు హీరో అంటే మాస్ లుక్, భారీ డైలాగులు, విలన్ లతో ఫైటింగులు ఉండేవి కాని రాజేంద్ర ప్రసాద్ రాకతో తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక హీరో సినిమా అంతా కామెడి చేయడం రాజేంద్ర ప్రసాద్ ద్వారానే మొదలైంది.. ఆ నటనే రాజేంద్రుడుని కామెడి సినిమాలకు మెగాస్టార్ ని చేసింది. మిగిలిన సినిమాలకు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగర్జున అని ర్యాంకులుగా విభజించేవారు కాని కామెడి సినిమాలకు రాజేంద్ర ప్రసాద్ యే నెంబర్ వన్.. 1 నుండి 10 వరకు స్థానాలు ఆయనవే..
రాజేంద్రప్రసాద్ N.T. రామారావు సొంతఊరు నిమ్మకూరులో జులై 19 1956 లో జన్మించారు. తండ్రి గద్దె వెంకటనారాయణ ఒక టీచర్, సినీ పరిశ్రమలో ప్రవేశించక మునుపు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాడు. నటనలో చిరంజీవి కన్నా 3 సంవత్సరాలు సీనియర్.. ఇప్పుడు మనం మెగాస్టార్ అని కీర్తిస్తున్న చిరంజీవికి Actingలో Crucial అయిన Movement & Mime లొ రాజేంద్ర ప్రసాద్ శిక్షణ ఇచ్చారు. జంధ్యాల, బాపు, ఇ.వి.వి సత్యనారాయణ, రేలంగి నరసింహారావు లాంటి దర్శకుల మేటి హాస్య చిత్రాలన్నీటిలోను ఆయనే హీరో.. ఎర్రమందారం, మేడమ్, ఆ నలుగురు సినిమాలలోని ఉత్తమ నటనకు నంది అవార్డులను అందుకున్నారు.. అంతే కాదండి పెళ్లాం పిచ్చోడు అనే సినిమాకు సంగీతం అందించి తనకున్న మరో టాలెంట్ ను చూపించారు, సంగీతం అంటే మాములుగ కాదు ఆ సినిమాలోని ఒక పాటకు బాల సుబ్రమణ్యంకు నంది ఆవార్డు తెచ్చిపెట్టేంత.. ఎప్పుడు నవ్వించే ఒక హాస్య నటుడు ఏడిపించడం అనేది చాల కష్టతరం, అప్పటి వరకు ముఖం చూడగానే నవ్వే ప్రేక్షకుల కళ్ళనుండి నీళ్ళు రప్పించడం అన్నది ఒక రకంగా కత్తి మీదసాము లాంటిది కాని మన రాజేంద్రుడు మాత్రం హాస్య చిత్రాలకు మించిన నటనను ప్రదర్శించి ఎప్పటికి నిలిచిపొయే Inspirational సినిమలను అందించారు.. రాజేంద్రప్రసాద్ ఎక్కడ ఏ పని చేసిన ది బెస్ట్ గా చేస్తారు, ఇప్పుడు Movie Artist Association(MAA) అద్యక్షుడిగా ఎంతో మంది ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న నటులకు సహయం చేస్తున్నారు.. నేటి యువ నటులకు నటనలో డిక్షనరిగా ఉంటు, మంచి నటుడిగా మాత్రమె కాదు మంచి మనిషిగా తన భాద్యతను నిర్వర్తిస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
నటకిరీటంలో కొన్ని మరుపురాని సినిమాలు
1) అప్పుల అప్పారావు

2) పెళ్లిపుస్తకం

3) మిస్టర్ పెళ్లాం

4) Ladies Tailor

5) అహనా పెళ్లంట

6) ఆ ఒక్కటి అడక్కు

7) ఏప్రిల్ 1 విడుదల

8) రాంబంటు

9) మేడమ్

10) ఎర్ర మందారం

11) ఓనమాలు

12) మీ శ్రేయోభిలాషి

13) ఆ నలుగురు
