Contributed By Raviteja Ayyagari
హైదరాబాద్...Barbeque Nation... సమయం...బఫెట్ మొదలయిన 3 గంటలు తర్వాత...
రమేష్: Guys! Let us play a game. అందరు ఎవరి love గురించి వాళ్ళు చెప్పాలి. ఒక వేళా ప్రేమలో లేకపోతే, at least crush గురించైనా మాట్లాడాలి. ఖచ్చితంగా నిజమే మాట్లాడాలి.
ఒక్కొక్కరుగా తమ ప్రేమ/ఆకర్షణ గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఈ సారి నిశ్చయ్ టర్న్ వచ్చింది. నిశ్చయ్ మాట్లాడడానికి గొంతు తెరిచే లోపే రమేష్...
రమేష్: నిశ్చయికి ఈ మధ్యనే బ్రేకప్ అయ్యింది. ఆ అమ్మాయి తనని మోసం చేసి వెళ్ళిపోయింది. తనని గాలికి వదిలేసి వెళ్ళిపోయింది. She ditched him. She … నిశ్చయ్: She is best thing that has ever happened to me after my family. మేము విడిపోయిన మాట నిజమే. కానీ తను నన్ను మోసం చెయ్యలేదు.
శిరీష్: Can you share your story with us?
కొన్ని సంవత్సరాల క్రితం... హైదరాబాద్... నిశ్చయ్ ఇంజనీరింగ్ చేస్తున్న రోజులు... నిశ్చయ్: కొన్ని సంవత్సరాల క్రితం, అప్పుడే ఇంజనీరింగ్ లో చేరిన రోజులు. జీవితం మీద ఒక రకమైన క్లారిటీ లేని రోజులు. అమ్మ నాన్నలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రము లెక్క చెయ్యని రోజులు. యూత్ అంటే చేతకానితనం అని సమాజం మమ్మల్ని చిన్న చూపు చూస్తున్న రోజులు. అలాంటి ఒక రోజు మొట్ట మొదటి సారి ఎదురయ్యింది, సంహిత. తను ఎలా ఉంటుంది అనేది వర్ణించడం కష్టం. చూడడానికి సినిమా హీరోయిన్ లాగా లేకపోయినా, తన మోహంలో ఎదో కళ. ఆలా అని, ఆ రోజు తన మీద ఎటువంటి భావన కలగలేదు.
ఒకటే క్లాస్ కావడం వల్ల రోజు ఎదో ఒకసారి పలకరించుకునే వాళ్ళం. నెమ్మదిగా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలయింది. ఆలా తాపీగా జీవితం సాగిపోతున్న ఒక రోజు,
నా ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది. అర్జెంటు గా O-ve బ్లడ్ కావాలి అని మెసేజ్ వస్తే, నేను Whatsapp గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేశాను. వెంటనే సంహిత నా దగ్గరకి వచ్చి,
సంహిత: నిషూ, KIMS కి వెళ్దాం పద. అర్జెంటు. నిశ్చయ్: దేనికి?
సంహిత: O-ve బ్లడ్ కావాలి అని మెసేజ్ పంపావుగా, నాది అదే గ్రూప్, పద వెళ్దాం
నిశ్చయ్: okay పద.
మేమిద్దరం కిమ్స్ కి వెళ్ళాం. తను 350 ml బ్లడ్ ఇచ్చింది. కానీ ఆ రోజు తను fasting. fasting చేస్తున్నప్పుడు బ్లడ్ ఇవ్వకూడదు. కానీ తను అది పట్టించుకోలేదు. కాలేజీ కి వచ్చాక...
నిశ్చయ్: నీకేమైనా పిచ్చ? ఉపవాసం చేస్తూ blood donation ఏంటి? సంహిత: చూడు నిషూ, ఇదంతా దేవుడు మనకి ఇచ్చిందే. మనల్ని తిరిగి ఋణం తీర్చుకోమని ఈ మనిషి రూపంలో అడుగుతున్నాడు. తప్పేముంది?
ఆ మాటకి పడిపోయాను. ఒక మంచి రోజు చూసుకుని నా మనసులోని మాట తనకి చెప్పాను.
నిశ్చయ్: సంహిత, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సంహిత ఒక్క క్షణం అలోచించి...
సంహిత: ఎం నచ్చింది నాలో? నేను అంత అందంగా కూడా ఉండనే? నిశ్చయ్: నా కళ్ళతోటి చూడు, నీ అంత అందమైన అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఉండదు. Miss India, Miss World contests ఎలా conduct చేస్తారో నాకు తెలియదు. కానీ నా దృష్టిలో నీకు ఆ రెండు సరిపోవు, ఇంకా కొత్త contests సృష్టించాలి.
