నచ్చని పనిని కనీసం నిర్ణీత గడువు వ్యవధిలోనూ చేయలేము కాని మనసుకు చాలా నచ్చిని పనిని మాత్రం వెంటనే పూర్తిచేస్తాము. ఎందుకంటే ఆ పనిచేస్తున్న సమయమంతా ఎంజాయ్ చేస్తున్నాము కాబట్టి అలసట, విసుగు ఉండదు. రజిత కూడా తనకెంతో ఇష్టమైన పనినే చేసింది, చేయడం వరకు మాత్రమే కాదు ఎవ్వరూ ఊహించలేని రికార్డు సైతం నెలకొల్పింది.
గుంటూరు జిల్లా పెంట్లూరివారిపాలెం అనే మారుమూల చెందిన రజితది అతి సాధారణమైన మధ్యతరగతి కుటుంబం. చదువు మాత్రమే కాదు ఇంటర్నెట్ కూడా పేదరికాన్ని నిర్మూలిస్తుంది, ప్రతి గ్రామంలో నేడు ఇంటర్నెట్ విస్తరించింది.. దీని ద్వారానే సమాజానికి ఉపయోగపడే విధంగా ఏదైనా చేయాలన్న లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నారు. ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో ఉన్న రజిత తన కాలేజ్ లో ఒక స్టార్టప్ విభాగం ఏర్పడడంతో మంచి అవకాశం లభించింది. ఆ స్టార్టప్ ద్వారా ఉద్యోగులను నియమించుకున్నారు. వెబ్ సైట్ రూపొందించడంలో బెస్ట్ రిజల్ట్స్ రావడంతో ఆఫర్లు వేగంగా వచ్చేశాయి.
సాధారణంగా ఒక్క వెబ్ సైట్ ను రూపొందించాలంటే 5,000 వరకు ఖర్చవుతుంది(డొమైన్, వెబ్ హోస్టింగ్ తో కలిపి) ఈ ప్రయాణంలోనే సుహాసిని గారు, వెబ్ 2.0 అండగా నిలబడడంతో తక్కువ ఖర్చుతోనే 101 వెబ్ సైట్లను రూపొందించగలిగారు. ఇలా ఇప్పటివరకూ రజిత వెబ్‌సైట్లన్నీటి తయారీకి ఖర్చు పెట్టింది కేవలం 50 వేల రూపాయలే. ఈ 101 వెబ్ సైట్లలో ఎక్కువ శాతం సేవా రంగానికి సంబంధించినవే కావడం ఇక్కడ విశేషం. ఇంజినీరింగ్ పూర్తికాకుండానే "ఆల్ టెక్ ట్రెండ్" సంస్థను ప్రారంభించిన రజితను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఘనంగా సత్కరించింది కూడా.