కృష్ణంరాజు గారి పేరులోనే కాదు ఆయన వ్యక్తిత్వం లోను రాజు ఉన్నారు. కృష్ణం రాజు గారు అంటే గొప్ప నటుడు మాత్రమే కాదు అంతే గొప్ప మానవత్వం నిండిన మంచి మనిషి. వారి 50 సంవత్సరాల తెలుగు సినీ ప్రస్థానంలో ఎన్నో ఓటములు అంతకు మించి ఎన్నో గెలుపులను అందుకున్న కాని తనకున్న మంచి వ్యక్తిత్వాన్ని ఎప్పుడు వదులుకోలేదు. ఆయన ఇంటికి ఎవరు వచ్చిన కాని వారిని ఒక కుటుంబ సభ్యునిగా పలుకరించి ఆప్యాయంగా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు. ఆయన సినిమా చేస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు కూడా అంతే. ప్రభాస్ బిల్లా సినిమా సమయంలో దాదాపు 20మందికి పైగా వంట మనుషులను మలేషియా తీసుకెళ్ళి మూవి టీం అందరికి ప్రేమగా భోజనం పెట్టారు.

ఇండియాలో షూటింగ్ అంటే వేరు విషయం కాని వేరే దేశంలో జరిగే షూటింగ్ లో కూడా ఇదే విధంగా ప్రేమను చూపించడం అనేది అత్యంత అరుదు. ఈ విషయంలో ఇండస్ట్రీలో ఆయన తరువాతే ఎవరైనా. ఇదే విషయం మీద ఆయనేం చెప్తారంటే 'నేను తింటున్నప్పుడు ఎంత ఆనంద పడతానో ఎదుటివారు తినేటప్పుడు కూడా అంతే ఆనందపడతాను' అని అంటారు. కృష్ణంరాజు గారు ఆయన తాతల నుండి ఈ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ రోజుల్లో వ్యవసాయ కూలీలు పనిలేని రోజుల్లో భోజనం కోసం అవస్థలు పడుతుంటే కృష్ణంరాజు గారి నాన్న గారు ఇంటి నుండి ఎన్నోవందల కుటుంబాలకు బియ్యం బస్తాలను అందించేవారు.
మిగిలిన వారిలా ఇండస్ట్రీలోకి రావడానికి కృష్ణంరాజు గారు పెద్ద కష్టాలు అనుభవించకపోయినా కాని తనకు ఎదురైన ప్రతి సమస్యను, ఆటంకాన్ని అవకాశంగా మలుచుకుని ఒక్కో మెట్టుగా ఎక్కుతూ ఉన్నతంగా ఎదిగారు. మొదటి సినిమా చిలుక గోరింక(1966) లో హీరోగా చేసి ఆ తర్వాత 'నేనంటే నేనే' సినిమాలో విలన్ గా విభిన్నంగా కనిపించి, నటించి అప్పటి వరకు చూడని ఒక కొత్త విలన్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. కృష్ణంరాజు గారు హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు 200కు పైగా సినిమాలలో నటించి రెండు నంది అవార్ఢులు, మూడు ఫిల్మ్ ఫేయిర్ అవార్ఢులు, రెండు సినిమాలకు రాష్ట్రపతి గారి నుండి అవార్ఢులను అందుకున్నారు. ఆ తర్వాత సినిమాలలో కాదు నిజమైన హీరోయిజం ప్రజాసేవలో చూపించాలి అన్న బలమైన సంకల్పంతో రాజకీయలలో ప్రవేశించి ఎంపి గా, కేంద్ర మంత్రిగా తనదైన శైళిలో ప్రజలకు సేవచేశారు.
కృష్ణంరాజు గారి అద్భుత నటనకు కొన్ని మచ్చుతునకలు
అమరదీపం

బొబ్బిలి బ్రహ్మన్న

భక్త కన్నప్ప

తాండ్ర పాపారాయుడు

మన ఊరి పాండవులు

కృష్ణవేణి

జీవన తరంగాలు

కటకటాల రుద్రయ్య

రంగూన్ రౌడి

త్రిశూలం

మా నాన్నకి పెళ్లి

బుల్లెట్

బావ బావమరిది

పల్నాటి పౌరుషం

రెబల్

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.