సంహిత: మరి ఎక్కువ పొగిడేస్తున్నావ్, కానీ నువ్వంటే నాకు కూడా ఇష్టమే. I Love You. అ మాట ఒక అమ్మాయి గొంతులో నుంచి విన్న ప్రతి అబ్బాయికి జీవితం గెలిచేసాం అని ఒక ఉత్సాహం వస్తుంది. నాకు అలాగే అనిపించింది.
ప్రేమలో పడ్డాకా జీవితం సడన్ గా రంగు రంగులుగా మారుతుంది అంటే ఏంటో అనుకున్నాను. నిజమే కొత్త కొత్తగా అనిపించేది. ఆ కొత్తదనం కొంతకాలమే ఉంది. ఒక రోజు ఒక దుర్ఘటన జరిగింది. తనని ఒక రాత్రి బస్సు లో వెళ్తుండగా కొంతమంది రేప్ చేసారు. ఆ విషయం నాకు తెలిసి తన ఇంటికి వెళ్ళాను. అప్పటికే ఇంటికి తాళం పెట్టేసి ఉంది. ఇంటి postbox లో ఒక లెటర్ ఉంది.
సంహిత: నిషు, ఇప్పటికే నీకు నిజం తెలిసి ఉంటుంది. నీతో చాల మంచి భవిష్యత్తు ఊహించుకున్నాను. కానీ దేవుడు నాకు ఆ అదృష్టం ఇవ్వలేదు. నాకు జరిగింది చిన్న విషయం కాదు. అలా అని suicide చేసుకునేంత సాహసం చెయ్యలేను. నీకు నా మొహం చూపించే ధైర్యం చెయ్యలేను. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నా కోసం వెతకద్దు. నన్ను మర్చిపో. You are the best thing that has ever happened to me Nishu. I love you.
నిశ్చయ్: ఎవరో చేసిన తప్పుకి దేవుడి తనకి శిక్ష విధించాడు. తాను నాకు శిక్ష విధించి వెళ్ళిపోయింది. She didn’t ditch me. She hitched all the missing links of my life together even though she was not me physically. She is the best thing that has happened to me after my family. అమ్మాయి వదిలేసినా తనని వెనకేసుకొస్తున్నాడు అని నా మీద ఒక impression కి వచ్చేయకండి. నిజానికి మనం చాల ఈజీ గా conclusion వచ్చేసే ఒకే ఒక విషయం మనల్ని వదిలేసిన అబ్బాయి, అమ్మాయి గురించి చెడు చెప్పడం. దాన్ని base చేస్కుని అబ్బాయిలు అమ్మాయిలు అందరు ఒకటే అని, అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఒకటే అని ఒక general conclusion కి వచ్చేయడం. అందరు అబ్బాయిలు ఆలా ఉండరు, అందరు అమ్మాయిలు ఆలా ఉండరు. నేను మీకేమి class పీకడం లేదు. Do not come to a general conclusion based on just one incident. And if someone abandons you all of a sudden, you don’t have to stop everything.
ఆ కథ విని ఒక్కసారిగా అందరు డల్ అయిపోయారు.
రమేష్: ఎదో సరదాగా కలుద్దాం అని కూర్చుంటే ఇంత dullness ఆ? come on cheer up. అన్నట్టు నిశ్చయ్ నీకు ఒక surprise. It took us around 3 months to find this surprise. నిశ్చయ్ వెనక్కి తిరిగి చూసాడు. అతని కథ విని, నిశ్చయ్ తన మీద చూపించే ప్రేమకి, కన్నీటి రూపంలో స్పందిస్తూ నిలుచుంది సంహిత. నిశ్చయ్ తనని చూసి లేచి తన వైపు ఒకొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాడు.
నిశ్చయ్: ఇంత కాలం పట్టిందా తిరిగి రావడానికి. సంహిత: నా మీద నీకు ఇంత ప్రేమ ఉంది అని తెలియక, నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాను. నన్ను మళ్ళీ ప్రేమిస్తావా?
నిశ్చయ్ ఏమి మాట్లాడకుండా తనని కౌగిలించుకున్నాడు. చుట్టూ పక్కల అందరు చప్పట్లు కొట్టి ఆనందపడ్డారు. ప్రేమలో ఓడిన ప్రతి మనిషి అవతల వాళ్ళని కారణంగా చూపిస్తూ, అర్థం పర్థం లేని అబాండాలు వెకుంటూ, ఒక generic impression create చేసుకుంటారు. Let us change our insights.