రంగస్థలం - ఎందరో నటులకు, నాటకాభిమానులకు పుణ్య స్థలం. పాత్ర ఏదైనా అందులో ప్రతి ఒక్కరు లీనమైపోతారు. సినిమా ఎప్పుడైతే వచ్చిందో మెల్లగా దాని కళ తగ్గింది. ఆ కాలం నటులు స్టేజిల మీద ఉండేవారు. ఈ కాలంలో ప్రతిఒక్కరు నటులైపోయారు. ప్రతి ఒక్కరి జీవితం ఒక "రంగస్థలం". పూట గడవాలంటే గొడ్డు చాకిరి చెయ్యాలి, అణాపైసా జీతం కోసం ఇంత పని చేయించుకుంటున్నారు అని కోపం. కానీ అదే పైసా కోసం వాడి మీద ఎక్కడ లేని గౌరవం నటిస్తాం.
అమ్మకి డాక్టర్ అంటే ఇష్టం, నాన్నకి ఇంజనీర్ అంటే ఇష్టం.. వెండి తెర మీద నటించాలన్న కోరిక చంపుకుని, అమ్మ నాన్నలకు ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం అని నటిస్తాం. నాకు బాధ చెప్పుకోటానికి నలుగురు ఉన్నారు అని సోషల్ మీడియా లో స్టేటస్ లు పెడతాం, ఎప్పటికి నాతోనే ఉంటారు అని సెల్ఫీ లు పెడతాం, ప్రపంచం ముందు నాలుగు నాతో ఉన్నారు అని నటిస్తాం, అదే స్టేటస్ కి రిప్లై కూడా చెయ్యని ఆ స్నేహితులు గురించి ఆలోచిస్తూ ఒంటరిగా బాధపడతాం.
ప్రేమ అనే బంధం ఎంతో గొప్పది. అలాంటి ప్రేమ మనకి దొరుకుతే బాగుంటుంది అని ఆశిస్తాం. అదే ప్రేమ దొరికినప్పుడు ప్రేమ ను నటిస్తాం. బంధాన్ని భారంగా ఫీల్ అవుతాం. ఎందరో గొప్పవాళ్ళు చెప్పారు, ఇద్దరు స్నేహితులు మంచి ప్రేమికులు కూడా కాగలరు అని, నలుగురు స్నేహితుల మధ్యలో ఇద్దరు ప్రేమికులు వస్తే కలిసినా ఆ రెండు మనసుల గురించి చెప్పిన వారు విడిపోతున్న నలుగురు స్నేహితుల గురించి చెప్పలేదు. ప్రేమే గొప్పది అని మనల్ని నమ్మించి మోసం చేసారు.
ఎదుటువాడు నచ్చకపోయినా వాడితో మనకి ఉపయోగం ఉంది అని వాడితో స్నేహం నటిస్తాం, నచ్చిన అమ్మాయి మనతో ఎక్కువ ఉండాలి అని ప్రేమ నటిస్తాం, లెక్చరర్ క్లాస్ చెప్తుంటే నిద్రొస్తున్న వింటున్నట్టు నటిస్తాం, కంప్యూటర్ గురించి బేసిక్స్ కూడా తెలియక పోయిన ఒక జాబ్ కోసం మీరు ఏం చెప్పిన చేస్తాం సాఫ్ట్ వేర్ నా ప్రాణం అంటూ ఇంటర్వ్యూ లో నటిస్తాం. వోట్ వేస్తే మీ కు సేవ చేస్తాం అంటూ, గెలిచాక వారి దిక్కు కూడా చూడకుండా ప్రజల దగ్గర నటిస్తాం.
మనకి తెలియకుండా మనలోని నటనావిశ్వరూపాన్ని నిజం అని నమ్మే ఎందరో మహానుభావులకు ఇదే నా వందనాలు. మనసులో ఏం ఉన్న పైకి మాత్రం కపట నాటకాలు చేసే మనందరికీ మరోసారి వందనాలు
జీవితం ఒక రంగస్థలం అందులో మనమంతా నటీనటులం నీకు నచ్చినట్టు నేను నాకు నచ్చినట్టు నువ్వు ప్రేమంటూ నటిస్తాం స్నేహమంటూ నమ్మిస్తాము చూస్తున్నావ్ చూస్తున్నావ్ ఇంత ఓర్పుగా చూస్తున్నావ్
ఓ అక్షరమా నీకు నమస్కారం నటన లేని ప్రేమకి, నిజమైన స్నేహానికి మన కలయిక ఆదర్శం
ఒంటరిగా పుట్టాం ఒంటరిగా పోతాం కలలు కలయికలు బాధలు బంధాలు చుట్టూరా ఎందరున్నా కష్టాల్లో కలిసుండేది నలుగురే సుమ