భూమి మీదకు రాకమునుపే ప్రకృతి మనకోసం లోకాన్ని అందంగా తీర్చిదిద్దిపెట్టింది. ఇక్కడ అందం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆహ్లాదం ఉంది, శాంతి ఉంది, ఊరికే అలా చూడడం కోసం ఇంకేవో ఉన్నాయి. ఇదే కాదు మనకు నచ్చినట్టుగా మార్పులు చేసుకోవడానికి ప్రకృతి మనకు అపారమైన స్వేచ్ఛ కూడా ఇచ్చింది.. ముడి పదార్ధాలను ఇచ్చింది.. ఇక మిగిలినదంతా మన క్రియేటివిటీ, మరొకరికి ఇబ్బంది కలిగించకుండా మన ఇష్టం వచ్చినట్టుగా ఇంటిని, ఇంటి చుట్టూ పరిసరాలను, ఆఫీస్ ను మార్చుకోవచ్చు.. ఈ వాస్తవం నుండే ఇద్దరు వ్యక్తులు తమ కెరీర్ ను ఎంచుకున్నారు. ఝాన్సి, ఫణి మన ఊహలకు వారధులు.. "ఇదిగో ఈ చోట ఇటాలియన్ మార్బుల్స్ ఉండాలి, ఇంటి డోర్ కాలింగ్ బెల్ పక్కన బాపు గారి స్వాగతం బొమ్మ ఉండాలి, ఇంటి కిచెన్ లో కూడా మొక్కలుండాలి.." ఇలా మన ఏ ఉహానైన వీరిద్దరూ నిజం చెయ్యడానికి ప్రయత్నిస్తారు.




ఫణి, ఝాన్సి గారు "కటింగ్ ఎడ్జ్ డిజైనింగ్ స్టూడియో" ప్రారంభించి ఇప్పటికి పది సంవత్సరాలు కావస్తోంది. "జయభేరి, రాంకీ గేటెడ్ కమ్యూనిటీ, మెఫెయిర్ విల్లాలు, లోథా, మై హోమ్ అభ్రా, చెన్నై ఐస్ బర్గ్, రాజపుష్ప, అపర్ణ ఇలా 400కు పైగా ఆఫీసులు, విల్లాలు, ఇండిపెండెంట్, ఫార్మ్ హౌస్ లు డిజైన్ చేస్తూ హైదరాబాద్ లోనే మేటి డిజైనర్లలలో ఒకరిగా నిలిచారు.




రీసెర్చ్: ముందుగా కస్టమర్ అభిరుచి తెలుసుకున్న వెంటనే హడావుడిగా, త్వరగా వారి కళ్ల ముందుంచాలనే ఆతృత కన్నా, వారి ఊహను దాటి మరింత ఉపయోగకరంగా, మరింత అందంగా నాణ్యతతో డిజైన్ చెయ్యడం వీరి లక్షణం. కటింగ్ ఎడ్జ్ ప్రారంభించిన కొత్తలోనే కాదు వారిని వారు అధిగమించడం కోసం ఇప్పటికి స్ట్రగుల్ అవుతుంటామని అంటుంటారు. కష్టమర్స్ కు రకరకాల అభిరుచులు ఉంటాయి కొంతమంది పూర్తిగా వర్ణించగలరు, మరికొందరు ఇంత బడ్జెట్ లోనే పూర్తిచేయ్యాలనే కోరుకుంటారు.. ఎవరి ఇష్టం వారిది. రకరకాల వ్యక్తిత్వాలకు రకరకాల అభిరుచులు.. వీటన్నిటికి ఒక రూపం తీసుకురావడం మాములు విషయం కాదు. ఝాన్సి ఫణి లకు ఇందులో విశేషమైన అనుభవం, దేశ, విదేశాల ఫర్నిచర్, వారి స్టైల్ పై అవగాహన ఉండడం వల్ల కలలను సాధ్యం చేస్తున్నారు.




ఇద్దరూ ఇంజినీర్లే: ఝాన్సి ఫణి ఇద్దరూ హైదరాబాద్ లో పుట్టిపెరిగారు. ఇద్దరూ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఫణి అమెరికాలో ఎమ్మెస్ చదివాక బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని అనుకున్నారు. ఇద్దరికీ ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ప్రేమ ఉండడం వల్ల దానితోనే ఎక్కువ సమయం గడిపితే మనసుకు నచ్చిన పని, మంచి గుర్తింపు, సంపాదన కూడా బాగుంటుందని డిజైనింగ్ రంగంలో ఉదయించారు. ఇద్దరికీ సినిమాలన్నా, ఏది చేసినా క్రియేటివ్ గా చెయ్యడమన్నా చాలా ఇష్టం. కటింగ్ ఎడ్జ్ ప్రారంభించిన కొత్తలో తెలిసినవారి ఇల్లు ఆఫీస్ కోసం పని చేశారు. మౌత్ పబ్లిసిటీకి మించిన పబ్లిసిటీ మరొకటి లేదు కనుక అనతి కాలంలోనే కటింగ్ ఎడ్జ్ డిజైనింగ్ స్టూడియో పేరు ఒకరి నుండి మరొకరికి వ్యాపించి హైదరాబాద్ లోనే బెస్ట్ డిజైనర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.




ఆఫీస్, ఇల్లు: ఇప్పుడు ఎంప్లాయ్ కంఫర్టబుల్ ముఖ్యం, అతను హ్యాపీగా ఉంటేనే బెస్ట్ వర్క్ వస్తుంది. ఒక టేబుల్, కంప్యూటర్, కుర్చీ దాని ముందు ఇబ్బందిగా ఉన్నా కూర్చోవాల్సిన పని లేదు. కూర్చుని కూర్చుని అలసటగా ఉందా.? ఆఫీస్ లోనే రెస్ట్ రూమ్ ఉంటుంది అక్కడ హాయిగా బెడ్ మీద ఒరిగి పని చేసుకోవచ్చు. బోరింగ్ గా ఉందా..? పక్కనే స్నూకర్, టేబుల్ టెన్నిస్ లాంటివి ఆడుకోవచ్చు, ఆకలిగా ఉందా.? ఐతే కిచెన్ లో వేడివేడిగా ఏదైనా చేసుకొని తినొచ్చు, కాసేపు ఎవరితోనైనా ఫోన్ మాట్లాడుదాం పక్కనే ఫోన్ మాట్లాడుకోవడం కోసం మరో రూమ్, జిమ్, స్విమ్మింగ్ పూల్ ఇలా ఉద్యోగి కంఫర్టబుల్ కోసం ఝాన్సి ఫణి ఆఫీస్ లో ఎన్నో చెంజెస్ తీసుకువస్తున్నారు. అలాగే మనం ఎక్కువ సమయం గడిపే ఇంటి విషయంలోనూ మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇంటి ఎంట్రన్స్ దగ్గరి నుండి ఇంటీరియర్ గార్డెన్ వరకు అన్నీ కూడా మన అభిరుచులను తెలియజేసే విధంగా మన ఊహలను వీరు నిజం చేస్తారు. ప్రత్యేకంగా గ్రాఫిక్ డిజైనర్స్, ఇన్ హవుస్ కార్పెంటర్స్, మొదలైన ఉద్యోగస్తులు వీరి అదనపు బలం.




You can Contact Them: Phone: 96180 44567 Facebook page: CLICK HERE Website: https://cuttingedgeds.com/