మహాత్మ గాంధీకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఒకరోజు బాగా డబ్బున్న ఒక పిల్లవాడు గాంధీ ఉన్న సబర్మతి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ బాబు బాపు వేసుకున్న బట్టలు చూసి ఇంతటి గొప్ప వ్యక్తి కనీసం చొక్కావేసుకోకుండా ఉన్నాడు అసలు బట్టలు వేసుకోవడం కూడా రాదా అని అనుకున్నాడు. మహాత్ముడితో ఆ బాబు ఇలా మాట్లాడాడు..
"నువ్వెందుకు ఖరీదైన కుర్త వేసుకోవు గాంధీ" "నా దగ్గర డబ్బులెక్కడున్నాయి నాన్న నేను చాలా పేదవాడిని నాకు కుర్త కొనేంత డబ్బులులేవు.." గాంధీ ఆత్మీయంగా బదులిచ్చాడు ఆ బాబు అంతే కదా అన్నట్టుగా చూస్తు.. "మా అమ్మ చాలా బాగా కుడుతుంది నా బట్టలు తనే కుడుతుంది నీకోసం కూడా కుట్టమని చెబుతా" "మీ అమ్మగారు ఎన్ని కుర్తాలు కుట్టగలరు..?" గాంధీ అతని కళ్లల్లోకి చూస్తు అడిగారు "నీకెన్ని కావాలంటే అన్ని ఒకటా? రెండా? మూడా?" ... బాబు Curiosityతో అడిగాడు గాంధీ కొంతసేపు ఆలోచిస్తు వేళ్ళను తడుముకుంటూ లెక్కలు వేస్తున్నాడు. "నేను ఒంటరిని కాదు నాకు పెద్ద కుటుంబం ఉంది. వాళ్ళందరికి కూడా కుర్తాలు కుడితేనే నేను వేసుకునేది..." అని నవ్వతు అన్నాడు గాంధీ "ఓ అంతే కాదా మీ ఫ్యామిలీ మొత్తం ఎంతమంది..? ఒక పది మంది ఉంటారా ?" "40కోట్ల సోదరీ సోదరిమనులున్నారు నాకు వాళ్ళు కూడా నాలాగే చినిగిన పాత బట్టలు వేసుకుంటున్నారు.." పిల్లవాడు ఆశ్చర్యంగా చూస్తు ఉండిపోయాడు...
"నా కుటుంబ సభ్యులు అలా చినిగిన పాత బట్టలు వేసుకుంటుంటే నేను ఒక్కడిని నీలా ఖరీదైన కుర్తా వేసుకోలేను బాబు.. మా కుటుంబం అంతటికి సరిపడా కుర్తాలు తీసుకువస్తే నేను ఆనందంగా వేసుకుంటా..." అని జాతిపిత వివరించాడు.
స్వాతంత్ర్యం వచ్చినా గాని సాటి భారతీయులు Afford చేయలేనివి ఏవి మహత్ముడు తృణప్రాయంగా ఒదిలేశాడు.. సాటి భారతీయులు అలాంటి దయనీయ పరిస్థితిలో ఉంటే తను కూడా అలాంటి దోతిలోనే ఉండేవారు.. నిజంగా మహాత్మ గాంధీ ఎందుకు మహత్ముడు అయ్యాడో ఈ ఒక్క సంఘటన ద్వారా తెలుసుకొవచ్చు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.