Meet Ramaraju, The Man Who Started Terrace Farming Way Before Everyone Else!

Updated on
Meet Ramaraju, The Man Who Started Terrace Farming Way Before Everyone Else!

ఇంటికి చుట్టాలొచ్చారు.. వారికి కమ్మని భోజనం వండిపెడదామని రామరాజు గారి అర్ధాంగి ఆరాటపడ్డారు. కందిపప్పు సరిగ్గా ఉడికింది, తలింపు పెట్టడమే తరువాయి.. వంటశాలలో కరివేపాకు కనిపించడం లేదు. కరివేపాకు తీసుకురండని భర్త రామరాజుకు కేకేశారు. అప్పుడే ఇంటికి కొత్తగా వచ్చిన ప్రకాశం ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఏముంది మార్కెట్ కు వెళ్ళి తీసుకువస్తాడేమో అని అనుకున్నాడు. ఇంటి డాబా మీదకు వెళ్ళి ఇది కరివేపాకు అని కళ్ళుమూసుకునైనా చెప్పగలిగేంతటి సువాసనతో వంటశాలలోకి ప్రవేశించాడు రామరాజు.. కాసేపటి "కొత్తమీర కూడా లేదండి" అని భార్య చెప్పడంతో "అబ్బా.. ఇందాకనే చెప్పొచ్చుగా అని విసుక్కుంటూ మళ్ళి మెట్లు ఎక్కి తాజా కోత్తిమీరను తీసుకువచ్చారు. ఇదంతా గమనిస్తున్న ప్రకాశంకు పైన ఏదైనా కూరగాయల మార్కెట్ ఉందేమోనని చాలా తాజాగా దొరుకుతాయి కాబోలు మనము ఇంటికి పట్టుకెళదాం అని పైకి వెళ్ళి చూశాడు.. ఆశ్చర్యం టెర్రస్ అంతా వందల రకాల మొక్కలతో నిండిపోయి ఉంది.

రామరాజు గారు హైదరాబాద్ కళ్యాణ్ నగర్ లో 20 సంవత్సరాల క్రితం ఓ ఇంటిని నిర్మించుకున్నారు. స్వతహాగ పల్లెటూరు జీవనానికి, వ్యవసాయానికి అలవాటు పడిన ప్రాణం ఆయనిది. హైదరాబాద్ లో వ్యవసాయానికి తగినంత స్థలం లేకపోతే ఏంటి టెర్రస్ మీద ఉన్న 1200 చదరపు అడుగుల్లో వ్యవసాయాన్ని మొదలుపెట్టారు ఈ అప్ డేట్ ఐన మోడ్రన్ రైతు. 180 రకాల మొక్కలు దాదాపు 350 మొక్కలతో రామరాజు గారి కుటుంబం సహజీవనం సాగిస్తుస్తున్నది. ఇవన్నీ కూడా ఒక్కరోజులో నాటినవి కాదు మొదట కొన్ని మొక్కలతో ప్రారంభమయ్యి కాలానుగూనంగా వాటి సంఖ్యను పెంచుకుంటు వస్తున్నారు. చెట్ల కోసం మట్టి అవసరం ఉంటుంది, నీటి అవసరం ఉంటుంది, కుండీలను ఏర్పాటుచేయవలసి ఉంటుంది. ఈ బరువంతా కూడా బిల్డింగ్ మోయాలి. అందుకోసం ఒకే చోట అని కాకుండా టెర్రస్ చుట్టూతా బరువును సమానంగా విభజించడంతో ఎటువంటి ఇబ్బందులు లేవని ఇంజినీర్లు కూడా అభినందించారు.

మొక్కలలో రకాలు:

కాస్త స్థలమే ఉంది కదా అని రామరాజు గారు ఎక్కడా రాజీపడలేదు. కాకరకాయ, ఆనబ, బీర, గుమ్మడి, పొట్లకాయ, సోరకాయ, దొండతో ఏడురకాల పాదులున్నాయి.. దాదాపు 20 రకాల పండ్ల మొక్కలు, వివిధ రకాల పూలు, 8 రకాల ఆకుకూరలు, కూరగాయల మొక్కలతో పాటుగా చెరుకు, సీమచింత, బోన్సాయ్ మొక్కలు, ఎర్రచందనం, నిమ్మపండు ఇలా 350 మొక్కలతో ఈ టెర్రస్ చిన్నపాటి ప్రపంచాన్ని తలపిస్తుంది.

ఆర్గానిక్ ఫార్మింగ్:

ఇక్కడున్న ప్రతి మొక్క కూడా పెస్టిసైడ్ భారినపడలేదు.. సహజంగా తయారుచేసిన వేపనూనే, వేపపిండి, జీవామృతం మొదలైనవి ఉపయోగిస్తున్నారు. పూర్తిగా మట్టితో కుండీలను ఏర్పాటుచేస్తే కొన్నాళ్లకు మొక్క క్షీణించిపోయే అవకాశం ఉంది అందువల్ల 30% కొబ్బరిపొట్టు, 30% మట్టి, 30% వర్మీ కంపోస్ట్, 10% ఇసుకతో ఏర్పాటుచేసిన కుండీలలో మొక్కను నాటుతారు. నేల మీద పెరిగే చెట్లకు వీటికి చాలా తేడా ఉంటుంది. వాటికి ప్రతిరోజు నీరు పోయాల్సిన అవసరం లేదు కాని, వీటికి మాత్రం నీటితో తడపాల్సి ఉంటుంది. చెట్టు ఎదుగదల బట్టి కుండీ సైజును ఏర్పాటుచేయడం, సరైన నీటిని ఇవ్వడం రామరాజు గారి దినచర్యలో ఓ భాగం. ఏవైనా తెగుళ్ళు వస్తే వెల్లుల్లి రసం, వేపనూనేతో స్ప్రే చేస్తుంటారు. మరేఇతర పురుగులు ఆశించినా గాని ఇక్కడికి వచ్చే పక్షులు వాటిని శుభ్రంగా తినేస్తుంటాయి.

If you are interested to grow one similar farm on your own terrace and are looking for some kind of video guide, here it is.