Here Is The Inspiring Story Of Rajinikanth That He Said At Darbar Audio Launch: In Telugu

Updated on
Here Is The Inspiring Story Of Rajinikanth That He Said At Darbar Audio Launch: In Telugu

చేసే పని మీద ఇష్టం, అనుకునే లక్ష్యాన్ని సాధించాలనే కసి పట్టుదల, ఈ రెండు ప్రతి మనిషి గెలుపు కి ఇంధనాలు. ఈ రోజు నువ్వు కష్టపడుతూ ఉండచ్చు, నువ్వు చేసే పని మీద రాజి పడనీ భావం నీకుంటే, ఒక రోజు వస్తుంది. ఆ రోజు అందరు కీర్తించే స్థాయి కి నువ్వు ఎదుగుతావ్. అలాంటి రాజిపడనీ తత్వమే, శివాజీ గైక్వాడ్ ని రజినీకాంత్ ని చేసింది. తన కెరీర్ స్టార్టింగ్ లో తాను ఎదుర్కున్న ఒక అవమానం, ఆ అవమానానికి తను ఇచ్చిన సమాధానాన్ని దర్బార్ ఆడియో లాంచ్ లో తను ఇచ్చిన స్పీచ్ లో చెప్పారు. అది ఇంటర్నెట్ మొత్తానికి ప్రేరణ ఇస్తోంది. ఆ స్పీచ్ తెలుగు అనువాదం ఇది.

" ఒకనాడు, నేను ఇంట్లో ఉంటే, ఒక నిర్మాత వచ్చి తన సినిమా లో ఒక పాత్ర ఉంది చేయమని అడిగారు. బేరసారాల తరువాత ఆ పాత్ర చేయడానికి పారితోషికంగా ఆరువేల రూపాయిలు అడిగాను. ఆ నిర్మాత అందుకు అంగీకరించి, రేపు తన మనుషులు వచ్చి advance గా వెయ్యి రూపాయిలు ఇస్తారని చెప్పారు. ఆ మరుసటి నా కొలతలు తీసుకోవడానికి ఆ నిర్మాత manager వచ్చారు. అతనిని advance gurinchi అడిగితే తనకేం తెలీదు అన్నారు. ఆ నిర్మాత కి ఫోన్ చేసి ఈ విషయం చెపితే, makeup వేసుకునే లోపు అడ్వాన్స్ ఇస్తానని చెప్పారు. ఆ మరుసటి కార్ కూడా ఆలస్యంగా వచ్చింది, మేకప్ వెయ్యబోతే అడ్వాన్స్ ఇవ్వకుండా మేకప్ వేసుకోను అని చెప్పను. కాసేపాగాక ప్రొడ్యూసర్ వచ్చి, "అక్కడ హీరో హీరోయిన్స్ నీ వాళ్ళ wait చేస్తున్నారు. అడ్వాన్స్ లేకుండా పాత్ర వేయలేవా ఈ పాత్ర నువ్వు చెయ్యట్లేదు వెళ్ళిపో" అన్నారు. ఇంటి వరకు కారు లో అన్న దింపండి అని చెప్పాను. "నీకు కార్ కావాలా? నడువు పో" అని పంపించారు. నడుచుకుంటున్న వెళ్తున్న నన్ను చూసి గుర్తుపట్టి, ఎంతో మంది నా డైలాగ్ చెప్తున్నారు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను. 2 ఏళ్ల తరువాత, foreign fiat car కొని, Robinson అనే ఒక foreigner ని driver గా పెట్టుకుని ఎక్కడైతే ఆ నిర్మాత నన్ను నడిపించాడో, అక్కడే కార్ లో దిగి సిగరెట్ వెలిగించాను... "

Ee story ni Fully filmy vaallu Comic ga design chesaaru. Those illustrations are really mindblowing. Here is that

మాట అంటే మాటే అనే తత్త్వం రజిని ని అడ్వాన్స్ తీసుకోకుండా నటించనివ్వలేదు. అవమానపడ్డ చోట గెలిచి నిల్చోవాలన్న కసి పట్టదల, ఆ రోజు రజినీకాంత్ ని సూపర్ స్టార్ ని చేసింది. రజిని ఒక హీరో నే కాదు, ప్రేరణ పొంది ఆచరించాల్సిన వ్యక్తిత్వం.

You can watch that speech in Sun Nxt App.