మానవ సేవనే మాధవ సేవ.. కష్టాలలో ఉన్న సాటి మనిషికి సాయం చేస్తే ఆ దేవునికి చేసినట్టే. ఆ గొప్పమాటను సరిగ్గా పాటిస్తు ఎంతోమందికి సేవ చేస్తున్న పి.పి. రెడ్డి గురుంచి తెలుసుకుందాం..
కృష్ణాజిల్లా డోకిపర్రు గ్రామంలో ఒకప్పుడు అన్నీ సమస్యలే కరెంట్ సమస్యలు, నీటి సమస్య, ఇలా రకరకాల సమస్యలుండేవి.. అక్కడి ప్రజలకు వీటిని ఎలా పరిష్కరించాలో దానికోసం ఏ అధికారులను సంప్రదించాలో తెలియదు.. నాయకులను తమ సమస్యలను మొరపెట్టుకుని సంవత్సరాలు గడుస్తున్న ఏ మాత్రం పురోగతి లేదు...

అప్పుడే ఆ దయనీయ పరిస్థితులలోనే పారిశ్రామిక వేత్త పి.పి రెడ్డి రంగ ప్రవేశం జరిగింది. ఇక ఆరోజు నుండే దశాబ్ధాల తరబడి ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించి ఎన్నో సధుపాయాలను కల్పించారు.. కల్పిస్తున్నారు.

పిపి రెడ్డి ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఇంజనీరింగ్ పూర్తిచేయగానే అందరిలాగే అమెరికా అంటూ ఆలోచనలు పెట్టుకోకుండా ఇక్కడే Mega engineering & infrastructures Ltd వ్యాపారాన్ని కొనసాగిస్తు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో వేలకోట్ల ప్రాజెక్టులు పూర్తిచేస్తుంది.. మనదేశంలో 19రాష్ట్రాలు, 6దేశాలలో వేలకోట్లల్లో ప్రాజెక్టులను పూర్తిచేస్తుంది. ఇంతటి గొప్ప సంస్థకు అధినేత ఐన పి.పి రెడ్డి డోకిపర్రు గ్రామాన్ని దత్తత తీసుకొని ఎన్నో కోట్లరూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు. ఇందుకు కారణం తన తల్లి, తాను పుట్టి పెరిగిన ఊరు అదే.. జన్మనిచ్చిన కన్నతల్లిని పుట్టిన ఊరుని మరవకూడదు అనే ఉద్దేశ్యంతో తన గ్రామాన్ని తానే మారుస్తున్నాడు.

ఇక్కడ ఉన్న 450 కుటుంబాలకు ప్రతి ఇంటికి ఒక పెద్దకొడుకులా సేవచేస్తున్నారు. అక్కడ ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ తాగుతారు, ప్రతి ఒక్క ఇంటికి రెండు బల్పులు ఒక ఫ్యాన్ వరకు కరెంట్ ఉచితంగా లభిస్తుంది, నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్స్, ఉచిత కళ్యాణ మండపాలు, 15,000తో ప్రతి ఇంటికి ఓ మోడల్ టాయిలెట్, సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరికి కొత్తబట్టలు, చదువుకున్న ప్రతి ఒక్కరికి తన కంపెనీలోనే ఉద్యోగం.

ఇక్కడి దేవలయమే 7 కోట్ల రూపాయలతో నిర్మించారంటే ఏ స్థాయిలో ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.