Holi అంటే Hindu Religions Festival అని మాత్రమే తెలుసుగాని అసలు Holi అంటే ఏంటి? మనం దానిని ఎందుకు జరుపుకోవాలి అనేది చాల తక్కువ మందికే తెలుసు అలాగే మనం కూడా తెలుసుకుందాం. ద్వాపరి యుగంలో హిరణ్యకశ్యపుడు అనే నీచ రాజు ఉండేవాడు బ్రహ్మదేవుడి నుండి లభించిన వరంతో విశ్వాన్ని శాసించాలనుకుంటుండే వాడు. కాని అతని కొడుకు ప్రహ్లాదుడు విష్ణువునే పూజించేవాడు... ఆ నారాయణుడు నా ముందు బచ్చాగాడు అతన్ని కాదు నేనే దేవుడ్ని నన్నే పూజించు అని హిరణ్యకశ్యపుడు....ఇంకా అతని తమ్ముడుని చంపాడాని శ్రీ మహా విష్ణువు మీద చాల కోపం. ఎంతచెప్పిన మాట వినక పోవడంతో ప్రహ్లాదుడిని చంపాలనుకుంటాడు గొంతులో విషం పోసినా అమృతంలా మారేది కత్తులతో శరీరాన్ని ముక్కలు చేద్దామనుకున్న ప్రహ్లాదుడికి ఏమి కాకపోయేది ఇలా కాదని హిరణ్యకష్యపుడి చెల్లలు హోళిక తన ఒంటిమీద మాయ శాలువ కప్పుకొని ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చొబెట్టుకొని మంటల్లో కూర్చుంటుంది మాయ శాలువ వల్ల తనకేం కాదు కాని మంటల్లోన్న ప్రహ్లాదుడిని శ్రీ మహావిష్ణువు కాపాడి హోళిక శాలువ తీసి అగ్నికి ఆహరంగా వేస్తాడు...అప్పటినుండి హోళిక మరణాన్ని చెడుపై మంచి జరిగిన యుద్ధంగా హోలి జరుపుకుంటారు. అలాగే ఇంకో కథ కూడా మన శివపురాణంలో ఉంది.
పరమేశ్వరుడు ఘోర తపస్సులో ఉన్నప్పుడు సాధారణంగా శివుడు ఏ విరామం లేకుండా 1000 సంవత్సరాలు తపస్సు చేయగలడు. ఇలా తపస్సులో ఉండగా ఒకరోజు మన్మధుడు శివుడి తపస్సుని భగ్నం చేయడానికి మన్మధుడు కామ బాణాల్ని సాంధిస్తాడు... ఇది గమనించిన రుద్రుడు ప్రళయ రుద్రడు అయి తన త్రినేత్రంతో మన్మధుడుని భస్మం చేస్తాడు ఈ సంఘటనను చూసి తట్టుకోలేక మన్మధుని భార్య రతీదేవి ఇంకా దేవతలు వచ్చి ప్రజలకు కామం కలిగించకుంటే సృష్టి కొనసాగదు అని శివుడుని వేడుకొనగా శివుడు తిరిగి మన్మధునికి శరీరాన్ని ఇస్తాడు కానీ ఈ శరీరం రతీదేవికి మాత్రమే కనిపిస్తుంది. అలాగే కామాన్ని చంపిన రోజుకుడా కామదహనం జరుపుకుంటారు. ద్వాపరి యుగంలో శ్రీకృష్ణుడు గోపికలతో రంగుల హోలి ఆడటం వల్ల అప్పటినుండి ఇప్పటివరకు మనం కూడా రంగులలతో హోలి ఆడుకుంటాం. అంతా బాగానే ఉంది కాని ప్రతి పండుగలో మనం నేర్చుకోవాల్సిన మంచి విషయాలు ఉన్నట్టు ఈ పండుగ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి.
రంగులు వాడడం: మనకిష్టమైన వారికి పూస్తున్న రంగులు కేవలం వాళ్ళని Tease చేయడానికి కాదు రాబోయే రోజుల్లో వారి జీవితం Colorful ఉండాలని భాదలన్ని తొలగిపోయి సంతోషంగా వారి జీవితం ఆనందాల రంగుల మయం కావలని మనం రంగులు పూస్తాము.
కామదహనం: శివుడికి మాత్రమే మన్మధుడిని చంపేంత శక్తి లేదు మనందరికి కూడా ఉంది... కామం ఉన్న చోట మన లక్ష్యం మీద సరైన విధంగా Concentration చేయలేము ప్రతి ఒక్కరిలో శివుడు ఉన్నట్టుగానే కామం కూడా ఉంటుంది కామం నుండే కోపం,ఈర్ష్యా,ద్వేషాలాకి మూలం వీటన్నీటికి కేంద్రమైన కామాన్ని అదుపులో ఉంచడానికే కామదహణ వేడుక.
మతసామరస్యం: ఏ వయసు తారతమ్యం లేకుండా చిన్న పెద్ధ అనే తేడానే కాదు చాల చోట్ల మతాల పట్టింపులు అనే భేదం లేకుండా అందరు కలిసిపోవడానికి రిలేటివ్స్ ల మధ్య ఉన్న చిన్నపాటి గొడవలు అన్ని మరచి మనస్పూర్తిగా కలవడానికి,రోజువారి పని ఒత్తిడి,Personal Problems అన్ని మరిచిపోయి ఎంజాయ్ చేయడానికి మంచి రిలీఫ్ ఇచ్చే పండుగ.
Only Enjoyment: ఏ జాగరం, పూజలు, ఉపవాసాలు ఇంట్లో అమ్మకు పిండిబట్టలు చేసే భాద గాని నాన్న జేబుకు చిల్లు పెట్టేలా కొత్తబట్టలు కొనుక్కోవడాలు, పొద్ధున్నే లేచి స్నానం చేసి గుడికి వేళ్ళడాలు ఇంకా శాకహరం మాత్రమే తినాలనే హద్ధు అంటు ఇవ్వేమి ఉండవు హోలి లో.. యే హద్ధు ఆర్భటాలుండవు Only Enjoyment.