మానవుల పుట్టుకకు అమ్మ ఒడి భారత దేశం.. మానవులు మాటలు నేర్చింది అక్కడే కొండ కోనల్లో ఊయల లూగిందీ అక్కడే.. మానవుని చరిత్ర ఆరంభం అయిందీ అక్కడే.. మిగతా దేశాలు కన్నులు కూడా తెరవక ముందే సంస్కృతీ పరిమళాలు విరజిమ్మింది అక్కడే. భారత దేశం మా పాశ్చాత్యులకు అమ్మమ్మ ఒడి వంటిది. మానవ జాతి చరిత్రకు సంబంధించిన తొలినాళ్ళ ఆనవాళ్ళన్నీ భారత్ లోనే జరిగాయి.. -మార్క్ ట్వైన్
"పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే" అనే మన శ్లోకంలోనే అంతర్లీనంగా ఉంది మాథ్స్ లో మనం వాడే ఇన్ఫినిటీ కున్న అర్ధం..
"ఏకతాయ స్వాహా ద్వితాయ స్వాహా త్రితాయ స్వాహా" ఈ శ్లోకాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే ఇందులోను ద్వితా నుండి డ్యూటీరియమ్, త్రితా నుండి ట్రిటియమ్ మారిందని తెలుస్తుంది.
కేవలం ఇవ్వి మాత్రమే కాదు ఆర్యభట్ట, వరాహమిహిరుడు సైన్, కాస్ గురించి వేరే భాషలో వర్ణించారని, న్యూటన్ కన్నా ముందే మన భాస్కరాచార్యుడు భూమ్యాకర్షణ సిద్దాంతం గురించి తన "సిద్దాంత శిరోమణి"లో పూర్తిగా వివరించారని కేవలం మాటలతో కాదు ఉదాహరణలతో సహా నిన్నటితరానికి నేటి తరానికి వివరిస్తున్న గొప్ప వ్యక్తి డా. రేమెళ్ల అవధానులు గారు.
పరిశోధనకు దారి తీసిన కారణాలు: అవధానులు గారు 1969లో న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ చేసిన తర్వాత కొంతకాలం లెక్చరర్ గా పనిచేశారు. ప్రతిరోజు కాలేజ్ కి వెళ్ళి వచ్చాక ఖాళీ సమయం ఉండడంతో వేద పాఠశాలలో వేదం నేర్చుకునేవారు. అప్పుడే ఆ సమయంలోనే సైన్స్ కు మన వేదానికి ఏదో సంబంధం ఉన్నట్టుగా అనుమానాలు రేకెత్తేవి. ఆ తర్వాత హైదరాబాద్ ఈసిఐఎల్ లో టెక్నికల్ ఆఫీసర్ గా ఉద్యోగం రావడం జరిగింది. వృత్తి పరంగా తాన విధులు ఎంత నియమబద్దంగా చేసేవారో అలాగే మన సంస్కృతి సాంప్రదాయలను కూడా అంతే గౌరవించడం దానిలో మరేదో సైన్స్ దాగుందని పరిశోధనలు చేసేవారు. అలా మన తెలుగు మీద ప్రేమతో 1976 భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన తెలుగు అక్షరాలను కంప్యూటర్ లోకి తీసుకువచ్చారు.
వేదాల రక్షణ: భగవంతుడు సృష్టికి అందించిన వేదాలలో 1131 శాకలుండేవి. అందులో మానవుని ప్రయాణం జరుగుతున్న కొద్ది చాలా వరకు అంతరించిపోతున్నాయని తెలుసింది. ఈ వేదాలు దేశ, జాతి సంపద కాదు సకల మానవాళి సంపద దీనిని కాపాడుకోవాలి అని చెప్పి 1992నుండి వేదాలను ప్రపంచంలోనే మొదటిసారిగా అవధానులు గారే రికార్డింగ్ చేయడం మొదలుపెట్టారు. తాను నేర్చుకున్న యజుర్వేదం మాత్రమే కాదు ఋగ్వేదం, సామవేదం, అధర్వణవేదము లను పూర్తిగా తెలిసిన వారితో రికార్డింగ్ చేశారు. దీనికి అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ గారు ఎంతో సంతోషించారు. ఆ తర్వాత వేదభారతి అనే అనే వెబ్ సైట్ స్టార్ట్ చేసి అందులో వేదాలను నిక్షిప్తం చేశారు. భారతదేశం సకల వనరులు మాత్రమే కాదు మేధో సంపదలో కూడా ఉన్నతమైనది అని నిరూపించడం కోరకు వేదాలలో సైన్స్ మీద పి.హెచ్.డి చేసి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో అందించారు.
బ్రిటీష్ వారు, మహ్మదీయులు, డచ్, పోర్చ్ గీస్ మొదలైనవారు మన దేశంపై దండెత్తి వనరులను మాత్రమే కాదు మన చరిత్రను సైతం ధ్వంసం చేయడానికి తెగబడ్డారు. మన సంస్కృతిని కాపాడుకునేందుకు వాటిని భవిషత్తు తరాలకు అందించడానికి అవధానూలు గారు దశాబ్దాల చేసిన కృషి అనితర సాధ్యం అని వర్ణించుకోవచ్చు.