బతికి బావుకునేది ఏది లేదని చావబోకు.. చచ్చి సాధించేది ఏది లేదని బతకబోకు!! బతికి సాధించు.. - అక్కినేని నాగేశ్వర రావు.
నిజంగా ఈ పదాలకు తగ్గట్టుగానే నాగేశ్వరరావు గారు బ్రతికి సాధించారు. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో దాదాపు 75 సంవత్సరాలు పాటు నటించి మన ముత్తాత, తాత, తండ్రి, ఈరోజుల్లో మన యువతను ఇలా తర తరాలుగా తెలుగు ప్రేక్షకులను Entertain చేశారు పద్మవిభూషణ్ డా. అక్కినేని నాగేశ్వర రావు గారు. ఆయన ఘన చరిత్ర గురుంచి మరియు ఆయన ఎంతటి గొప్పవారో మరొక్కసారి గుర్తుచేసుకుందాం.
1924 సెప్టెంబర్ 20వ తేదిన కృష్ణా జిల్లా నందివాడలోని రామాపురం అనే ఒక వెనుకబడిన పల్లెటూరులో జన్మించారు. అమ్మ నాన్నలకు అక్షరం ముక్కరాదు.. తల్లిదండ్రులకు కలిగిన ఐదుగురు సంతానంలో మిగిలిన వారి కన్నా మన నాగేశ్వర రావు గారే అత్యధికంగా 4వ తరగతి వరకు చదువుకున్నది. చిన్నప్పటి నుండి నటన, నాటకాలలో ఇష్టం ఉండటంతో వారు కూడా ప్రోత్సాహం ఇవ్వడంతో ముందు చిన్న చిన్న నాటకాలలో వేశాలేశారు.. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో, సినిమాల ద్వారా కోట్లు సంపాదించిన మన అక్కినేని వారి మొదటి సంపాదన అర్ధ రూపాయి.
నాటకాలలో నాగేశ్వర రావు అభినయాలను చూసి మొదటిసారిగా పి. పుల్లయ్య తన దర్శకత్వంలో తీసిన ధర్మపత్ని(1941) సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తరువాత మొదటిసారి హీరోగా సీతారామ జననం సినిమాలో నటించారు. నిజానికి అక్కినేని వారు గొప్ప నటుడు మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వయసున్న వ్యక్తి(91). జెమిని గణేషన్, శివాజీ గణేషన్, నందమూరి తారక రామారావు లాంటి దిగ్గజాల కన్నా ముందే పరిశ్రమలోకి ప్రవేశించి అభిమాల గుండెల్లో మొదటి స్టార్ గా కీర్తినందుకున్నారు. నేనే ఎక్కువ మిగితా వారు నా తర్వాతే అన్నట్టుగా కాకుండా తన తోటి నటులతో కూడా మంచి స్నేహ బంధాన్ని కొనసాగించారు. ఎన్.టి. రామారావు గారితో దాదాపు 15 సినిమాలలో కలిసి నటించారు ఇప్పటికి వారిద్దరి కుటుంబ సభ్యులు కూడా అన్న తమ్ముళ్ళ ల భావించి అదే వరుసులతో పలుకరించుకుంటారు. ఇప్పుడంటే తోటి నటుల మధ్య పోటితత్వంతో సినిమాలలోని పవర్ పుల్ డైలాగ్స్ తో ఒక హీరోని మరొక హీరో కించపరుస్తున్నారు కాని అక్కినేని వారి కుటుంబం మరియు వారి తర్వాతి తరం కూడా అదే మంచి సంప్రదాయన్ని పాటిస్తున్నారు.. ఇది వారు అందించిన విలువలకు నిదర్శనం.
కమల్ హాసన్ దశావతరంలో పది పాత్రలలో నటిస్తే మన అక్కినేని వారు టెక్నాలజీ ఏ మాత్రం అభివృద్ది చెందని బ్లాక్ అండ్ వైట్ కాలంలో నవరాత్రి అనే సినిమాలో 9 పాత్రలలో నటించి చరిత్ర సృష్టించారు. ఈరోజుల్లో అమ్మాయిలు ఎక్కువగా మహేష్ బాబు, నాగర్జున, ప్రభాస్ అభిమానిస్తే ఆ కాలంలో మాత్రం వారి అభిమాన హీరో అక్కినేని నాగేశ్వర రావు గారే.. నటనలో అటు పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు(మాయాబజార్), విష్ణువు (చెంచులక్ష్మి), నారదుడు (భూకైలాస్), అర్జునుడు (శ్రీకృష్ణార్జున యుద్ధం ) లాంటి పాత్రలు చేస్తునే ఇటు స్టోరి కాన్సెప్ట్ ఓరియెంటడ్ సినిమాలలో కూడా నటించేవారు. దేవదాసు, ప్రేమాభిషేకం లాంటి సినిమాలలో ఆయన చేసే నటనను చూస్తే ఆయనొక పెద్ధ తాగుబోతు ఏమో అని చాలా మంది అపోహ పడుతుంటారు కాని ఆయన జీవితంలో కేవలం చాలా తక్కువ సార్లు మాత్రమే తీసుకున్నారు. సినీ పరిశ్రమ లోకి వచ్చేముందు తల్లికి ఇచ్చిన మాటగా ఏ మహిళతో అసభ్యంగా ప్రవర్తించకుండా ఇండస్ట్రీలో మచ్చలేని చంద్రుడిగా ఉన్నారు.
1974లో హార్ట్ ఎటాక్ వస్తే అదే సంవత్సరంలో బై పాస్ సర్జరీ చేశారు సాధారణంగా ఈ సర్జరీ చేయించుకున్న వారు ఆయుష్షు అంతంత మాత్రమే కాని 1974 నుండి 2014 వరకు బ్రతికింది ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి మన నాగేశ్వర రావు గారు ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆయన ఎంతటి క్రమశిక్షణగా జీవితాన్ని గడిపారో అని తెలుసుకోవడానికి.. మద్రాస్ నుండి విడిపోయాక అక్కడి నుండి హైదరాబాద్ కు మన తెలుగు పరిశ్రమ రావడానికి ఎంతగానో కృషిచేశారు. ఆరోజుల్లో నటుడిగా అందుకున్న ప్రతి రూపాయిని అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి వెచ్చించారు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ ద్వారా ఎంతో మంది నూతన టెక్నిషియన్స్ లు ఆయన స్థాపించిన సంస్థ ద్వారా వస్తున్నారు. పుట్టి పెరిగిన సొంతూరుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి రియల్ లైఫ్ లో కూడా మంచి మనసున్న వ్యక్తిగా నిరుపించుకున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు గారు అందుకున్న గౌరవాలు:
విశిష్ట వ్యక్తి అవార్డు - సాహితి సాంస్కృతిక సంస్థ, తెనాలి(1988)
రాజ్ కపూర్ స్మారక అవార్డు(1989)
రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు(1989)
పద్మవిభూషణ్(2011)
పద్మ భూషణ్ (1988)
కాళిదాస్ సమ్మాన్ మధ్యప్రదేశ్
లైఫ్ టెమ్ అఛీవ్ మెంట్ అవార్డు - కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, పిట్స్ బర్గ్(1994)
అన్నా అవార్డు - జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, చెన్నై(1995)
పద్మశ్రీ - (1968)
ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారము(1996)
కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్)
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు - ఆర్. వెంకట్రామన్, భారత రాష్ట్రపతి(1991)
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.