కంచర్లపల్లి రవి తేజ, ఇతను చిన్న వయసులోనే తన చూపు కోల్పోయడు. కాని అతని చూపులేని లోపం అతని లక్ష్యనికి అడ్డు కాలేదు . మనకు సాధించాలన్న సంకల్పం ఉంటే ఏదైన సాధించొచ్చు అని నేర్పించాడు విజయవాడకి చెందిన ఈ విధ్యార్ధి. సామాన్య విద్యార్థుల కే కష్టమైన ICWA పరీక్ష ని చూపులేని రవితేజ కష్టపడి జాతియ స్థాయిలో ర్యాంకు సంపాదించాడు.
ఇంటర్ లో స్టేట్ ర్యంక్లు సాధించిన విధ్యర్దులకే ICWA లో ర్యాంక్ సాధించడం కష్టం, అలాంటిది తనకి చూపు లేదన్న విషయాన్ని చిన్నది గా చేసి పట్టుదలతో తాను ఎంచుకున్న ICWA లో జాతియ స్థాయిలో 47 వ ర్యాంకును సాధించి ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నాడు .
రవి తేజ జీవితం లోత్తుల్లొకి వెళితే వాళ్ళ సొంత ఊరు కృష్ణా జిల్లా లోని అవనిగడ్డ. 8 వ తరగతి వరకు వాళ్ళ ఊర్లోనే చదివిన రవి తేజ పదవ తరగతి హైదరాబాద్ లో, ఇంటర్ విజయవడ లో 86 percent తో పాస్ అయ్యడు. ఎంసెట్ రాద్దామా లేక ICWA కి ప్రిపేర్ అవుదామా అని ఆలోచిస్తున్న మన రవి తేజ కి ఉచిత సలహాలు ఇచ్చే వారు కొందరు ICWA చాలా కష్టం అనీ, చూపు ఉన్న వాళ్ళకే చాలా కష్టం...నీకు అసాధ్యం అని సెలవిచ్చారు. అవన్ని విన్న మన రవి తేజ లో కసి ఇంక పెరిగింది ఎలాగైన ICWA లొ ర్యాంక్ సాథించాలని నిర్ణయం తీసుకున్నాడు. క్లాస్ లో ఉన్న100 మంది లో తను ఒక్కడే అంధుడు అయినా ఎక్కడా దిగులు చెందలేదు , క్లాస్ లొ చెప్పిన లెసన్స్ అన్నీ రోజు ఇంట్లొ understand చేస్కొని స్నేహితులతో discuss చేసేవాడు, ఎటువంటి సందేహం వచ్చినా వెంటనే అధ్యపకులని సంప్రదించేవడు. పరిక్ష సమయంలో బ్రైలీ లిపి లోరాయటానికి కుదరకపొయేసరికి ఆ కోర్సు తో సంబంధం లేని వ్యక్తి సహాయం తో అన్ని రౌండ్స్ ని complete చేసి ఆల్ ఇండియ ర్యాంక్ సాధించాడు. అతని ప్రయాణం ఇంతటితో ఆగలేదు CA కూడా పూర్తిచేస్తాను అని చెప్తున్నాడు. అతను CA కూడా పుర్తి చేసి ఇంకా ఎన్నో శిఖరాలను అదిరోహించాలని ఛాయ్ బిస్కెట్ కోరుకుంటుంది.
రవితేజ జీవితం ఎంతో మందికి స్పూర్తినిస్తుంది, అతని కథని వినే ఎన్నొ జీవిత సత్యాలు అర్ధమవుతాయి. విధి వంచించిన మనిషికి సంకల్పం ఉంటే ఎదైన, ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చు. నిత్యం తన వెంటే ఉండి నిరంతరం తనకి సేవ చేస్తూ అతని విజయంలో కీలక పాత్ర పోషించిన అతని తల్లి తండ్రులకు మా వందనములు.
సామాన్య విద్యార్థులకే కష్టమైన ICWA కొర్సుని ఈ చూపులేని విద్యార్ధి సాధించాడు!
